S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/01/2017 - 22:46

వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో అత్యధిక ట్రోఫీలను మార్టినా నవ్రతిలోవా గెల్చుకుంది. ఆమె మొత్తం తొమ్మిది పర్యాయాలు వింబుల్డన్‌లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఆమె మొత్తం 12 పర్యాయాలు ఫైనల్ చేరింది. 1982 నుంచి 1990 వరకూ వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఆమె ఫైనల్ చేరడం ద్వారా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

07/01/2017 - 22:45

వింబుల్డన్‌లో విజేతలకు బహూకరించే ట్రోఫీలకు కూడా ఘన చరిత్రే ఉంది. పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన వారికి అందచేసే కప్‌ను 1887లో తయారు చేశారు. దీనిని వింబుల్డన్ కప్‌గా పిలుస్తారు. మహిళలకు ట్రోఫీ రూపంలో ప్లేట్‌ను ఇస్తారు. దీని పేరు ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’. 1864లో తయారు చేసిన ఈ ప్లేట్‌ను మొదటిసారి 1886లో బహూకరించారు.

07/01/2017 - 22:45

* వింబుల్డన్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అక్కడికి పావురాలు రాకుండా చూసేందుకు ప్రత్యేక శిక్షణనిచ్చిన ‘రఫుస్’ అనే డేగ కాపలా కాస్తున్నది. దీనికి ఒక ట్విటర్ అక్కౌంట్ కూడా ఉంది. ట్విటర్ ఫాలోయింగ్‌లో రఫుస్‌తో మాగీ మే తీవ్రంగా పోటీపడుతున్నది. ఇంతకీ మాగీ మే అనేది పక్షికాదు.. ఆండీ ముర్రే పెంచుకుంటున్న కుక్క పేరు ఇది. ట్విటర్‌లో దీనికి సుమారు 27,000 మంది ఫాలోయర్లు ఉన్నారట.
తాజా గాలి!

06/25/2017 - 00:16

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల పాలనాధికారుల బృందం (సిఒఎ) నుంచి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వైదొలగడం ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

06/25/2017 - 00:07

సినిమాల్లోనేకాదు.. క్రీడల్లోనూ సూపర్ స్టార్ సంస్కృతి విస్తరిస్తున్నదనడానికి మన దేశమే ఉదాహరణ. ఇక్కడ క్రికెట్ ఒక మతం. అభిమానులకు క్రికెటర్లే దేవతలు. ఆ వెర్రి అభిమానమే క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది. సచిన్ తెండూల్కర్ వంటి ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలక్షన్ కమిటీ నిర్ణయంపైకాదు.. వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఉండేది. ఇప్పటికీ అదే తీరు కొనసాగుతున్నది.

06/25/2017 - 00:07

భారత క్రికెట్‌లో అధికారులపై ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ)లోని సభ్యుడు రామచంద్ర గుహ రాజీనామాతో తెరపైకి వచ్చిన ప్రశ్నల పరంపర కొనసాగుతునే ఉంది. అతను ఆరోపించిన విధంగా భారత క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతి కొనసాగుతున్నదని ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సిఒఎలోని మరో సభ్యుడు విక్రం లిమాయే కూడా త్వరలో రాజీనామా చేయనున్నాడు.

06/25/2017 - 00:06

క్రికెట్ బోర్డును ఆటగాళ్లు ఉపయోగించుకుంటున్నారా లేక ఆటగాళ్లకు ఉన్న పేరుప్రఖ్యాతుల్ని, ప్రజల్లో వారికున్న అభిమానాన్ని బోర్డు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే రెండూ నిజమే. క్రికెట్‌కు సంబంధం లేని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దశాబ్దాలుగా బోర్డును ఏలుతున్నారు. క్రికెట్‌లో ఒనమాలు తెలియనివారి సంఖ్యే బోర్డు కార్యవర్గంలో ఎక్కువగా ఉండేది.

06/25/2017 - 00:06

పేరు ప్రఖ్యాతలున్న ఒక మాజీ క్రికెటర్ టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాడని, అతను ఒప్పందంలో తనకు నచ్చిన అంశాలను కాంట్రాక్టులో జొప్పించాడని గుహ ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు. పరస్పర ప్రయోజనాలు ఉండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ, బోర్డుపై చాలా మంది మాజీ క్రికెటర్లు పట్టు బిగించి, అన్ని అంశాలను తమకు నచ్చినట్టు మార్చుకొని, రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

06/25/2017 - 00:04

* టెస్టు క్రికెట్‌లో ఒంటరి పోరాటాలు చేసిన బ్యాట్స్‌మెన్ చాలా మందే కనిపిస్తారు. అయితే, ఒక ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు వంద కూడా దాటని పరిస్థితుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వీరులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీలంక మాజీ క్రికెటర్ అశాంక గుణసిన్హ ఒకడు. 1991లో లంక జట్టు భారత్‌కు వచ్చినప్పుడు చండీగడ్ టెస్టులో లంక 82 పరుగులకే ఆలౌటైంది. గుణసిన్హ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

06/17/2017 - 21:49

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న పదకొండవ మహిళల వరల్డ్ కప్ ఈనెల 24న మొదలై, జూలై 23వ తేదీతో ముగుస్తుంది. ఇంగ్లాండ్‌లో ఈ మెగా టోర్నీ జరగడం ఇది ముచ్చటగా మూడోసారి. ఇంతకు ముందు 1973లో, తిరిగి 1993లో ఇంగ్లాండ్ వేదికగా మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. మొత్తం మీద 28 రోజుల్లో 31 మ్యాచ్‌లు జరుగుతాయి. డెర్బీలో జరిగే మొదటి మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్ల ఢీ కొంటాయి.

Pages