S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/16/2018 - 02:56

కామారెడ్డి, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు హఠావో... కాంగ్రెస్‌కు జితావో అని ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడైన ఆర్‌సీ.కుంతియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

10/16/2018 - 02:52

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తెరాస అధినేత కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపడానికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

10/16/2018 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ ఉద్యమకారులను దూరంగా పెట్టి ద్రోహులను చేరదీస్తున్నారని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల రాములు నాయక్ నిప్పులు చెరిగారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఆర్‌ఎస్ ప్రకటించడం పట్ల రాములు నాయక్ తీవ్రంగా స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.

10/16/2018 - 02:42

హైదరాబాద్, అక్టోబర్ 15: రాష్ట్రంలో హాస్టళ్లకు అవసరమైన సన్నబియ్యం సేకరించేందుకు పౌరసరఫరాల శాఖ రెండువేలకోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

10/16/2018 - 02:40

హైదరాబాద్, అక్టోబర్ 15: మహాకూటమితో తాము తెగతెంపులు చేసుకోలేదని, కూటమిలో తమకు సముచిత స్థానం లభిస్తుందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్ రెడ్డి తెలిపారు.

10/16/2018 - 02:39

హైదరాబాద్, అక్టోబర్ 15: టీడీపీ నేత, మాజీ మంత్రి మల్యాల రాజయ్య సోమవారం కన్నుమూశారు. కొంత కాలం క్రితం రాజయ్య అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాడు ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజయ్య టీడీపీలో చేరారు.

10/16/2018 - 02:38

హైదరాబాద్, అక్టోబర్ 15: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, కొత్త హామీలు ఎలా ఇస్తారని టీ.పీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఏమైందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

10/15/2018 - 14:05

హైదరాబాద్: తెరాసా ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై తెరాసా వేటు వేసింది. రాములు మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆయనకు సీటు రాకపోవటంతో కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవారంనాడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించటంతో తెరాసా ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

10/15/2018 - 06:40

కల్వకుర్తి, అక్టోబర్ 14: దేశంలో మోదీ పాలన కంటే ముందు అవినీతి, దోపిడీ, మోసాలతో పరిపాలన కొనసాగించారని, దేశంలో సుపరిపాలన, అభివృద్ధి సాధనే ఆశయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకు సాగారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు.

10/15/2018 - 06:02

హైదరాబాద్, అక్టోబర్ 14: మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. 48 గంటల్లో తమకు 16 సీట్లు కేటాయించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఖండితంగా చెప్పినట్లు సమాచారం.

Pages