S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాసిలి వాకిలి
నేను.. సాక్షిని
ఆదికి అంతానికి
మూర్తానికి మూలకానికి
అమూర్తానికి అమర్త్యానికి
దేవకణానికి దైవికానికి
పదార్థానికి పరమార్థానికి.
*
కళ్లు మూసుకున్న చీకటి
కనురెప్పల మాటున
ద్యానమగ్నమవుతోంది
కదలని కనుపాప
కరగుతున్న రేపటికి వర్తమాన
దృశ్యమవుతోంది
తాపసిక ధ్యాస
నిన్నటిని నేటిమట్టం చేసి
అసదృశమవుతోంది
-2-
-1-
నేను
కాంతి వేగానికి వారసుణ్ని
కాల యానానికి అంతర్విధిని
కణ విస్ఫోటనానికి అంతర్లయని
ధూళి దూసరిత భూవలయాన్ని
లోచన సాంద్రత నెరిగిన నేత్రాన్ని.
-2-
నేను
ఆత్మజీవిని
అంతరంగ మధనాన్ని
తొలిగా ఆవేదనల పరిశోధనను
మలిగా మానసాతీత శోధనను
మలుపులో పరసీమల పార్శ్వాన్ని
-3-
నేను
స్పందనకు నేపథ్యాన్ని
నేను
కాలచక్ర ధ్యానబోధిని
బుద్ధగయ అతులిత స్థితిని
హృదయకుహర దివ్య ఆరామాన్ని
అఖండ ప్రవిమల మానవ ధర్మాన్ని
ధార్మిక చింతనా సంఘటిత జీవనాన్ని.
-2-
నేను
అభిమతాన్ని.. కాను, మతాన్ని
సమత్వాన్ని.. కాను, దురాచారాన్ని
జ్ఞానిని.. ఎదురీత నేర్చిన జీవిని
ధ్యానాన్ని.. జీవన అంతర్వాహినిని
అనే్వషిని.. తాపసిక వౌన వలయాన్ని.
-3-
-1-
నేను
పుట్టాను
చరమాంకాన కబళించే మృత్యువు
నా పుట్టుకకు సాక్షి సంతకమైంది
కడదాకా నీతో ఉంటానన్న ఒడంబడికతో
నా దేహాన్ని పలకరించి పరవశింపచేసింది
ప్రాణంగా, జీవంగా, ఆత్మ తోడుగా.
*
నేను
జీవిస్తున్నాను
మనసు మార్గాన.. మృత్యు నీడన
గెలుస్తున్నాను
ఆత్మ పథాన.. మృత్యు నేత్రాన..
జ్వలిస్తున్నాను
-1-
నేను.. మీనాన్ని
ఇహ జీవానికి తొలి కణాన్ని
చలనానికి చిరునామాని
తడి ఆరని తత్వానికి నేపథ్యాన్ని.
*
విశ్వ చైతన్యానికి కరచాలనాన్ని
దృష్టి మాధ్యమానికి మీననేత్రాన్ని
శబ్ద తరంగానికి నిశ్శబ్ద అంతరంగాన్ని
జలధి వనరుకి నిరుపమాన సౌందర్యాన్ని.
*
రూపానికి చేపను
సృష్టి పరిణామానికి తెరచాపను
ప్రవాహ వేగానికి అనవరత ఎదురీతను
నేను..
చీకటిలో ముసుగు తన్ని నిద్ర నటిస్తున్నప్పుడు
నా మనసు మరింతగా తేజరిల్లుతుంటుంది
నా ప్రాపంచికతను జోకొట్టి పరుండబెడితే
నా మనసు శ్వాసలో ప్రాణం పోసుకుంటుంటుంది
అయినా, ప్రతిరోజూ
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!
నేను
ఏకత్వాన్ని
భిన్నత్వాన్ని
సంపూర్ణత్వాన్ని
ఏకత్వమొక్కటే సత్యం కాదు
భిన్నత్వాలు మాయలూ కాదు
ఏకత్వం నుండి భిన్నత్వం
భిన్నత్వమూ సత్య సంపదే
సంపూర్ణ సంధతే
నేను
సంపూర్ణతను
కలిపినా తీసివేసినా
కదలని సం‘పూర్ణ’తను
ఏకతల సంపూర్ణతను
భిన్నతల సంపూర్ణతను
అనేకతల సంపూర్ణతను
-1-
నేను.. చదివిన పుస్తకాన్ని
చదవని మస్తిష్కాన్ని.. రూపంలోని అరూపాన్ని
అరూపంలోని రూపాన్ని
శబ్దకుహర శూన్యాన్ని
శూన్యతల నిశ్శబ్దాన్ని
ఆత్మపథ తపస్సును
దివ్యజ్ఞాన మహస్సును
కనిపించే మానవతత్వాన్ని
కనిపించని విశ్వతంత్రాన్ని.
*
నేను.. అద్భుత మహత్తుల వారసత్వాన్ని
సృజనల అంతస్తును, అంతస్సును
అనుభవానికి అలదిన అనుభూతిని
నేను ఎవరు?
పాతాళ లింగ మహర్షిని
అరుణాచల పాద నేత్రాన్ని
భూవలయ వౌలిక శక్తిని
అగ్ని క్షేత్ర శూన్య వౌనాన్ని
వాహన మంటప నిర్వ్యాపారాన్ని
హరితవనాన ధ్యాసలేని ధ్యానాన్ని
తమస్సును గిక తపోవనాన్ని.
*
నేన ఎవరు?
గమ్యాన్ని, కాను గమ్యస్థానాన్ని
గమనాన్ని, కాను గమ్యరచనను
వేయిస్తంభ మంటప సాధనను
సహస్రార గమన తపస్సును
-1-
నేను
మహర్షిని
రమణాచలాన్ని
వౌనక్షేత్ర మునివాసాన్ని
అచల శిఖర అరుణ నేత్రాన్ని
మూలతాడున వౌన కౌపీనాన్ని
రాచపండున మృత్యువలయాన్ని
స్వాత్మతరించిన అమృతత్వాన్ని.
*
అరుణ శిఖరాన శ్రీచక్రాన్ని
శిఖర గర్భాన నవ మండలాన్ని
అష్ట దిగ్బంధన లింగ ప్రాకారాన్ని
అనాచ్ఛాదిత రూప విలాసాన్ని
గిరి ప్రదక్షిణన పథ సవ్వడిని