S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

09/17/2017 - 01:19

బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొస్సేన్ పిచ్చిచేష్టలు విమర్శలకు కారణమవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు, పాట్ కమిన్స్ ఎల్‌బిగా అవుటైనట్టు బంగ్లాదేశ్ బౌలర్ మెహెదీ హసన్ అప్పీల్ చేశాడు. దానిని అంపైర్ నిగెల్ లాంగ్ తోసిపుచ్చడంతో, బంగ్లాదేశ్ డిఆర్‌ఎస్ ద్వారా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.

09/10/2017 - 01:26

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. 2014 చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెరీర్‌ను ముగిస్తున్నట్టు ఆస్ట్రేలియా టూర్ మధ్యలో ప్రకటించినప్పుడు, సెలక్టర్లు ఆ బాధ్యతలను కోహ్లీకి అప్పచెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ధోనీ వనే్డ, టి-20 ఫార్మాట్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో, అన్ని ఫార్మాట్స్‌కూ కోహ్లీనే నాయకుడయ్యాడు.

09/10/2017 - 01:24

క్రికెటర్లలో చాలా మంది పాటలు పాడతారు. డాన్స్ చేస్తారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ ఏదో ఒక పాడుకుంటూనే ఉంటాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ కూడా అంతే. అతను గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. మంచి పాటగాడు కూడా. ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వనే్డలో 149 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 219 పరుగులు సాధించి సెవాగ్ కొత్త రికార్డు నెలకొల్పాడు.

09/10/2017 - 01:24

జువాన్ డెల్ పొట్రో, రోజర్ ఫెదరర్ మధ్య 2009లో పురుషుల సింగిల్స్ ఫైనల్ యుఎస్ ఓపెన్ చరిత్రలో ఇంత వరకూ ఎక్కువ మంది తిలకించిన మ్యాచ్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌ని పొట్రో 3-6, 7-6, 4-6, 7-6, 6-2 తేడాతో గెల్చుకున్నాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన పొట్రో అప్పటి వరకూ ఫెదరర్ కొనసాగిస్తున్న జైత్రయాత్రకు సమర్థంగా బ్రేకు వేశాడు.

09/10/2017 - 01:24

పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెజాద్ అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అభిమానులంతా తనకు బ్రహ్మరథం పడతారని ఊహించాడు. కానీ, అతని ప్రయత్నం బెడిసికొట్టింది. వెక్కిరింతలు, విమర్శలు ఎదురుకావడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ కప్‌ను గెల్చుకుంది.

09/10/2017 - 01:23

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌కు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ పాఠాలు నేర్పుతున్నది. శ్రద్ధ కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నది. శ్రద్ధ ఏదైనా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నదో లేక టోర్నమెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నదనో అనుకుంటే పొరపాటే. సైనా జీవితం ఆధారంగా తీస్తున్న బయో పిక్‌లో ఆమె పాత్రను శ్రద్ధ పోషిస్తున్నది.

09/10/2017 - 01:23

* అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలను దృష్టిలో ఉంచుకొని, స్టాలిన్‌గ్రాడ్ అధికాఠులు అందరికీ ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ముఖ్యంగా వివిధ స్టేడియాలు, కేంద్రాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న కార్మికులతో పోలీస్ అధికారులు డ్రెస్ రిహార్సెస్ కూడా చేయిస్తున్నారు.

09/03/2017 - 00:08

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నది. ఓవరాక్షన్‌తో సుప్రీం కోర్టునే ఢీ కొంటున్నది. పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసినప్పటికీ, భారత క్రికెట్‌పై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.

09/03/2017 - 00:06

సంప్రదాయ ఎర్ర బంతుల స్థానంలోనే గులాబీ రంగు బంతులతో టెస్టు హోదాగల అన్ని దేశాలు దాదాపుగా అంగీకరించాయి. అయితే, చాలా డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు, సిరీస్‌లను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇటీవలే న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు పింక్ బంతులతో, డే/నైట్ టెస్టు సిరీల్‌లు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

09/03/2017 - 00:06

భారత టెస్టు క్రికెట్‌కు లభించిన గొప్ప ఓపెనర్లలలో ఒకడిగా పేరు తెచ్చుకున్న 25 ఏళ్ల లోకేష్ రాహుల్ మైదానంలో దూకుడుగా ఉండడాన్ని ఎవరూ చూసి ఉండరు. ఒకప్పుడు క్రీజ్‌లో పాతుకుపోయి, ప్రత్యర్థి జట్టు బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన రాహుల్ ద్రవిడ్‌కు ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడింది. అజాత శత్రువుగా, మచ్చలేని క్రికెటర్‌గా ద్రవిడ్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం ఆకాశానికి ఎత్తేస్తుంది.

Pages