S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/10/2018 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకవైపు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు ఈ కమిషన్ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2018 డిసెంబర్ 7 న పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించి 2018 నవంబర్ 11 న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది.

10/10/2018 - 02:06

హైదరాబాద్, అక్టోబర్ 9: ఇంటర్ విద్య జాక్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జూనియర్ కాలేజీల మహిళా లెక్చరర్లు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/10/2018 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 9: గడీల పాలన అంతమయ్యే రోజు ఆసన్నమైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి చెప్పారు. ఈ మేరకు హరీష్‌రావుకు నర్సిరెడ్డి ఒక లేఖ రాశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే జేఏసీ నుండి టీడీపీని కోదండరామ్‌ను బహిష్కరించారని, లేఖలు రాయాల్సింది కాంగ్రెస్‌కో, కోదండరామ్‌కో, తెలుగుదేశం పార్టీకో కాదని, కేసీఆర్‌కు లేఖలు రాయాలని హరీష్‌రావుకు హితవుపలికారు.

10/10/2018 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో రబీ సీజన్‌లో ఎరువులను ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంగళవారం జారీ చేసిన అధికారిక లేఖలో ఆయన సూచించారు.

10/10/2018 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము మీడియాకు విడుదల చేసే ప్రకటనలకు సంబంధించి అనుమతి ఇచ్చే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకకమిటీని నియమించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ పేరుతో మంగళవారం ఒక జీఓ జారీ అయింది.

10/10/2018 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి రావడంతో ఉల్లంఘనలపై దృష్టి పెట్టింది. నియమావళి ఉల్లంఘనల సంఘటనలపై రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ మొదలుకుని గ్రామస్థాయిలోని రెవెన్యూ అధికారి వరకు దృష్టి పెట్టారు.

10/09/2018 - 12:33

శంకరపట్నం: తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో గడ్డి కుమార్‌ అనే యువకుడిని యువతి బంధువులే చంపేశారని బంధువులు అంటున్నారు. కుమార్ ఓయువతితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో గత రాత్రి తాడికల్ శివారులో కుమార్ శవమై కనిపించాడు. యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి బంధువులు అంటున్నారు. కుమార్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

10/09/2018 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఒంటరి పోరు సాగిస్తూనే ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. జాతీయ నాయకత్వం , రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని ఏడాది ముందుగానే స్పష్టం చేసి ఎన్నికల ప్రచారానికి బీజం వేసినా, అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ వెళ్లడంతో అది బీజేపీకి సైతం కలిసొచ్చింది.

10/09/2018 - 02:12

వరంగల్, అక్టోబర్ 8: దేశ భవిష్యత్‌ను రూపుదిద్దే ఆయుధం విద్యార్థుల చేతిలోనే ఉందని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం వరంగల్ ‘నిట్’లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం 2030 నాటికి మూడవ సంపన్న దేశంగా ఎదుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సరికొత్త పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆయన అన్నారు.

10/09/2018 - 02:06

పటన్‌చెరు, అక్టోబర్ 8: గొల్ల కుర్మల ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేసారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా యాదవుల కుల వృత్తులను గౌరవిస్తూ వారికి గొర్రె పిల్లలను సబ్సిడీపై పంపిణీ చేసిన ఘనత కేవలం ఆయనకే దక్కిందన్నారు.

Pages