S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/04/2017 - 21:29

సినిమాకు కొబ్బరికాయ కొట్టడం దగ్గరినుంచి గుమ్మడికాయ కొట్టేవరకు.. ఫస్ట్‌లుక్ విడుదల నుంచి టీజర్ కట్‌చేసే వరకు.. ఆడియో రిలీజ్ నుంచి సినిమా థియేటర్లకు వచ్చేవరకు.. ప్రతి సినిమాకూ ప్రకటించే పాస్‌వర్డ్ -బ్లాక్‌బస్టర్. కథమీద నమ్మకం ఒకరిది. కాంబినేషన్‌పై పిచ్చి నమ్మకం మరొకరిది. హీరో స్టామినా మీదో, దర్శకుడి స్టయల్‌మీదో నమ్మకం ఇంకొకరిది. ఇవేమీకాదంటే నిర్మాత పెట్టే బడ్జెట్‌మీద గట్టి నమ్మకం.

09/04/2017 - 21:29

గుత్తొంకాయ్‌కూరో బావా కోరివండినానోయ్ బావా పాట గుర్తుండే ఉంటుంది. వంకాయ కూర కాసేపు పక్కన పెడితే నటుడు వంకాయల అటు రంగస్థల నటులకు ఇటు సినిమా రంగంలోని నటులకు ఎంతో ప్రీతిపాత్రుడు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం)లో పనిచేస్తూ నాటకరంగంలో తనదంటూ ప్రత్యేకత చూపుతూ వేలాది ప్రదర్శనల్లో పాల్గొన్నాడు.

09/04/2017 - 21:28

1984లో వంశీనుంచి వచ్చిన సితార చిత్రం నాకు చాలా ఇష్టం. మహల్లో కోకిల అనే నవలను తీసుకుని పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. పంజరంలో పక్షిగా ఉన్న జమీందారీ కుటుంబానికి చెందిన యువతి ‘పేమ’ అనే స్వేచ్ఛను పొందిన కథ ఇది. అప్పట్లో ఈ చిత్రం పది థియేటర్లలో వంద రోజులు ఆడింది. చిత్రం ఏమంటే ఈ సినిమా స్టార్ హీరో లేడు. స్టార్ హీరోయిన్ లేదు. చెప్పుకోదగిన కాస్టింగ్ లేదు.

09/04/2017 - 21:31

ఈ పాట 1968లో వచ్చిన ‘పెళ్లిరోజు’ చిత్రంలోనిది. ఒక చిత్రంలో ఒక పాట సర్వ కాలాల్లో వివాహ వేడుకల్లో, కట్న కానుకల్లో అంపకాల్లో చిరంజీవిగా వుండిపోవడం చిత్రమైన విషయం కాదు! ఆచార వ్యవహారాల్లో మగపెళ్లివారికి ఆడపిల్లవాళ్లు లోకువ! ఇప్పటికీ అదే వరస! కట్నాలు పోసినా తాహతుకు మించి అప్పులు చేసి విందులు, వినోదాలు, లాంఛనాలు ఇచ్చినా పెళ్లిళ్లలో అపశృతులు తప్పవు! అది ప్రతిబింబిస్తూ ఈ పాట సాగుతుంది.

09/04/2017 - 21:27

అందాల రాక్షసి.. అదేనండి లావణ్య త్రిపాఠికి మొదటినుండి పెద్దగా గ్లామర్ పాత్రలు రావడంలేదు. దానికి కారణం ఆమె మొదటి సినిమా.. అచ్చ తెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న లావణ్యను ఎవరూ గ్లామర్‌గా చూడాలని అనుకోలేదేమో. అందుకే ఆ తరహా పాత్రలు రావడంలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడానికి కారణం గ్లామర్ రోల్స్ చేయకపోవడమేనని తెలుసుకున్నట్టుంది. అందుకే డోస్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.

09/04/2017 - 21:27

కొరటాల శివ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం హీరోయిన్ అనే్వషణ మొదలైంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించి చివరిగా ఇలియానాను ఎంపిక చేసారట. సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఇలియానా బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదగాలని అక్కడికి వెళ్లిపోయింది. అడపా దడపా అవకాశాలు వచ్చిన ఈమెకు కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి.

09/04/2017 - 21:26

ఇష్టం చిత్రంతో తెలుగుతెరపై మెరిసిన శ్రీయా శరణ్ పెళ్లి పీటలెక్కబోతోంది. దాదాపు 12ఏళ్ళుగా ఆమె ప్రస్థానం సాగింది. అనేక చిత్రాల విజయాలతోపాటు కొన్ని అపజయాలూ ఆమె ఖాతాలో ఉన్నాయి. జయాపజయాలకు అతీతంగా కెరీర్ సాగించిన శ్రీయ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హవా కొనసాగించింది. ప్రస్తుతం ఆమె నటించిన పైసా వసూల్ విడుదలైంది.

08/28/2017 - 22:37

తెలుగు సినిమా తెరపైకి ఏటా కొత్తందాలు వస్తూనే వుంటాయి. ఈ రంగుల ప్రపంచంలో ధృవతారలుగా వెలగాలని వచ్చేవారిలో నిలదొక్కుకుంటున్నవారు పది శాతమే. హీరో చుట్టూ కథలల్లుకునే టాలీవుడ్‌లో 70 ఏళ్లు దాటినవాళ్లకూ హీరో అవకాశాలు దక్కడం మామూలే. కాని, తెరపై హీరోయిన్ జీవితకాలం మహా అయితే పదేళ్లు. అందుకే ఏ సినిమా పరిశ్రమలోనైనా హీరోయిన్ల లెక్కలే ఎక్కువే.

08/28/2017 - 22:36

చేదు అనుభవాలను తీపి జ్ఞాపకాలుగా ఎలా మలుచుకోవచ్చో జానీలీవర్ జీవితాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. కళలపట్ల ఆకర్షితుడైన జానీలీవర్ పదహారణాల తెలుగువాడు. -బాల్యంలో మిత్రుల వద్ద మిమిక్రీ చేస్తూ వినోదపరుస్తూ ఆనందించేవాడు. తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా కొనసాగాలన్న ధ్యాసతో ప్రయత్నాలు చేశాడు. అయితే, అతని ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేకపోయాయి.

08/28/2017 - 22:36

1964లో వచ్చిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్స్ కాస్టింగ్ ఎన్టీఆర్, రాజనాల, జమున, భానుమతి, ఎస్‌వి రంగారావులు కనిపిస్తారు. సినారె, సాలూరి రాజేశ్వరరావుల సాహిత్య సంగీతాల పరిమళాలతో నిర్మాత రిపబ్లిక్ సీతారాం సాహసించి తీసిన చారిత్రాత్మక చిత్రం ‘బొబ్బిలియుద్ధం’.

Pages