S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/30/2017 - 03:00

తమన్నా లండన్ వెళ్లిపోయింది. వేసవి బ్రేక్ కాదు, కొత్త ప్రాజెక్టు కోసం. కొత్త ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తమన్నా మకాం లండన్‌లోనే ఉండొచ్చని అంటున్నారు. ‘్ఫనా’, ‘హమ్‌తుమ్’, ‘తేరి మేరి కహాని’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లి తన తెలుగు ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను లండన్‌లో ప్రారంభించాడట.

05/30/2017 - 02:59

క్రేజీభామ శ్రీయ ఈమధ్య మళ్లీ జోరు పెంచింది. లేటెస్టుగా బాలయ్య వందో సినిమాలో నటించిన శ్రీయ, బాలయ్యతోనే 101వ చిత్రంలోనూ జతకట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతోపాటు నక్షత్రం సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుంటే, లేటెస్టుగా ఓ యువ దర్శకుడితో సినిమాకు శ్రీయ ఓకె చెప్పడం షాక్ ఇస్తుంది.

05/30/2017 - 02:56

చిత్రం భళారే విచిత్రం పాట చలన చిత్ర చరిత్రలో ఒక అద్భుతం. ఆనవాయితీగా వచ్చే నాయకానాయికల యుగళ గీతాల గతాన్ని చెరిపేసి, ప్రతి నాయకుడికి యుగళ గీతాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెల్లింది. పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన సినారె రచన ‘చిత్రం భళారే విచిత్రం’ ఒక చిత్ర గీతమే కాదు.. పాటల తోటలో ప్రత్యేకంగా అరవిరిసిన ఆహ్లాదాల గులాబీ.. ఒక సమ్మోహనాస్త్రం.

05/30/2017 - 02:54

తెలుగు వారికి గర్వకారణం, మరపురాని మహాద్భుత చిత్రం పద్మాలయా ‘అల్లూరి సీతారామరాజు’. కృష్ణ 100వ చిత్రంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రంగా 1974న విడుదలైంది. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఎన్నో సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు వి రామచంద్రరావు. అల్లూరి పాత్రలో ‘కృష్ణ’ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

05/30/2017 - 02:52

తెలుగు చలనచరిత్రలో అపూర్వమైన చిత్రం ‘మాయాబజార్’. ప్రపంచ సినిమాకు మాయాబజార్ స్క్రీన్ ప్లే పెద్దబాలశిక్ష లాంటిదని విమర్శకులు ఇప్పటికీ పొగుడుతూనే ఉన్నారు. ప్రేక్షకులకు తెలిసిన ఓ కథకు సంబంధించిన విషయాన్ని తీసుకుని, తెలియని ఓ కథనం అల్లుకుని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన మాయాబజార్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆవకాయ పప్పు అంత ఇష్టం!

05/30/2017 - 02:50

ఒకప్పుడు కథ విషాదాంతమైనా సినిమా సందేశాత్మకంగా ఉండేది. ప్రస్తుతం హింస, శృంగారం మితిమీరిపోయి.. వ్యక్తుల మనసుల్ని విషపూరితం చేస్తున్న సినిమాలకు ఎవరు అడ్డుకట్టవేయాలి? వాటివల్ల ప్రేరేపింపబడుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

05/30/2017 - 02:08

హీరోయిన్‌గా ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం ఈ భామకు కలిసి రాలేదు. అటు గ్లామర్‌తో ఆకట్టుకోవాలని చూసినా పెద్దగా లాభం లేకపోయింది. పోనీ హిందీలో కుదరలేదని సౌత్‌లో ట్రై చేసినా.. పరిస్థితి సేమ్ టు సేమ్. ఆమె ఎవరో కాదు, ఆమధ్య ఎన్టీఆర్ సన్నబడ్డ కొత్తలో కంత్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తానీషా ముఖర్జీ. బాలీవుడ్ గ్లామర్ భామ కాజోల్‌కు కజిన్‌గా ఈమె చేసిన హీరోయన్ ప్రయత్నాలు ఏవీ వర్కవుట్ కాలేదు.

05/29/2017 - 21:48

హాలీవుడ్ యాక్షన్ సినిమా అనగానే పూనకం వచ్చేసే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లకోసమే అన్నట్టు -హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సైతం హిట్టయిన చిత్రానికి సీక్వెల్స్ పేరిట ‘పరంపర’ను సంధించటం అలవాటు చేసుకున్నాయి. వరుసపెట్టి వచ్చే సిరీస్‌లో ఏ ఒక్కటీ విఫలయం కాకుండా ‘ఓహ్’ అనిపించుకుంటున్న చిత్రాల్లో ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

05/29/2017 - 21:46

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక రాజ్ తెలుగు తెరపైకి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. అమితాబ్‌తో రూపొందించిన బాలీవుడ్ సినిమా ‘కభీ ఖుషి కభీ గమ్’ చిత్రంలో చిన్ననాటి కథానాయికగా లేలేత బుగ్గలతో నటించిన మాళవిక, తాజాగా తెలుగులో జయదేవ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది.

05/23/2017 - 05:57

తెలుగు పాటకు ప్రత్యేక గౌరవం కల్గించి పట్ట్భాషేకం చేయడం, సాహిత్యానికి, సంగీతానికి, గాత్రానికి ప్రథమ తాంబూలం ఇవ్వడంవంటి సర్వోన్నతమైన క్రియలు చేయడానికి సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జయభేరి చిత్రాన్ని ఆలంబనగా చేసుకున్నారని చెప్పడానికి ఏ మాత్రం సంకోచపడాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో ప్రత పాట ఓ ఆణిముత్యం. ఏ పాటను కూడా తక్కువ చేసి చెప్పలేం.

Pages