S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/28/2017 - 22:35

ఏ తీగ పూవునొ/ ఏ కొమ్మ తేటినొ/ కలిపింది ఏ వింత అనుబంధవౌనో/ తెలిసీ.. తెలియని అభిమానవౌనో... -సుశీలమ్మ గొంతులో కోకిల స్వరంలా మదికి వినిపించే పాట ఇది. ‘మరో చరిత్ర’ చిత్రంలోని ఈ పాట చాలా ఇష్టం. ఎన్నో మణిపూసల్లాంటి సినిమాలకు పురుడు పోసిన కె బాలచందర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని -1978 మే 2న విడుదలైన చిత్రమే ‘మరో చరిత్ర’.

08/28/2017 - 22:32

వెనె్నలకు రచనలు పంపాలనుకునే వారు ఈ కింది విషయాలను గమనించగలరు

08/28/2017 - 21:01

నాలుగున్నర దశాబ్దాల పాటు ఐదు వందల చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను గడగడలాడించిన అత్తగారు -పొన్నాడ సూర్యకాంతం. కాకినాడ మెక్‌లారెన్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. సూర్యకాంతానికి చదువంటే ప్రాణం. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బెనారస్ హిందూ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలకు రేయింబవళ్లు చదువుతుంటే, ఒకరోజు మహానటి కన్నాంబ వచ్చి ‘నువ్వు సహజ నటివి. ఆరోగ్యం బాగా చూసుకో.

08/22/2017 - 00:26

ప్రియా బెనర్జీ గుర్తుందిగా. నారా రోహిత్‌తో ‘అసుర’లో నటించి అలరించిన బెంగాలీ బ్యూటీ. అందమంతా స్క్రీన్‌మీద పిండివంటలా వడ్డించినా -టాలీవుడ్‌లో మాత్రం కెరీర్‌కు పనికొచ్చే పాత్ర ఒక్కటీ దక్కలేదు. దీంతో బిగ్ స్క్రీన్ ఆశలు వదిలేసి -వెబ్ స్క్రీన్‌పై వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోడానికి రెడీ అయ్యింది. రానా దగ్గుబాటి పక్కన వెబ్ సిరీస్‌లో కనిపించబోతోందట ఈ బెంగాలీ బ్యూటీ.

08/22/2017 - 00:25

జిమ్‌కు వెళ్లలేదంటే -ఈరోజు నాది కాదన్న మాట. ఇదీ ఇప్పుడు నా లైఫ్ స్టయిల్ అంటోంది బుంగమూతి అందగత్తె -రకుల్ ప్రీత్‌సింగ్. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘్ఫట్‌నెస్ అంటే నాకు పిచ్చి. రోజూ జిమ్‌కు వెళ్లాల్సిందే. ఇది నా కోసమే కాదు, ఫ్రెండ్స్‌తోనూ వ్యాయామం చేయిస్తుంటా. జిమ్‌కు వెళ్లలేదంటే -ఆ రోజు నాది కానట్టే’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

08/22/2017 - 00:32

విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న ప్రకాష్‌రాజ్ సినిమాలు తగ్గించాడా? తండ్రి, విలన్ పాత్రలు వదిలేసి
ఇప్పుడు కొత్త పాత్ర లపై దృష్టి పెట్టాడా? తండ్రిగా ఆయన గెలిచాడు.
*

08/22/2017 - 00:29

స్వాతంత్య్ర సాధనకు ముందొచ్చిన తెలుగు సినిమాలు తక్కువ. అయినా వాటిలో దేశభక్తి గీతాల రాశి ఎక్కువ. స్వాతంత్య్ర నేపథ్యం పూర్తి కథాంశంగా తెలుగులో వచ్చిన చిత్రం ‘మనదేశం’ ఒక్కటేనేమో. అందులో స్వాతంత్య్ర సాధన కోసం ఊరేగింపుగా వెళ్లే గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తరువాత సాంఘిక చిత్రాల కథా వస్తువుతో సినిమాలు ఎక్కువయ్యాయి.

08/21/2017 - 23:22

ఆస్కార్ అవార్డు అంటే పెరటిలో పువ్వు కోసినంత సులభం కాదు. బజారుకెళ్లి బేరమాడి కొని సంచిలో వేసుకున్నంత సులువు కాదు. మన టాలీవుడ్ మాత్రం ‘ఆస్కార్’ కలలు కంటునే వుంది. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేకపోతోంది.

08/21/2017 - 23:20

తెలుగు సినిమాకు పరభాషా నటీమణులు పరిచయం కావటం అనాదిగా జరుగుతున్నదే. అయితే అలనాడు పరిచయమైన నటీమణులు అంకితభావంతో నటించారు. తిరువాన్కూరు సిస్టర్స్‌గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణి నర్తకీమణులుగా తెలుగు చిత్రాలకు పరిచయమై ఎనలేని కీర్తిని ఆర్జించారు. ప్రారంభ దశలో లైలామజ్ను, బీదలపాట్లు, తిరుగుబాటు మొదలైన చిత్రాలలో లలిత, పద్మిని నృత్యతారలుగా నటించి అలరించారు.

08/21/2017 - 23:19

1964లో విడుదలైన రంగుల శిల్పకావ్యం. మహాశిల్పి జక్కన్న జీవితంలోని ఘట్టాలను ఆధారం చేసుకుని చిత్రాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు నిర్మాత, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బిఎన్ రంగా. కెకె శేఖర్ కళాదర్శకత్వంలో వేసిన సెట్టింగులు సినిమాకి నిండుదనాన్ని చేకూర్చాయి.

Pages