S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/15/2020 - 23:57

ప్రతీ విత్తనం
మొక్క కాలేకపోవచ్చు! కానీ...
తోటమాలి తన మనసు చెలమలోని
నీళ్లను చేదిపోస్తే...?
హృదయ నవనీతంతో
మృదువుగా సాకితే...?
ఏ విత్తనమైనా మొలకెత్తాల్సిందే
మొక్కై...మహావృక్షమై...
నలుగురికి పలు రకాలుగా
ఫలితమందించాల్సిందే
తోటమాలి చెమటదే పై చేయి
మొక్క మహావృక్షం కావడంలో
తన వెన్ను ఒంగుతున్నా
మొక్కను ఒంగనివ్వని

03/15/2020 - 23:52

నవ మాసాలగండం నుంచి
గట్టెక్కిందో లేదో
నిమిషం నిమిషం
మృత్యుద్వారం ముందు
ఎదురుచూపులు
ఆడపిల్లగా పుట్టడమే
శాపమైన దేశంలో దినామూ
వొక సంఘర్షణే
ఎదిగే సీతాకోకచిలుకని
కబళించడానికి ఎన్ని చేతులో
లాఘవంగా తప్పించుకోని
ఎదిగిన క్రమం కష్టమే
యవ్వనాన్ని దాచలేని
శరీరంతో రాక్షస ప్రేమల నుంచి
రక్షించుకోవడం
కత్తిమీద సామే కదూ

03/15/2020 - 23:24

నావల్ కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకలేదు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశాం. విదేశాల నుండి వచ్చే ప్రతి ప్రణాణీకుడికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

03/15/2020 - 23:22

నావల్ కరోనా వైరస్ రాకుండా హోమియో వైద్య విధానంలో ‘ఆర్సెనికం ఆల్బం-30’ అనే మందు ఉపయోగపడుతుంది. ఈ మందును రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో ఆరు మాత్రల చొప్పున మూడు రోజుల పాటు వేసుకోవాలి. కేంద్ర ఆయుష్ శాఖ కూడా ఇదే మందును సిఫార్సు చేసింది. ప్రభుత్వ హోమియో ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంది. ప్రైవేట్ మందుల దుకాణాల్లో కూడా తక్కువ ధరకే ఇది లభిస్తుంది.

03/15/2020 - 23:20

మధ్య గదిలో..
తెల్లటి గోడ మీద పెన్సిల్ పెట్టి గీతలు గీసుకుంటున్న నాకు..
పెరటి వాకిలి గుండా వెలుతురు ఇంట్లోకి ప్రసరించడం కనిపించింది.
అంటే.. ఆ వైపు తలుపు తెరిచే ఉందన్న మాట. తాతయ్య తోటలో దేవుడి కోసం పూలు కోసుకు వచ్చి, గడియ పెట్టకుండా వదిలేసి ఉంటారు..
లేదా..
పనిమనిషి సుబ్బులు వెళుతూ వెళుతూ తలుపు జేరవేసి వెళ్లిపోయి ఉండవచ్చు.

03/15/2020 - 23:11

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
**

03/15/2020 - 23:09

గడచిన తరం సాహిత్య మహా మనుషులతో, సర్వంకష సారస్వత ప్రతి భాగరాయుసులలో ప్రాతః స్మరణీయులు విపుల ప్రజ్ఞ్ధారీణులు అయిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీ మహోదయలు తెలుగు భాషా సర్వతోముఖ వికాసాన్ని ఆశిస్తూ ఇట్లా స్వస్తి వచనం పలికారు.

03/14/2020 - 23:54

పది మంది అపరాధులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడరాదన్న నిబంధన మేరకు న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతుంది. తన పర బేధం ఉండదన్న నానుడితో న్యాయ దేవత కళ్లకు గంత కట్టారని పూర్వం చెప్పేవారు. నేడు ఆ అర్థం పోయి న్యాయదేవతకు కళ్లు లేవు. చూడదనే భావార్థం నేటి ప్రజలకు ఉంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా కృషి చేయగలిగితే దేశం, సమాజం లక్షణంగా ముందుకు సాగుతుంది.

03/14/2020 - 23:50

ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఉత్కంఠభరితమైన ప్రయాణం చేయాలనుకునేవారికి, ప్రకృతి ఒడిలో తలపెట్టుకుని సేద తీరాలనుకునేవారికి ఎంతో అనువైన ప్రదేశం తిరుపతికి సమీపంలో మనల్ని ఆహ్వానిస్తోంది. అక్కడికి వెళితే మేఘాలు చేతికందుతాయి.. మంచుముత్యాలు ఒళ్లంతా గిలిగింతలు పెడుతుంటాయి.. సంపెంగల సువాసనతో కూడిన చల్లటి కొండగాలి గుండెకెన్నో ఊసులు చెబుతుంది.

,
03/14/2020 - 23:45

అదో వినూత్న వ్యక్తీకరణ. రకరకాల ప్యాట్రన్స్‌తో, ప్రహేళికల్లాంటి ఆకృతులతో, చదరంగం గళ్లతో, త్రికోణాలతో, దీర్ఘచతురస్రాలతో ఓ సరికొత్త సంయోజనం. రకరకాల రంగుల రసజ్ఞతతో, సంయోజనంతో చిత్ర కళాఖండాలు సృష్టించడంలో చిత్రకారుడు పెద్ది లక్ష్మీకాంత్ ఆరితేరారు.

Pages