S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/15/2017 - 23:02

* స్కాట్‌లాండ్ గోల్ఫర్ రొరీ మెకిల్‌రోయ్ పేరును ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలకడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది.

07/08/2017 - 22:37

రన్నింగ్, సైక్లింగ్ కంటే మెరుగైన వ్యాయామంగా స్విమ్మింగ్‌ను పేర్కొంటారు. ఈత కొట్టినప్పుడు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పని చేస్తాయి. బేస్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పోలిస్తే స్విమ్మింగ్‌కు రెట్టింపు శక్తి అవసరమవుతుంది. ఒక గంటసేపు ఈత కొడితే సుమారు 650 క్యాలరీల శక్తి ఖర్చవుతుంది.

07/08/2017 - 22:36

ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడానికి అత్యంత సాహసం కావాలి. అంతులేని ఆత్మవిశ్వాసం, అనితర సాధ్యమైన కృషి, అద్భుతమైన ఫిట్నెస్ ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిస్తేనే ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడం సాధ్యమవుతుంది. మొట్టమొదట ఈ ఘనతను అందుకున్న స్విమ్మర్ కెప్టెన్ మాథ్యూ వెబ్. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన వెబ్ 1875 ఆగస్టు 25న డొవ్ నుంచి కలాల్స్ వరకు 26 మైళ్ల (41.83 కిలోమీటర్లు) దూరాన్ని అతను 22 గంటల్లో పూర్తి చేశాడు.

07/08/2017 - 22:36

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని డయానా న్యాద్ నిరూపించింది. అమెరికాకు చెందిన ఈ సుప్రసిద్ధ రచయిత్రికి స్విమ్మింగ్ అంటే ప్రాణం. హవానా (క్యూబా) నుంచి ఫ్లొరిడా వరకు 110 మైళ్లు (180 కిలోమీటర్లు) ఈదడానికి ఆమె ఒకటికాదు.. రెండు కాదు.. ఐదు పర్యాయాలు ప్రయత్నించింది. ప్రతిసారీ విఫలమైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. రెట్టించిన పట్టుదలతో శ్రమించింది. చివరికి తన 64వ ఏట ఆమె అనుకున్నది సాధించింది.

07/08/2017 - 22:35

స్విమ్మింగ్‌లో అన్నింటికంటే పురాతనమైన స్ట్రోక్ ఏది? ఈ ప్రశ్నకు అనేక అధ్యాయనాల తర్వాత బ్రెస్ట్ స్ట్రోక్‌గా నిపుణులు ఖాయం చేశారు. నీటిలోకి దూకిన వెంటనే, బ్రెస్ట్ స్ట్రోక్ ద్వారానే ముందుకు కదులుతారు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నాటికే స్విమ్మింగ్‌లో ఈ విధానాన్ని పాటించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి.

07/08/2017 - 22:35

* ఊపిరి పీల్చుకోకుండా ఎంతసేపు ఉండవచ్చు? అర నిమిషం పూర్తవుతున్నదంటేనే ఊపిరి బిగబట్టడం కష్టమవుతూ వస్తుంది. ఒకటిరెండు నిమిషాలు అలాగే ఉండగలిగితే గొప్పే. అయితే, ఫ్రీ డైవర్లు ఊపిరి పీల్చుకోకుండా నీటిలో సుమారు పది నిమిషాల వరకూ ఉండగలరు. నిరంతర అభ్యాసంతోనే ఇది సాధ్యమవుతుంది. నీటిలో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు గడిపిన ప్రపంచ రికార్డు స్టిగ్ సెవెరినె్సన్ పేరిట ఉంది.

07/01/2017 - 22:48

ఎటిపి లేదా డబ్ల్యుటిఎ టూర్ టోర్నమెంట్లు, సిరీస్‌ల్లో విజయాలు, ట్రోఫీలు సాధించడం కంటే వింబుల్డన్‌కు అర్హత సంపాదిస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకోవడం టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ సహజం. నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోనూ వింబుల్డన్‌నే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దీనిని అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా అభివర్ణిస్తారు.

07/01/2017 - 22:46

టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతనమైన టోర్నీ వింబుల్డన్. లండన్ శివార్లలోని వింబుల్డన్ ప్రాంతంలో నిర్వహించిన లాన్ టెన్నిస్ టోర్నీకే వింబుల్డన్ టోర్నీ పేరు స్థిరపడింది. ప్రతి ఏటా జూన్ మాసంలో 20 నుంచి 26వ తేదీ మధ్యలో వచ్చే సోమవారం రోజున క్వాలిఫయర్స్‌తో మొదలవుతుంది. ఈసారి జూన్ 26న క్వాలిఫయర్స్ ఆరంభమయ్యాయి. మెయిన్ డ్రా జూలై 3 నుంచి ఉంటుంది. 16న పురుషుల ఫైనల్‌తో ముగుస్తుంది.

07/01/2017 - 22:46

వింబుల్డన్ చరిత్రలో అత్యంత వేగంగా సర్వీస్ చేసిన రికార్డు అమెరికాకు చెందిన టేలర్ డెంట్ పేరిట ఉంది. అతను 2010 జూన్ 23న నికొలాస్ లాపెన్టీతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 238 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేశాడు. వింబుల్డన్‌లో ఇప్పటికీ అదే రికార్డు. మహిళల విభాగంలో రికార్డును వీనస్ విలిమియస్స్ సొంతం చేసుకుంది. ఆమె గంటకు 205 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేసింది.

07/01/2017 - 22:46

మ్యాచ్‌లు ఆడే బంతులు సరైన ఆకారంలో ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఏడు నుంచి తొమ్మిది గేమ్‌లకు బంతిని మారుస్తారు. బంతుల ఆకారం చెదరకుండా ఉండేందుకు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతారు. వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభమైన కొత్తల్లో తెల్లని బంతులు వాడేవారు. అయితే, టీవీలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు తెల్ల బంతులు సరిగ్గా కనిపించేవి కావు.

Pages