S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/17/2018 - 03:25

హైదరాబాద్, ఏప్రిల్ 16: దళితులు, గిరిజనులను కాంగ్రెస్ నాయకులు అవమానించేలా విమర్శలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఖండించింది. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

04/17/2018 - 03:24

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 22న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి ఆర్ మధుసూధనరావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయించిందని ఆయన చెప్పారు.

04/17/2018 - 03:24

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా మారుద్దామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. సోమవారం నాడిక్కడ శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్‌లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు.

04/17/2018 - 03:23

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర నిర్లక్ష్యవైఖరిని ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

04/17/2018 - 03:23

హైదరాబాద్, ఏప్రిల్ 16: మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులో న్యాయం జరగలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పేలుళ్లపై నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2014 నుంచి ఎన్‌ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదని అన్నారు. సాక్ష్యాధారాలు, దర్యాప్తు సరిగ్గా చేపట్టకపోతే కోర్టు ఏం చేస్తుందని అన్నారు.

04/17/2018 - 03:22

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి బాగోతంపై సివిసి, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయం ఎందుకని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

04/17/2018 - 03:21

హైదరాబాద్, ఏప్రిల్ 16: పార్టీలతో కాదు ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకుటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ అన్నారు. సోమవారం మహాసభల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నట్టు చెప్పారు.

04/17/2018 - 03:20

సంగారెడ్డి, ఏప్రిల్ 16: సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. మండు వేసవిలో ప్రజల గొంతెండుతుంటే ప్రభు త్వం, అధికార యంత్రాంగం మాత్రం మిషన్ భగీరథ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిలదీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది.

04/17/2018 - 03:19

హైదరాబాద్, ఏప్రిల్ 16: అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమాన్ని మరిచిందని వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ విమర్శించారు. నగరంలో నిర్వహించిన జాతీయ వడ్డెర సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన వేముల వెంకటేష్ మాట్లాడారు.

04/16/2018 - 02:37

హైదరాబాద్, ఏప్రిల్ 15: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తామని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ప్రతినబూనారు. ఆదివారం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్సనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయాస్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.

Pages