S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/16/2018 - 02:30

కాచిగూడ, ఏప్రిల్ 15: సమాజానికి రామకృష్ణ దూత్ మార్గదర్శకుడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డా.సాంబిత్ పాత్ర అన్నారు. రాజస్థానీ గ్రాడ్యుయేట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ దూత్ 32వ సంస్మరణ సభ ఆదివారం నాంపల్లి ఎగ్జిమిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి సాంబిత్ పాత్ర పాల్గొని రామకృష్ణ దూత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించారు.

04/16/2018 - 02:24

హైదరాబాద్, ఏప్రిల్ 15: నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరాలైన నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ఎందరికో సరదా, కాలక్షేపానికి వేదిక అవుతుంటే, వివిధ కారణాలతో మనస్థాపానికి గురై మరణమే శరణ్యం అని భావించే మరి కొందరికి హుస్సేన్ సాగర్ ఆత్మహత్యలు చేసుకునేందుకు ఉపయోగపడుతోంది.

04/16/2018 - 00:21

హైదరాబాద్, ఏప్రిల్ 15: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేయాలని ఎంసిపిఐ(యు) నిర్ణయించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఎంసిపిఐ(యు) కీలక మహా సభలు ఆదివారంతో ముగిశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రంలో పార్టీ కేంద్ర కమిటీ 4వ జాతీయ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.

04/16/2018 - 00:20

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లను ఇచ్చే వినూత్న విధానానికి రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఈ దిశగా ఒక సమగ్ర ప్రణాళికను కూడా రూపొందించారు. ఆస్తుల గుర్తింపునకు శాటిలైట్ ఇమేజరీ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ జియో ట్యాగింగ్ విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ విజయవంతంగా పూర్తి చేసింది.

04/16/2018 - 05:02

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరువు శాశ్వతంగా దూరంకానుందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయని, 2018లోగా ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని స్పష్టం చేశారు.

04/16/2018 - 00:18

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలోని రైతాంగ సమస్యలపై ఆర్.నారాయణ మూర్తి నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ సినిమాకు అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోవర్దన్, నర్సింగ్ రావు, విమలక్క, రామాదేవి, రవిచందర్, సజయ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.

04/16/2018 - 00:18

హైదరాబాద్, ఏప్రిల్ 15: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావో ఉదంతం, జమ్మూలోని ఖతువాలో అసిఫాపై జరిగిన అత్యాచార ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 10 వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.

04/16/2018 - 00:17

హైదరాబాద్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వెంటనే మేడ్చల్ కలెక్టర్, రెవిన్యూ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.

04/14/2018 - 04:20

హైదరాబాద్, ఏప్రిల్ 13: కాన్పూర్ సెంట్రల్-కాచిగూడ-కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ల మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీల్లో కాన్పూర్ సెంట్రల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది.

04/14/2018 - 02:26

తిమ్మాపూర్, ఏప్రిల్ 13: మోయ తుమ్మెద వాగు పరిధిలో అక్రమంగా ఇసుకను నిల్వ చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతామని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎండి) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రావు హెచ్చరించారు. మండలంలోని ఎల్‌ఎండి కాలనీలోగల సీఐ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

Pages