S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
దేహికి అన్నం కావాలి. చెప్పగలడు. అన్నమే కాదు. ఇంకా ఏవేవో కావాలి. కానీ వాటిని సాధించుకొనేందుకు ఆ కోర్కెలేవిటో బయటకు అనాలి. అదే భావ ప్రకటన - ఇది ఒక్క మనిషికి మాత్రమే అనుగ్రహించి సృష్టికర్త చేసిన ఏర్పాటు.
జెండాపై కపిరాజు, ముందు సీత వాజిశ్రేణియున్ బూన్చి
నేదండంబున్ గొని తోలుస్యందనము మీదన్
నారిసారించుచున్, గాండీవంబు ధరించి
ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడు
ఒక్కండును నీమొఱాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్॥
పౌరాణిక పద్యనాటకానికి దశ, దిశా నిర్దేశించి తెలుగుభాషలోని తియ్యదనాన్ని, సొగసుల వైభవాన్నీ ఈ నేల నాలుగు చెరగులా వెదజల్లిన గానగంధర్వులను గుర్తుచేసే పద్యమిది.
అలియాస్ అన్న పేరుగల భారతీయ సంగీతకారుడు ఉండేవాడు. ఆయన గొప్ప సాధువు. పవిత్ర జీవనం గడిపేవాడు. భక్తిశ్రద్ధలతో జీవించేవాడు. అతనిది నిరాడంబర జీవనశైలి. అతను రోజుకు ఒక రొట్టె తిని కాలం గడిపేవాడు. జనం అతనికి ఎక్కువగా ఆహారం ఇచ్చినా ఏదీ రేపటిదాకా దాచుకునేవాడు కాదు. మిగిలింది ఇతరులకు ఇచ్చేసేవాడు.
వాస్తవిక జీవితంలో పాట సహజమా? కాదా? అని ప్రశ్నించుకుంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో సహజమే అనిపించే ఘటనలు మనకు తారసపడుతూంటాయి. ఉన్నది లేనట్లూ, లేనిది ఉన్నట్లుగా భ్ర మింపచేసే మాయా ప్రపంచంలో బతికేస్తున్నాం. నిజంగా ఆలోచిస్తే, యింట్లో భార్యాభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ షికారుకెళ్ళే సందర్భాల్లో డ్యూయట్లు పాడుకుంటారా?
శాస్త్రోక్త వరవర్గ సప్తస్వర నిబద్ధ/ గీత ప్రపూత సంగీతరీతి/ భారతీ ముఖసిత భానోల్లసిత బింబ/ శీతల జ్యోత్స్న సంగీత సుకళ/ విశ్వమోహనకర వీణానినాద స/ మ్మేళనా కవిత సంగీత లలిత/ కమనీయ నవరస గాన మంజుల సార/ నిర్ఘరీ వారి సంగీత ధార/ సరస సంగీత సురనదీ స్వాదుజలము/ చిలికినట్లైన మోడుమాకులు చిగుర్చు/ మరణదశనున్న జీవమ్ము, మరల బ్రతుకు/ నట్టి సంగీత విద్య నభ్యాసపరచి విశ్వగాయక/ విఖ్యాతి వెలయవలయు’
రామాలయం లేని ఊరుగానీ, రామమందిరం లేని వీధిగానీ ఎక్కడా వుండదు. శ్రీమద్రామాయణం ఎవరో ఒక మహారాజు చరిత్రలా వుండి వుంటే ఈపాటికి జనం ఆ కథను ఏనాడో మరిచిపోయి వుండేవారు.
కానీ రామాయణ, భారత భాగవతలు మన జీవితాల్లో ఒక భాగమై స్థిరంగా ఉండిపోవడానికి కారణం వీటిలోని పాత్రల స్వభావాలు.
కాలం కాలం కాలం
ఇది మానవుడే నవ భావకుడై
గమనించు యింద్రజాలం
మూడు పొరలుగా ముడుచుకుని
సమ్మోహ రహస్యం దాచుకుని
గతమూ భావీ ఒదిగిన దళమే
వర్తమాన కాలం, శుభ వర్తమాన కాలం...
నిన్న నిరాశకు రేపటి ఆశకు
నిండిన రుచుల కటాహం
బతుకు బాటలో నడిచేవారికి
పన్నిన పద్మవ్యూహం..
గిరులు రేకులై విచ్చుకుని - నవ
కువలయమైతే అవని
జన ప్రాణమకరందం కోరే
ఎప్పుడో 1965 ప్రాంతంలో జరిగిన ఘటన. రోహిణీకార్తి, మిట్టమధ్యాహ్నం. పక్కనే గలగలా గోదావరి వున్నా చల్లదనమనే మాట లేదు.
‘పాటంటే పదాల పొందిక కాదు.. స్వరాల అల్లిక కాదు...’
పుట్టిన ప్రతి ప్రాణికీ చలనం వున్నట్లు సంగీతంతో ఊపిరి పోసుకున్న ప్రతి పాటకూ ఆత్మ వుంటుంది. అదే లేకపోతే పాటలు యింతమంది హృదయాలను ఎలా పలకరిస్తాయి? కవి గాయకులు కలిస్తేనే సామగాన గీతవౌతుంది. తల్లిదండ్రులను బట్టి పిల్లల రూపాలెలా ఉంటాయో, సంగీతంతో కలిసిన సాహిత్యం కూడా అంతే.
‘పరలోక సాధనమే మనసా
స్మరలోభ మోహాది పాపులను
స్మరియింపకే - శ్రీరామ భజన ॥
-జననాది రోగ భయాదులచే
జగమందు గల్గు దురాశలచే
తనయాది బాంధవుల భ్రమచే
తగుల నీదు త్యాగరాజ నుతుని భజన ॥
* * *