S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/17/2018 - 03:43

హైదరాబాద్, అక్టోబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తనను బెదిరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందిరాపార్కును తరలింపును అడ్డుకుంటున్నందుకు తనను కేసీఆర్ బెదిరించారని చెప్పారు. మంగళవారం నాడు ఇందిరాపార్కులో అగ్నిప్రమాదం సంభవించిందనే సమాచారం తెలుసుకున్న డాక్టర్ కే. లక్ష్మణ్ అక్కడికి వచ్చారు.

10/17/2018 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ లాసెట్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ ఈ నెల 22న ప్రా రంభం కానుంది. ఇందుకోసం నాలుగు రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బీ ద్వారకానాధ్ చెప్పారు.

10/17/2018 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 16: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రోజు, రోజుకూ పెరుగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకుల చేరికలు, వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడిన నేతలు వెనక్కి వస్తున్నందున వారి ఉత్సాహం రెట్టింపు అవుతున్నది.

10/17/2018 - 03:27

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ గతిని మార్చే శక్తిసామర్థ్యాలు పుస్తకాలకు ఉంటాయని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు.

10/17/2018 - 03:26

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రముఖ ప్రింటింగ్ సంస్థ లలిత అండ్ కో అధినేత , ఆర్‌ఎస్‌ఎస్ నేత మార్టూరి రామారావు (87) మంగళవారం నాడు కన్నుమూశారు. మంగళవారం వేకువజామున ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 80 ఏళ్లకు పైగా లలిత అండ్ కో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

10/17/2018 - 03:25

హైదరాబాద్, అక్టోబర్ 16: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపాన్‌తో తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన 3వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. అత్యవసరంగా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో విద్యుత్ అధికారులు పరుగులుతీస్తున్నారు.

10/17/2018 - 03:24

హైదరాబాద్, అక్టోబర్ 16: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని విజయవంతం చేసేందుకు రైతులంతా సహకరించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కోరారు. సచివాలయంలో మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, రైతుబంధు పథకం ద్వారా వానాకాలం పంటలకు ఎకరాకు నాలుగువేల రూపాయల పెట్టుబడిని మేనెల వరకే ఇచ్చామని, అలాగే యాసంగి పంటకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు.

10/16/2018 - 17:15

హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో అవినీతిపై తాము చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలో 15 వేల గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని వెల్లడించారు.

10/16/2018 - 04:06

సిద్దిపేట, అక్టోబర్ 15: ఎన్నికల షెడ్యూల్ వెలువడి 10రోజులు కావస్తున్న సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్ మినహా మిగత పార్టీ అభ్యర్థులు ఖరారు కాకపోవటంతో ఆశావాహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సిద్దిపేట జిల్లా పరిధిలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజక వర్గాలున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అసెంబ్లీ రద్దు చేయటంతో పాటు 105 మంది అభ్యర్థులు ప్రకటించారు.

10/16/2018 - 02:58

నల్లగొండ, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించి మిగులు బడ్జెట్ తెలంగాణను లక్షన్నర కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Pages