S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసిలి వాకిలి

01/12/2019 - 19:04

నేను-
ఏడు లోకాల సప్త దేహవాసిని
దృశ్యాదృశ్య జగత్తుల ప్రస్థానాన్ని
నలుకంచెల విజ్ఞాన బంధనాన్ని
పై మూడంచెల దేహాతీత ప్రజ్ఞానాన్ని
స్పృహ శక్తుల పాంచభౌతికాన్ని
మనసూ బుద్ధుల స్నేహితుణ్ని.
అవును, నేను
షట్చక్ర చాలనంతో భక్తి శోభితున్ని,
దళ సాపేక్షత లేని చక్రకోశాన్ని.
* * *

01/05/2019 - 19:55

నేను-
పలికితే పరవశించే నమ్మకాన్ని
తడిమితే పులకరించే విశ్వాసాన్ని
మాటను అందలమెక్కించే అధికారాన్ని
సమాలోచనల సిద్ధాంతాన్ని
సంఘర్షణల రాద్ధాంతాన్ని
నచ్చిన బాటన ప్రణాళికను
మెచ్చిన మార్గాన ప్రబోధాన్ని
పరంపరల ఉపదేశాన్ని
గాయపడ్డ చేతను
పట్టు తప్పిన ఉద్విగ్నతను
నొచ్చుకున్న మానసికతను.
నేను
చేతనాచేతన కలశాన్ని

12/29/2018 - 18:52

నేను
ప్రాణ అపాన ఉదాన వాయు చలనాన్ని
ఇడ పింగళ సుషుమ్మ నాడీ చాలనాన్ని
జనన మరణ ప్రాణ ప్రభంజనాన్ని.
* * *
నేను

12/22/2018 - 19:37

నేను అన్నమయ ఇతిహాసాన్ని
ప్రాణమయ పురాణాన్ని
మనోమయ ప్రబంధాన్ని
విజ్ఞానమయ నిఘంటువుని
ఆనందమయ ఆకాశిక పొత్తాన్ని.
ఆహారమే నా ఉనికి
గుండె లయనే నా జీవశక్తి
ఆలోచనలే నా వర్తమానం
విజ్ఞానమే నా రేపటితనం
ప్రజ్ఞానమే నా అస్తిత్వం.
నేను మట్టి ముద్దను
నేను శ్వాసక్రియను
నేను భావలహరిని
నేను పరిశోధనా పాఠవాన్ని

12/15/2018 - 18:19

నేను-
మానవతన ఆరడుగుల విగ్రహాన్ని
మూడడుగుల సుఖాసనంలోకి చేర్చి
పుష్పాలంకారాలు, ధూపదీపాలు
సహస్ర నామాలు, మంగళ హారతులు లేని
నిరాడంబర మనస్కతతో
కనురెప్పల్ని వాల్చితే
తనువు, మనసు కాస్త మారాం చేసినా
నా విగ్రహంలో నిగ్రహం ఆవిష్కృతమవుతుంది.
అవును,
కనుదోయి చీకటి తెర మాటున
ఆలోచనలను అల్లుకుంటూ పోకుండా
గతాలను కనటం, వినటం మానేస్తే

12/01/2018 - 22:01

నేను..
ఒక అవేర్‌నెస్.. స్పృహను వాస్తవాన్ని
ఒక ఎగ్జిస్టెన్స్.. అస్తిత్వాన్ని, స్థితిని.
ఒక ఇన్నొవేషన్.. శోధనను, సాధనను.
ఒక ఇమాజినేషన్.. ఊహను, ఆలోచనను.
ఒక ఇనె్వన్షన్.. ఆవిష్కరణను, పరిశోధనను.
ఒక రిఫ్లెక్షన్.. ప్రతిఫలనాన్ని, ప్రతిబింబాన్ని.
ఒక ఎన్‌లైటెన్‌మెంట్.. జ్ఞానోదయాన్ని, స్వీయాభివ్యక్తిని
ఒక రియలైజేషన్.. సాక్షాత్కారాన్ని, దర్శనను.

11/03/2018 - 19:27

నేను...
జీవగంగా భగీరథ తపస్విని.. చైతన్య విస్ఫోటనా విశ్వమిత్రుడిని.. భౌతిక అధిభౌతిక లయకారుడిని.. త్రిగుణ లలాట కాలరేఖను.. కణప్రాయ కాంతిలేఖను.. తామసిక అధో చైతన్యాన్ని.. తాపసిక ఉన్నత చైతన్యాన్ని.. సాంసారిక సరూప చేతనను.. ఐహిక సంగమ చేతనా కెరటాన్ని.. ఆముష్మిక సాంద్రతా కెరట కిరణాన్ని.

10/27/2018 - 21:54

నేను-
ప్రాణం + జీవం + ఆత్మ.
త్రిశక్తుల సంగమ నిమ్జనం.
త్రైవాహికా చైతన్య విస్ఫోటనం.
సంగమ విస్ఫోటన జీవన ప్రస్థానం.
ప్రాణ, జీవ శక్తులు భౌతిక జీవితాన్ని నిర్దేశిస్తుంటే ఆత్మశక్తి అధిభౌతిక జీవనాన్ని నియంత్రిస్తోంది. ఇక్కడ నియంత్రణ అంటే చైతన్యం అని. అంటే, ఆత్మశక్తిది అధిభౌతిక చైతన్యం అని.

10/27/2018 - 21:53

నేను
భూగోళ తత్త్వం + ఖగోళ తత్త్వం
దేహ తత్త్వం + దేహాతీత తత్త్వం
దృశ్య తత్త్వం + అదృశ్య తత్త్వం
దేహపరంగా షట్చక్రాలు.. దేహాతీతంగా త్రిచక్రాలు. మొత్తానికి,
నవచక్ర శోభితంగా
‘నేను’ శాశ్వత, అశాశ్వతం మేలు సంగమం.
అశాశ్వత నుండి శాశ్వతకు ప్రస్థానం.
తొలి చక్రం నుండి దేహపరంగా ఏడవ చక్రం నుండి దేహాతీతంగా ‘నేను’ ప్రస్థానం.

10/27/2018 - 21:52

మన ఇతిహాసమైన మహాభారతంలోని కుంతీ తనయులైన కర్ణ, పంచపాండవులది వర్జిన్ బర్తే! A Sexual Reproduction. లో పేరెంట్ అంటే తల్లి అంశ అనే కాక తండ్రి అంశతో సారూప్యత అనేది అటు పాండవులలోను, ఇటు చందులోను చూడగలం.

Pages