S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/27/2016 - 23:27

విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప, చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉద్యోగులతో పాటు, విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని సస్పెండ్ చేయడం, ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

01/27/2016 - 23:26

యూనివర్సిటీ ఫ్యాకల్టీలు విద్యార్థులపై శ్రద్ధ పెట్టకపోవడం కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక ప్రధాన కారణం. నిత్యజీవితంలో కొన్ని సంఘటనలో విఫలం కావడం, మరికొందరు విద్యార్థులు ప్రేమలో ఓడిపోవడం లాంటి సంఘటనలు కూడా వారిని ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చు. రోజురోజుకు వయస్సు పెరిగిపోవడంతో ఇక జీవితంలో సెటిల్ అవుతామా లేదా అనే అభద్రత భావం కూడా వారికి కలుగుతుంది.

01/27/2016 - 23:25

విశ్వవిద్యాలయాల్లో ఆలోచనల పరమైన ఘర్షణ ఉండవచ్చు, కానీ భౌతిక దాడులు ఉండకూడదు. అలా ఉంటే ఏ విశ్వవిద్యాలయం కూడా మనుగడ సాగించలేదు. విశ్వవిద్యాలయాల్లో అన్ని సిద్ధాంతాలు, భావాల మధ్య స్వేచ్ఛగా చర్చ జరుపుకునే వాతావరణం ఉండాలి. విశ్వవిద్యాలయాల్లోకి వచ్చే పేద, దళిత విద్యార్థులు ఒకవైపు, కాస్త సంపన్నులు, ఆగ్రవర్ణం విద్యార్థులు ఒకవైపు ఉంటారు.

01/27/2016 - 23:23

భారతదేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో అనేకానేక విశ్వవిద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి స్పష్టంగా ముచ్చటగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి. ఎంతో సంతృప్తికరంగానే జీతాలు పొందుతున్న ఆచార్యులు ‘బోధకులు’ పాఠాలు సక్రమంగా చెప్పకపోవటం... ఇక విద్యార్థులు ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగి తేలుతూ తరగతులకు సక్రమంగా హాజరుకాకపోవటం..

01/27/2016 - 23:22

సమాజంలో ఎవరు ఆత్మహత్యకు పాల్పడినా, అది విషాదమే, రోహిత్ ఆత్మహత్య సైతం విషాద ఘట్టమే.. దానికి ఎవరైనా బాధపడాల్సిందే.. అయితే దాని కొనసాగింపుగా జరుగుతున్న సంఘటనలు మరింత బాధాకరం. వివేకవంతులెవరూ ఆత్మహత్య చేసుకోరు. రోహిత్ ఆత్మహత్యకు ముందు తను రాసిన సూసైడ్ లేఖలోనే ఎవరికీ బాధ్యత లేదని స్పష్టం చేసిన తర్వాత కూడా కొంత మందిపై లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.

01/27/2016 - 23:21

నేడు విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు అలజడులు, ఉద్యమాలు చోటుచేసుకోవడం సర్వసాధారణంగా మారింది. విద్యార్థులు చదువు వైపు కాకుండా ఇతర మార్గాల వైపు దృష్టి సారించడమే ఇందుకు ప్రధాన కారణం. అందువల్ల వారు నిరంతరం పుస్తకాలతో కాలక్షేపం చేసేలా వారిని మోటివేట్ చేయాలి. విద్యార్థులు పేపర్ ప్రెజంటేషన్ సెమినార్ హాల్లో లేదా కానె్ఫరెన్స్ హాల్లో ఇవ్వడం అలవాటు చేయగలిగితే వారు అందుకోసం నెలల తరబడి కష్టపడాల్సి వస్తుంది.

01/27/2016 - 23:19

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో రిసెర్చ్‌స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహించాల్సింది వైస్ చాన్స్‌లరే. తన వైఫల్యాన్ని మరి ఎవరి మీదనో వేసి తప్పించుకోలేరు. గతంలో కూడా ఇదే యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య వంటి ఉదంతాలు చాలా చోటుచేసుకుంది. ఆ సంఘటన జరిగినప్పుడే యూనివర్సిటీ యాజమాన్యం సరిగా స్పందించి ఉంటే ఇప్పుడు రోహిత్ ఉదంతం జరిగి ఉండేది కాదు.

01/27/2016 - 23:18

విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడరాదు. తద్వారా వారు సాధించేదేమీ ఉండదు. పైగా వారి కుటుంబ సభ్యులను అనాధలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలతో పిల్లల్ని చదివిస్తున్నారు. అందువల్ల ఆత్మహత్య చేసుకోకుండా సమస్యపై గట్టిగా పోరాటం చేయాలి, బతికి సాధించాలి. ఇక వైస్-్ఛన్సలర్ల నియమాకం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే జరిగింది.

01/27/2016 - 23:17

విద్యార్ధి సంఘాలు అకడమిక్ కార్యకలాపాలు, విజ్ఞాన సముపార్జనకు సంబంధించిన అంశాలపై చర్చలు చేయాలి. ప్రజాస్వామిక వాదం బలపడాలంటే ఆధిపత్య ధోరణులను వదులుకోవాలి. సెంట్రల్ వర్శిటీలో చోటు చేసుకున్న సంఘటనను విశే్లషిస్తే, విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న ఆధిపత్య ధోరణులు, రాజకీయ పార్టీల ప్రమేయాలు కారణమని చెప్పవచ్చు.

01/27/2016 - 23:15

స్వయంప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం చోటుచేసుకుంటోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. పవిత్రంగా నడిచే విశ్వవిద్యాలయాలు నేడు స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయి. గతంలో వైస్ చాన్సలర్లుగా గవర్నర్లుండే వారు. ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు, ఆధిపత్య పోరుతో విసిల నియామకాలు పాలకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి.

Pages