S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/12/2016 - 03:23

ఆధునిక జీవన శైలి మనిషిపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. శారీరికంగానే కాదు...మానసికంగానూ మనిషిని దెబ్బతీస్తోంది. ప్రశాంతతను దూరం చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచీ యంత్రంలా మారి, కాలంతోపాటు పరిగెత్తే మనిషి తన జీవితంలో ఎంతో కోల్పోతున్నాడన్నది మానసిక శాస్తవ్రేత్తలూ, డాక్టర్లూ నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతున్నమాట. కానీ, ఆ మాట చెవికి ఎక్కించుకునేది కొందరే.

02/12/2016 - 03:23

వేలంటైన్స్ డై వస్తోందంటే చాలు... గ్రీటింగ్ కార్డులు, హృదయాకారంలో మలచిన రకరకాల బొమ్మలు, వస్తువులను కొనేందుకు ప్రేమికులు రెడీ అయిపోతారు. ‘ఎప్పుడూ అవేనా? కాస్త డిఫరెంట్‌గా ఆలోచించకూడదూ’ అని ఎవరైనా సలహా ఇస్తే డైలమాలో పడిపోతారు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రేమికులు ప్రఖ్యాత చిత్రకళాకారుడు శిశిర్ సహానా కార్డుల్ని ట్రై చేయొచ్చు.

02/12/2016 - 03:21

ఓపెన్ మైక్ ఈవెంట్...!
వినడానికి ఈ పేరు కొత్తగా ఉంది కదూ! వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లోనూ, ఉత్తర భారతంలోనూ ఇదేం కొత్త కాదు...హైదరాబాద్‌కు మాత్రం ఈ మధ్యే వచ్చింది. వచ్చీ రాగానే యువతలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలెంట్‌కు తెర తీస్తోంది. ఇంతకీ ఏమిటీ ఓపెన్ మైక్ ఈవెంట్?

02/12/2016 - 03:17

ఇది రోబోల కాలం. ఐరోపా దేశాల్లో షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసులలోనూ ఎక్కడ చూసినా రోబోలే దర్శనమిస్తున్నాయి. ఇందులో వింతేం లేదు. అయితే ఇకపై ఇండస్ట్రియల్ రోబోలు రాబోతున్నాయి. అదే అసలు వింత. ఇండస్ట్రియల్ రోబోలంటే పరిశ్రమల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ పనిచేసే రోబోలన్నమాట. జపాన్‌లోని క్యోటోకు చెందిన స్ప్రెడ్ అనే సంస్థ రోబోలతోనే సాగు చేయించే పద్ధతికి శ్రీకారం చుడుతోంది కూడా.

02/12/2016 - 03:16

మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి వీరి సంఖ్య 37కోట్లకు చేరుకున్నట్టు అంచనా. గత ఏడాది జూన్ నాటికి 23 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఏడాది కాలంలోనే 14 కోట్లు పెరగడం విశేషమే. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది.

02/12/2016 - 03:15

ఇంజన్‌కి అడపాదడపా ఓవరాలింగ్ ఎలా చేస్తారో అలాగే మన శరీరానికీ ఓవరాలింగ్ అవసరమే. అందుకు సరైన పద్ధతి వ్యాయామం. ఎక్సర్‌సైజులు ఇలాగే చేయాలీ అనేం లేదు. కొందరు జాగింగ్‌ను ఎంచుకుంటే మరికొందరికి రన్నింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొందరికి యోగాపై మక్కువ కావచ్చు. ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే వయసును బట్టి వ్యాయామం ఉండాలి. సాధారణంగా యాభయ్యేళ్లకు పైబడినవారు రన్నింగ్ చేస్తే గుండె సంబంధిత జబ్బులకు లోనుకావచ్చు.

02/12/2016 - 03:14

రోజంతా బిజీబిజీగా ఉంటాం. కాస్తయినా టైమ్ దొరకదు. అయినా వీలు చూసుకుని మనకంటూ ఓ హాబీని ఏర్పరచుకుని కనీసం రోజుకు పావుగంటయినా దానికోసం సమయం వెచ్చిస్తే, అది ఇచ్చే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మీకు వండటమంటే ఇష్టమనుకోండి. రోజంతా అలసి సొలసి ఇంటికొచ్చినా, కాసేపు మీ శ్రీమతికి వంటిట్లో సాయపడితే ఎంతో మానసికోల్లాసం కలుగుతుంది.

02/12/2016 - 03:13

మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. కానీ బిజీ లైఫ్‌లో పడి నీళ్లు తాగడమే మర్చిపోతూంటాం. శరీరాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, తాజాగా ఉంచడంలో నీళ్లదే ప్రధానపాత్ర. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మం కూడా నిగారింపు సంతరించుకుంటుంది.

02/12/2016 - 03:12

శారీరిక దృఢత్వానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక ప్రశాంతతకు, మానసిక దృఢత్వానికి ధ్యానం కూడా అంతే ముఖ్యం. రోజూ కనీసం పది నిమిషాల సేపు తదేక దీక్షతో ధ్యానం చేస్తే చాలు. కావలసిందల్లా అందుకోసం మీరు టైమ్ కేటాయించగలగడమే.

02/12/2016 - 03:11

శారీరికంగా సంక్రమించే అనేక వ్యాధులకు కారణం మనం తీసుకునే ఆహారమే. జిహ్వ ఎంత గోలపెట్టినా జంక్ ఫుడ్ జోలికి పోకూడదు. అలాగే స్వీట్లు, కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం జోలికి వెళ్లకూడదు. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. పండ్లు, కూరగాయలతో చేసిన సలాడ్లు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

Pages