S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/09/2019 - 20:32

తెలంగాణ చిత్రకళా రంగంలో కొత్త తరం తెర పైకి వచ్చింది. తమ ప్రతిభా వ్యుత్పత్తితో అటు వీక్షకుల్ని, ఇటు కళా విమర్శకుల్ని ఆకర్షిస్తున్నారు. వారిలో టేలర్ శ్రీనివాస్ ఒకరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ఆయన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) కోర్సును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు.

02/09/2019 - 20:27

గోపికల సందేహాలు :-
ఈ విధంగా శ్రీకృష్ణుడు గోపికలతో అటూ ఇటూ తిరుగుతూ, ఒక ఇసుక దిబ్బ మీద కూర్చున్నాడు. గోపికలంతా ఆయన చుట్టూ చేరి రక రకాలుగా సేవిస్తున్నారు.
(i) కొందరు తమ వల్లెవాటులను (పైన కప్పుకునే ఉత్తరీయం) తీసి స్వామికి ఆసనంగా వేశారు.
(ii) కొంతమంది చుట్టూతా చేరి, విలాసంగా ఆయన వంక చూస్తున్నారు.

02/09/2019 - 20:06

నేటి శిథిల దేవాలయాలు, కోటలు, శిల్పాలు గత చరిత్రకు దర్పణాలు ఆనడానికి, మతసామరస్యానికి నిదర్శనం అన్నట్లుగా నిలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండల కేంద్రంలోని వలిగొండ వలిబాష గుట్ట. ఏటవాలుగా పెద్దపెద్ద బండరాళ్లతో దట్టమైన చెట్లపొదలతో కనిపించే వలిబాష గుట్ట చారిత్రక నేపథ్యంలోకి తొంగిచూస్తే హిందూ, మహ్మదీయ రాజరికపు పాలన కాలం చారిత్రక విశేషాలు నేటికి దర్శనమివ్వడం విశేషం.

02/09/2019 - 20:03

‘కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు కళాశాలలలో వారం రోజుల వ్యవధిలోనే రెండు ఆత్మహత్యల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లిదండ్రుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో అందరి హృదయాలను కలచివేసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? అభం శుభం ఎరుగని చిన్నారుల జీవితాలలో మధ్యలోనే వాడిపోతున్నాయి. పసిమొగ్గల భావి జీవితం ఆనందంగా గడపడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.’

02/09/2019 - 18:34

హృదయమంతా తానే
నిండి ఉండింది
తనువంత పాకి తపనింత రేపింది
తొలకరి చినుకులా
మదనుని మొలకలా
కనె్నవధువు పూలరేకు పెదవుల
తొణికే తేనెల పలుకులా
కొమ్మమీది పువ్వు కొప్పుకొచ్చి
విరిసి మురిసి నవ్వు
కనె్న సోయగాల సొంపు
మాపటికి రేపు
సుమ సుగంధ సౌరభాల మేళవింపు
ఆనందం అర్ణవమై
దశదిశాంతాల నింపు
నవ్వుల్లో రసికత కళ్లల్లో కసి కొంత

02/09/2019 - 18:33

ఆమని ఆమని ఈ పరుగులు ఏమని
ఏమని ఏమని ఈ రసికతలేమని
చిగురాకుల కదలికలు
చిగురాశల సరసములని
కనివిని మురియని పరవశించని వారెవరని...
మోవిపై మురళిని మోహన రవళిని
సెలయేటి గలగలలని సరిగమ పదనిసలని
కొండకోన మారుమ్రోగ ఎలకోయిల కూతలిని
కనివిని మురియని పరవశించని వారెవరని...

02/02/2019 - 23:34

అప్పుడప్పుడు -
ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి.
ముఖ్యంగా
ఇలాంటి దృశ్యాలు వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఆ మబ్బుని చూసి
రైతులు ఆశపడతారు
వర్షం పడుతుందని.
చాలాసార్లు
వర్షం పడదు
మబ్బులు తేలిపోతాయి.
రైతు నిరుత్సాహపడతాడు.
మనుషులు కూడా
మబ్బుల మాదిరిగా కన్పిస్తారు.
జీవితంలో
బాగా ఎత్తుకు ఎదిగిపోతారని

02/02/2019 - 19:44

చలికి అందరూ వణుకుతుంటే.. కొందరు మాత్రం పలుచటి టీషర్టులు వేసుకుని హాయిగా తిరిగేస్తుంటారు. 12 గంటలు నిద్రపోయాక కూడా కొందరికి బద్ధకం తీరదు.. కొందరు మాత్రం కేవలం ఐదు గంటల నిద్రతో ఉత్సాహంగా బతికేస్తుంటారు. ఇలాంటి లక్షణాలను అందరూ కోరుకున్నా కొద్దిమందికి మాత్రమే ఈ ప్రత్యేకతలుంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కొందరికి ఈ లక్షణాలు సంక్రమిస్తే..

02/02/2019 - 19:02

కథాగమనం సాగాలి కనుక, మనం ముందుకు సా గుదాం.
గోపికలలా విరహభక్తి పారవశ్యంలో లీనమైనందువల్ల, వారిలోని గర్వమూ, అసూయ, వంటి దోషాలన్నీ నశించిపోగా, వారి పిలుపులకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు వారి కళ్ళ ఎదుట మళ్ళీ సాక్షాత్కరించాడు.
గోపికలందరికీ పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినట్లయింది. వాళ్ళందరూ ఆయన్ని ఒక్క సారిగా చుట్టేసారు. ఇక్కడ శ్రీకృష్ణ కర్ణామృతశ్లోకం ఒకటి స్మరించదగినది వుంది.

02/02/2019 - 18:56

తిరిగిరాని వొక సాయంత్రం
ఉండగట్టి విసిరేసినప్పుడు
రెక్కలు తెగి పడిపోతాయి

వొక దిగులు మేఘమై అల్లినప్పుడు
వొంటరితనం నెమలై
పురివిప్పి ఆడుతుంది

నన్ను నేను మోసుకుంటూ
తెలియనితనంతో సాగుతున్నా
జ్ఞాననేత్రం తెరిచే వేళ
నా ఉనికెక్కడో

అనంతంలో లెక్కతేలని మిగులై
కాలంలో నిలిచిపోతాను
అప్పటివరకూ కట్టె ప్రయాణం
కొనసాగించాల్సిందే....

Pages