S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/16/2019 - 19:43

కొత్త మాటలని పుట్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇది వరలో - వ్యాసాలలోను, బ్లాగులలోను - ఎన్నో కోణాల నుండి చర్చించాను. ఇప్పుడు మరొక కోణం నుండి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి. మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామ, మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప మొదలైనవి.

03/16/2019 - 18:37

‘చిటపట చినుకులు పడుతూ వుంటే
చెలికాడే పక్కన వుంటే
చెట్టాపట్టగ చేతులు కలిపి
చెట్టునీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో
వెచ్చగ ఉంటుందోయి’ అన్నారో
మనసు కవి మనసారా ‘ఆనాడు’
నీడనిచ్చే చెట్టెక్కడుంది?
గొంతు తడిపే చినుకెక్కడుంది?
చెప్పలేని ఆ హాయి ఇంకెక్కడుంది - నీడ
‘్ధనమేరా అన్నిటికీ మూలం’
అన్న భావన నరనరాన నరునికి

03/16/2019 - 18:06

గోడపై కాలాన్ని మోస్తూ
క్యాలెండర్
కాలాన్ని మేస్తూ
గడియారం

* కనె్నతల్లి
కన్నతల్లయింది
చంటి బిడ్డ చేరింది
చెత్తకుండీ ఒడికి

* మూన్నాళ్లుగా వాన
మునకలేసింది
ఊరంతా
అభ్యంగన స్నానం

* ఆత్మాభిమానం ఓడి
ఆకలి గెలిచింది...
ఎంగిలిస్తర్లలో
ఎన్ని రుచులో...!!

03/09/2019 - 22:47

ఈ మధ్య రెండు కొటేషన్స్ చూశాను. అవి బాగా నచ్చాయి. మొదటిది జపాన్ కొటేషన్ - ఏడుసార్లు క్రిందపడినా పర్వాలేదు. ఎనిమిదో సారికి లేచి నిల్చో. రెండవది - కన్ఫూజియస్ చెప్పిన మాట. ‘ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి ప్రయత్నం చేయడంలోనే కీర్తి ఉంటుంది.’
ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేస్తాం. అవి రావు. ఏడుసార్లు అలా జరిగినా పర్వాలేదు. ఎనిమిదవ సారి విజయం సాధిస్తాం. ఈ ఏడు, ఎనిమిది అనేవి ఉదాహరణలు మాత్రమే.

03/09/2019 - 22:30

చిత్రకారులు తమ చుట్టూ ఉన్న జీవితాన్ని తమ ‘కళ’లో ప్రతిఫలింపజేస్తారు. ఈ లక్షణాన్ని బలంగా జీర్ణించుకున్న కొత్త తరం చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్. లంబాడా సామాజిక వర్గం నుంచి వచ్చిన శ్రీనివాస్ నాయక్ లంబాడా మహిళల అందచందాలను, వారి జీవన సౌందర్యాన్ని, ఆహార్యాన్ని, కాన్వాసు పైకి సృజనాత్మకంగా, రసరమ్యంగా అద్దుతున్నారు. అద్భుత నైపుణ్యంతో ఎందరినో ఆకర్షిస్తున్నారు.

03/09/2019 - 22:23

(గత సంచిక తరువాయి)
*

03/09/2019 - 22:20

19 శ్లోకాలు గల ఈ చిన్న గోపికాగీతకు చాలా విస్తారమైన వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ, సంగ్రహ తాత్పర్యం మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం.
గోపికలు గానం చేసే మధుర గీతానికి గల పూర్వాంగాన్ని ప్రధాన గ్రంథంలోనే మనం వివరించుకొని వున్నాం కనుక, దానిని పునరుక్తి చేయకుండా సూటిగా గీతాలలోనికి వెళ్ళిపోదాం.
జయతి తేధికం జన్మనా వ్రజ
శ్శ్రయత ఇందిరా శశ్వదత్ర హి
దయిత! దృశ్యతాం దిక్షు తావకా

,
03/09/2019 - 22:05

ఆంగ్లమూలం: ఆచార్య ఎస్.వి.శేషగిరిరావు. ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు.. ఇప్పుడు ఛాన్సలర్: కేరళ కేంద్ర విశ్వవిద్యాలయం, కాసర్‌గోడ్

03/09/2019 - 21:27

స్తంభోద్భవుడు లక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రి పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ తిరుపతి యాదాద్రిలో ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు నిర్వహించే లక్ష్మినరసింహుడి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు సవాహ్నిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ నెల 8నుండి 18వరకు 11రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా సాగనున్నాయి.

03/09/2019 - 20:19

అది ఓ నగరం.. మహానగరం...
అందొక పొదరిల్లు.. చుట్టూరా ఆకాశాన్నంటే
సుందర హర్మ్యాలు..
ఏపుగా ఎదిగి ఊర్ధ్వాకాశాన్ని తాకే
పలురకాల పాశ్చాత్య వృక్షాలు...
రకరకాల రంగురంగుల క్రోటన్ మొక్కలు...
పూలు పూయవు పరిమళించవు
ఆకులు రాలవు కాకులూ వాలవు
సుమ సుగంధ మకరందాలకై మాధుర్యాలకై
జుమ్మను భ్రమరమ్ములు ఇట చేరవు
బహుశా పూసౌరభాలు పరిమళించకనేమో

Pages