S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/30/2017 - 00:05

క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని, కనీస ప్రమాణాలను అందుకున్నవారికే ప్రపంచ అథ్లెటిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రపంచం నలుమూలలా క్వాలిఫయర్స్ జరిగాయి. జూన్ మాసాంతంతో గడువు ముగిసింది. ఆయా దేశాల అథ్లెటిక్ సమాఖ్యలు పంపిన వివరాలను పరిశీలించిన తర్వాత వివిధ క్రీడాంశాల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈలోగా అందరికీ డోపింగ్ పరీక్షలు కూడా జరుగుతాయి.

07/30/2017 - 00:05

* మారథాన్ పరుగుకు గ్రీకు వీరుడు ఫెడిప్పిడెస్‌కు అవినాభావ సంబంధం ఉంది. క్రీస్తుపూర్వం 490 సంవత్సరంలో గ్రీస్‌పై పర్షియా దండయాత్ర చేసింది. దానిని ‘మారథాన్ యుద్ధం’గా పేర్కొంటారు. ఆ పోరాటంలో గ్రీస్ విజయం సాధించింది. ఈ సమాచారాన్ని అందించేందుకు గ్రీకు సైనికుడు ఫెడిప్పిడెస్ మారథాన్ యుద్ధ మైదానం నుంచి ఏథెన్స్ వరకు 26.219 మైళ్లు (42.195 కిలో మీటర్లు) పరిగెత్తాడు.

07/23/2017 - 00:04

కబడ్డీ క్రీడ నిన్నమొన్నటిది కాదు. మన దేశంలో నాలుగువేల సంవత్సరాలకు పూర్వమే దీని ఉనికి ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆరంభమైందో తెలియకపోయినా, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడని అంటారు. కాగా, కబడ్డీల్లో ఎన్నో విధానాలున్నాయ. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూల సూత్రాలు మాత్రం ఒకటే.

07/23/2017 - 00:04

ప్రో కబడ్డీ నాలుగు సీజన్లలోనూ ఎనిమిది జట్లు తలపడితే, ఈ ఏడాది, ఐదో సీజన్‌లో మరో నాలుగు జట్లు అదనంగా చేరాయి. బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా), బెంగళూరు బుల్స్ (నాగపూర్), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ), జైపూర్ పింక్ పాంథర్స్ (జైపూర్), పాట్నా పైరేట్స్ (పాట్నా), తెలుగు టైటాన్స్ (హైదరాబాద్/ విశాఖపట్నం), యు ముంబా (ముంబయి) ప్రో కబడ్డీ జట్లు.

07/23/2017 - 00:04

* కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడం. రైడర్‌ను పట్టుకోవడానికి ఈ విధమైన వ్యూహమే కబడ్డీలో ప్రధానం. దక్షిణ భారతంలోనేగాక, యావత్ భారతదేశంలో ఈ ఆట అనాదిగా ప్రచారంలో ఉంది. దీనిని గురించి తెలియని లేదా ఏదో ఒక సమయంలో ఆడని భారతీయుడు లేడనడం అతిశయోక్తి కాదు. అఖంఢ భారతంలో కబడ్డీ అంతర్భాగమైంది.

07/15/2017 - 23:08

క్రికెట్ ప్రపంచంలో రవి శంకర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.
జయధ్రద్ శాస్ర్తీ అని చెప్పినా అర్థం కాకపోవచ్చు.

07/15/2017 - 23:03

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవి శాస్ర్తీ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదా? ఎవరికివారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారా? బిసిసిఐకి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకోవడం వల్లే, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోచ్ పేరును హడావుడిగా వెల్లడించారా?

07/15/2017 - 23:03

కోచ్, క్రికెటర్ల సంబంధాల్లో కొన్ని వైరుధ్యాలు తప్పవు. అనిల్ కుంబ్లే, కోహ్లీ విషయంలో ఇది రుజవైంది. ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారన్న వార్త చాలాకాలంగా అభిమానులను వేధిస్తునే ఉంది. కుంబ్లే, కోహ్లీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, చాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరే ముందే, ఆరు నెలలుగా వీళ్లిద్దరి మధ్య మాటల్లేవని వచ్చిన వార్తలు సహజంగానే భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

07/15/2017 - 23:02

టోర్నీలు లేదా సిరీస్‌లు ఏవైనా, ఒక జట్టులో కెప్టెన్‌దే కీలక పాత్ర అవుతుందని, సమయానుకూలంగా అతను తీసుకునే నిర్ణయాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని కోహ్లీ వాదన. జట్టు జయాపజయాలకు కెప్టెన్‌నే బాధ్యుడ్ని చేస్తారని, అందుకే, నాయకుడికి తగినంత వెసులుబాటు ఇవ్వాలని అంటాడు.

Pages