S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

09/23/2017 - 18:04

ఒక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే ముందు ఏ కెప్టెనైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించగలమన్న పూర్తి నమ్మకం కుదిరిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు. ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జార్జి మాన్‌ను సాహసవంతుడిగా పేర్కోవాలి. 1949లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. మొదటి రోజు ఆటలోనే చెలరేగిపోయింది.

09/23/2017 - 18:02

సచిన్ తెండూల్కర్, శిల్పా శెట్టి, ప్రీతీ జింటా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, జూహీ చావ్లా వంటి ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు క్రీడా ఫ్రాంచైజీలను దక్కించుకోగా, సన్నీ లియోన్ కూడా వారి సరసన చేరింది. ఒక్కో జట్టులో ఐదుగురు ఆడే, మొత్తం 40 నిమిషాల నిడివిగల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ ఫట్సల్ సీజన్-2లో ఆమె కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీ కోఓనర్‌గా కనిపించనుంది.

09/23/2017 - 18:00

అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి అర్జెంటీనా మాజీ సాకర్ స్టార్ డిగో మారడోనా అభిమానుల వైఖరే నిదర్శనం. సహజంగా సాకర్ అభిమానులు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తమ తమ స్టార్లకు మద్దతునిస్తారు. జేజేలు పలుకుతారు. కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఘర్షణకు దిగుతారు. కానీ, మారడోనా అభిమానులు మరో అడుగు ముందుకేశారు. అతనికోసం ఏకంగా ఒక మతానే్న సృష్టించారు.

09/17/2017 - 01:33

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌లు ఆధిపత్య పోరాటానికి వేదికలుగా మారుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంకోసం ప్రతిసారీ పోటీపడుతున్న ఈ రెండు జట్లు ఏ విభాగంలోనూ ఒకదానికొకటి తీసిపోని రీతిలో సర్వశక్తులు కేంద్రీకరిస్తాయి. అమీతుమీ తేల్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో సమరానికి సై అంటాయి. దీనితో క్రికెట్ పిచ్‌లు యుద్ధ మైదానాలను తలపిస్తాయి.

09/17/2017 - 01:31

ఎక్కువ పర్యాయాలు సున్నాకే అవుటైన ఆటగాళ్ల జాబితాలో మొదటి ఐదు స్థానాలు భారత్‌కే దక్కడం గమనార్హం. జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ తలా నాలుగుసార్లు ఆస్ట్రేలియాపై డకౌట్ అయ్యారు. మూడేసిసార్లు సున్నాకే వెనుదిరిగిన వారిలో రోజర్ బిన్నీ, బ్రెట్ లీ, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ ఉన్నారు.

09/17/2017 - 01:29

* ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డల్లో అత్యధిక పరుగులను సమర్పించుకున్న భారత బౌలర్ వినయ్ కుమార్. 2013 నవంబర్ 2న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్లు బౌల్ చేసిన అతను ఏకంగా 102 పరుగులిచ్చాడు. అదే మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ క్లింట్ మెక్‌కే 89 పరుగులు ధారాదత్తం చేశాడు. 2003 మార్చి 23న జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన వనే్డలో జవగళ్ శ్రీనాథ్ 87 పరుగులిచ్చి, ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

09/17/2017 - 01:27

* ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా సుచిన్ తెండూల్కర్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆసీస్‌తో 71 వనే్డలు ఆడిన అతను 3,077 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ 2,164 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, ఆడం గిల్‌క్రిస్ట్ 1,622 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

09/17/2017 - 01:25

* భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వనే్డల్లో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక డబుల్ సెంచరీ నమోదైంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ రికార్డు సృష్టించాడు. 2013 నవంబర్ 2న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో అతను 209 పరుగులు చేశాడు.

09/17/2017 - 01:23

అత్యధిక వికెట్ల విషయానికి వస్తే బ్రెట్ లీ టాపర్‌గా నిలుస్తాడు. భారత్‌పై అతను 32 మ్యాచ్‌లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 45 ఆసీస్ వికెట్లను పడగొడితే, మిచెల్ జాన్సన్ 43, స్టీవ్ వా చెరి 43 వికెట్లు సాధించారు.

09/17/2017 - 01:21

ఒకప్పుడు భారత టెన్నిస్‌ను శాసించిన లియాండర్ పేస్ కష్టాల సుడిలోపడి అల్లాడుతున్నాడు. బద్ధ శత్రువుగా మారిన ఒకప్పటి తన డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం అప్పటికే కుటుంబ పరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న పేస్‌ను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది.

Pages