S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాసిలి వాకిలి
-1-
తొలి బీజంగా ‘నేను’
తొలి ఇజంగా ‘నేను’
తొలి నిజంగా ‘నేను’
*
అక్షరానికి అందని
చీకటి వెలుగుల పారవశ్య ప్రబంధం...
తపనతో పల్లవించిన విశ్వసృజన!
పంచభూతాలుగా రూపించిన భూతలం!!
మానవ తత్వంతో సృష్టిమగ్నమైన ‘నేను’!!
-2-
నేను
సిగ్గిలని నగ్నతను
విరామ మెరుగని మగ్నతను
*
నేను
నగ్నత్వ వలువను
-1-
నేను
ప్రకృతి పురుష
స-రసధునిని
అస్తిత్వ అభేదాన్ని
పురుషలో ప్రారంభమైన
తొలి ప్రస్థానాన్ని
ప్రకృతి పొదువుకున్న
మలి అవతారాన్ని
మాతృగర్భాన
పరిణమిస్తున్న
అంతస్తత్వాన్ని
సృష్టి కావ్యానికి
కదులుతున్న
అధ్యాయాన్ని
రూప ప్రబంధానికి
సాంద్రమవుతున్న
ముఖచిత్రాన్ని
శబ్ద శతకానికి
నేను
ఆత్మను అక్షరంలోకి దింపుతానంటే
ఆత్మే అక్షయంగా కదలాడతానంది
అక్షర అక్షరాన్ని దున్నుకుంటూ పొమ్మంది
మట్టిపెళ్లల దాగిన మనిషి కథను చూడమంది
కథను చరిత్రగా మలచిన తీరు కనమంది
చరిత్ర కెక్కని శేషావతారాన్ని ఆత్మకథ చేయమంది
అవును
మానవ చరిత్రలో మనిషి కనిపిస్తుంటాడు
మరి మనిషి కథలో ఆత్మ మేల్కొంటుందా?
మనిషి తన కథ వినిపిస్తేనేగా ఆత్మ కదిలేది
నేను
భౌతిక వాసనల సాంద్రతను!
గిక రచుల సువాసనను!
గికంగా ‘నవ వానవ’ ప్రయాణం రంగు, రుచి, వాసనల సాంద్ర సువాసనలతో ప్రారంభమవుతుంది. పుడమి పైకి వచ్చిన మానవ నిర్మాణం ఒకటయితే యోగ సాధనతో ఈ దేహ నిర్మాణంలో జరిగే పునర్నిర్మాణం మరొకటి.
నేను
మెలకువను -
కలలోను.. ఇలలోనూ!
దృశ్యంలోను.. అదృశ్యంలోనూ!
చీకటిలోను.. వెలుతురులోనూ!
ఉచ్ఛ్వాసలోను.. నిశ్వాసలోనూ!
నేను
నిద్రలోని మెలకువను -
సుడులు తిరుగుతు, తిరుగుతూ
ఉదయానికి జ్ఞానప్రసూన మవుతాను
ధ్యానగర్భ నవుతూ
అక్షరంగా ప్రసవిస్తాను
అ-క్షరంగా!
నేను-
అచేతనా చేతనను
- యోగ నిద్రను.
సమాధి స్పృహను
నేను అమాత్రను
ఏ కాలమానాలు లేనివాడ్ని
నేను విరాగిని
ఏ కొలమానాలు లేనివాడ్ని.
నేను గికాన్ని
ఖగోళ చైతన్యాన్ని
నేన యోగిని
పురుష ప్రకృతుల ప్రజ్ఞను.
* * *
నేను-
నేను-
బుద్ధి జీవిని.. బుధక్షేత్రాన్ని.
మానసికాన్ని.. మానస సంచారిని.
అతీత మానసాన్ని.. జ్ఞానత్రయాన్ని
నాలో
ఒక మెదడు
ఆ మెదడుకు కుడి ఎడమలు...
ఈ కుడి ఎడమలు ఏకం కావటమే యోగం.
ఈ జీవన యోగమే న్యూరాన్ ఫ్యూచర్.
నేను
అలిఖిత ప్రతిని
సంకల్ప సంహితను.
అదృశ్య అక్షరాకృతిని
అతీత మానస సంచారిని
ఆత్మ జాగృత సత్యాన్ని.
నాది -
స్వప్నం కాని సత్యలోక ప్రస్థానం
ఇహం కాని పరకాయ ప్రవేశం.
* * *
నేను
దేహాన్ని! మనస్సును!!
వ్యక్తిని! వైయక్తికాన్ని!!
వ్యక్తిత్వాన్ని! వ్యక్తిమత్వాన్ని!!
అడుగులు నావే! అడుగుజాడలు నావే!!
నిర్ణయాలు నావే! ఫలితాలు నావే!!
సుఖమూ నేనే! శోకమూ నేనే!!
వ్యామోహమూ నేనే! వైరాగ్యమూ నేనే!!
మంచీ నాదే! చెడూ నాదే!!
స్పృహ నాదే! స్పందనా నాదే!!
నెగెటివిటీ నేనే! పాజిటివిటీ నేనే!
నేను
ఎమోషనల్...
అయినా గెలవాల్సిందే!
అవును, నేను గెలుపును -
మనసు గెలుపును
గెలుపు అనుభూతిని
దేహ గెలుపును
గెలుపు అనుభవాన్ని.
గెలుపు అంటేనే-
ఇంటెలిజెంట్ పిలుపు.
పాజిటివ్ తలపు.
నేను
ఫిజికల్..
అయినా గెలవాల్సిందే!
అవును, నేను గెలవాల్సిందే!
నిబ్బరంగాను - నిబ్బనంగాను
నిర్యాణంలోను.. నిర్వాణంలోను