S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:01

చీరాల, జూలై 26 : ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుడు పవన్‌కుమార్ సూచించారు. శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ పంచాయతీ రామకృష్ణానగర్‌లో మంగళవారం డెంగ్యూ వ్యాధిపై ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

07/27/2016 - 05:00

ఒంగోలు అర్బన్, జూలై 26 : పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసేందుకు కృషి చేయాలని సిపిఎం రాష్టక్రమిటీ సభ్యుడు ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం నాటికి మూడవరోజుకు చేరుకున్నాయి. ఈ తరగతుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ-పరిణామాలపై ఆయన మాట్లాడారు.

07/27/2016 - 05:00

కొనకనమిట్ల, జూలై 26: మండలంలోని మర్రిపాలెం ఉన్నత పాఠశాల ఆవరణలో తీసిన ఇంకుడుగుంతలో పడి విద్యార్థి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఇంకుడుగుంతలోకి నీరుచేరి గుంత కనిపించకుండా ఉండటంతో ఆడుకుంటున్న విద్యార్థి కోటపాటి సాంబశివ (9) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి మృతిచెందాడు.

07/27/2016 - 04:59

జరుగుమల్లి, జూలై 26: మొక్కల పెంపకం ఉద్యమంలా చేపట్టి ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎంపిపి పి పద్మావతి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిపి పద్మావతి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.

07/27/2016 - 04:59

మద్దిపాడు, జూలై 26 : వర్షాభావ ప్రభావంతో మండలంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఈవో ఆర్‌డి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన కార్యదర్శితో కలిసి మద్దిపాడు తదితర ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈవోఆర్‌డి మాట్లాడుతూ మద్దిపాడులోని పలు కాలనీల్లోనూ, దళితవాడల్లో మంచినీటిని వృధాగా వదులుతున్నట్లు పేర్కొన్నారు.

07/27/2016 - 04:58

పొదిలి, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌కంటాక్స్ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కోరారు. మంగళవారం స్థానిక వాసవీ కల్యాణ సదన్‌లో ఆదాయ వెల్లడి పథకం పట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ఆదాయ ఆస్తుల వివరాలు వెల్లడించని వారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

07/27/2016 - 04:58

వేటపాలెం, జూలై 26: ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ ఈ నెల 29న జరగనున్న వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్, చీరాల నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. మండలంలోని పందిళ్లపల్లిలో జరుగుతున్న పల్స్‌సర్వేను ఆయన మంగళవారం పరిశీలించి అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

07/27/2016 - 04:56

శ్రీకాకుళం: టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం 2019 నాటికి 80శాతం ఓటర్లు పార్టీ కుటుంబ సభ్యులు కావాలి. ఈ లక్ష్యంతో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకువెళ్లండని ఎమ్మెల్యేల పనితనానికి గ్రేడింగ్ ఇచ్చి శ్రమిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించి నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వౌకిక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

07/27/2016 - 04:55

సీతంపేట, జూలై 26: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సవర శిరీష(11) అనే గిరిజన విద్యార్థిని మంగళవారం మృతి చెందింది. ఈ నెల 18వ తేదీన బాలిక పాఠశాలలోనే అనారోగ్యానికి గురైంది. పాఠశాల హెచ్‌ఎం సీతంపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు.

07/27/2016 - 04:55

శ్రీకాకుళం, జూలై 26: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో చాలా కాలంగా మావోల కార్యకలాపాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక వ్యూహాం దాగివుందనే పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలు వాస్తవమే అన్నట్టువుంది.

Pages