S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/21/2017 - 23:17

1995 జూలై 13న విడుదలైన ‘శుభసంకల్పం’ సినిమాలోని ‘సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు’ అనే పాట ఎంతో స్వచ్ఛంగా వుంటుంది వింటూంటే. శ్రీకోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ సమర్పణలో ఎస్‌పి బాలు నిర్మించిన చిత్రమిది. కె.విశ్వనాథ్ దర్శకత్వం, ఎం.ఎం.కీరవాణి సంగీతం, పి.సి.శ్రీరాం కెమెరా నిర్వహణ. చిత్రంలోని పాటను చిత్ర, శైలజ పాడారు. వేటూరి రాసిన ఈ పాటలో ఆమనికి ఎస్‌పి శైలజ, ప్రియారామన్‌కు కెఎస్ చిత్ర పాడారు.

08/21/2017 - 23:16

పాతవే కావొచ్చు. తెలిసినవే అయ ఉండొచ్చు. కానీ పాత సినిమా సంగతులు కనిపించిన ప్రతిసారీ చదవాలనిపిస్తుంది. గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. అవునా.. అలా జరిగిందా? అనిపించే విషయాలను ఏదోక సందర్భంలో పదిమందితో పంచుకోవాలని అనిపిస్తుంది. అలాంటివే ఇవి.

08/21/2017 - 23:15

‘‘చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకొని.. ఉద్వేగభరితాక్షరాలతో రాసిన తన జీవిత గాథని ప్రజల హృదయ పొరల్లో నిక్షిప్తం చేసుకున్న పోరాట వీరుడిగా తెరపై చిరంజీవిని చూపబోతున్న అంతర్జాతీయ భారీ (సెట్టింగ్స్ కాదు) గ్రాఫిక్స్ సినిమాకి అడుగడుగునా విస్మయపరిచే ఆలోచనలు కావాలి! రెమ్యూనరేషన్ కూడా హైరేంజ్‌లో.. చిరంజీవి లెవెల్లో వుంటుంది.

08/14/2017 - 23:40

తలైవాను ఫాలో అయిపోవడానికి తెలుగందం -అంజలి స్కెచ్ ప్రిపేర్ చేసుకుంటుందన్నది ఇండస్ట్రీ టాక్. స్క్రీన్ మీద పాత్రలు తగ్గుతుండటంతో -కొత్త పాత్ర కోసం ఓన్ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు గ్లామర్‌కు తెలుగు సినిమాలు దక్కని సెంటిమెంట్ ఎలాగూ ఉంది కనుకే -తమిళానికే అంజలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

08/14/2017 - 23:38

సినిమాల్లో మామూలు హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు వేశ్య పాత్రలు వేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కారణం -ఆ పాత్రతో అన్ని రసాలు పండించే అవకాశం రావడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి సింపతీ దొరుకుతుంది. తాజాగా అలాంటి పాత్రలో నటించేందుకు మాజీ హీరోయిన్ సదా ఓకే చెప్పిందట.

08/14/2017 - 23:36

తళుక్కుమన్న అందంతో
అందరినీ మించి పోతుందనుకున్న
అను ఇమాన్యుయెల్
కెరీర్ అంత వేగంగా సాగడం లేదు. మజ్ను
తరువాత కిట్టుగాడు.. జాగ్రత్త తరువాత ప్రాజెక్టులు పడలేదు. తాజాగా బన్నీ కొత్త సినిమా నా పేరు సూర్యలో
అనుకు చాన్స్ దొరికే అవకాశం ఉందట. అదే జరిగితే కెరీర్ ఊపందుకోవడం ఖాయం.

చిత్రం.. అను ఇమ్మాన్యుయేల్

08/14/2017 - 23:30

అందగత్తెలు ఆటలోనే కాదు, పాటలోనూ ప్రతాపం చూపిస్తున్నారు. చాన్స్ దొరికినప్పుడల్లా చక్కగా ఉపయోగించుకుంటూ -తమది కూనిరాగం కాదు కోకిల గానమేనంటూ ప్రూవ్ చేస్తున్నారు. అందాల రాశిఖన్నా అప్పుడెప్పుడో జోరు సినిమాలో ఓ పాటేసుకుని -వావ్ అనిపించింది. తరువాత మలయాళ చిత్రం విలన్‌లోనూ తన స్వీట్ వాయస్‌తో మెప్పించింది. తాజాగా నారా రోహిత్‌తో బాలకృష్ణుడిలో జోడీ కట్టిన రాశి, ఈ చిత్రంలోనూ ఓ పాట పాడేసిందట.

08/14/2017 - 23:21

తెలుగు సినిమా కథకు ఏమైంది? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయ కొన్ని సినిమాలు చూస్తుంటే. నిజ జీవితంలో ఎక్కడోక చోట జరిగిన దాన్ని తీసుకుని కథ వండుకున్నామని చెప్తుండటాన్ని చూస్తుంటే -ఆ తప్పుల్ని ప్రోత్సహిస్తున్నట్టా? లేక పర్యావసానాలు తెలియ చెప్తున్నట్టో అర్థంగాక ప్రేక్షకుడు జుట్టు పీక్కుంటున్నారు. ఎవరినో కోరి వచ్చిన ఓ సినిమా మనకేం చెప్పిందో కొద్దిగా చర్చించుకుందాం.

08/14/2017 - 23:19

తెలుగు ప్రేక్షకులపై సినిమాల ప్రభావం చెరగని, చెదరని ముద్ర వేసిందని చెప్పవచ్చు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో పశువుల కాపరిగా ఉన్న యువకుడు చిత్తూరు నాగయ్య నటించిన యోగి వేమన సినిమా చూసి బాలయోగిగా మారి ప్రజలతో ఆధ్యాత్మిక చింతన కలగజేశారు. ఆ మహాయోగి కాలం చేసి దశాబ్దకాలం దాటినా ఆ క్షేత్రాన్ని ఇప్పటికీ ప్రజలు దర్శనాలు చేసుకోవటం వివేషం.

08/14/2017 - 22:09

సౌత్ క్రేజీ భామ శృతిహాసన్ మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించి అడ్డంగా బుక్కయింది? ఇదివరకే ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కొర్సాల్‌ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లి.. అతన్ని ఘాఢంగా కౌగిలించుకున్న సమయంలో మీడియా కంట పడడంతో ఫొటోలు బయటికి వచ్చాయి. శృతిహాసన్ అతగాడితో ఘాటు ప్రేమాయణంలో ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో శృతి పెద్దగా రియాక్ట్ కాకపోవడం...

Pages