S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/18/2016 - 06:45

విశాఖపట్నం, డిసెంబర్ 17: జస్టిస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా శనివారం విశాఖ పోర్టు కళావాణిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.

12/18/2016 - 06:42

విజయవాడ (క్రైం), డిసెంబర్ 17: సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్టేషన్ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిథిలోని గన్నవరంలో జరిగిన ఈ ఘటన పోలీసువర్గాల్లో సంచలనం రేపింది. అయితే ఘటనపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుని భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/18/2016 - 06:41

సింహాచలం, డిసెంబర్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ సతీ సమేతంగా శనివారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ ఈవో కె.రామచంద్రమోహన్ అర్చక పరివారంతో ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులు స్వామివారిని ప్రార్థించుకున్నారు.

12/18/2016 - 06:34

విజయవాడ, డిసెంబర్ 17: మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎపిఎస్‌ఆర్‌టిసికి దాదాపు రూ.50కోట్ల రూపాయలు పైగా నష్టం వచ్చింది. గత కొన్ని ఏళ్లుగా వెంటాడుతున్న నష్టం దాదాపు రూ.400 కోట్లపైనే వుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు..

12/18/2016 - 06:33

విజయవాడ, డిసెంబర్ 17: జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలను 2017 మార్చి మాసాంతంలోపు తొలగించాలంటూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలు మద్యం వ్యాపారులనే కాదు పాలకులను సైతం హడలెత్తిస్తున్నాయి.

12/18/2016 - 06:33

అమరావతి, డిసెంబర్ 17: ఆధునిక రాజధాని అమరావతి మహానగరంలో 27 పట్టణాలు ఉండే విధంగా సీఆర్డీఏ ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమయింది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో గ్రీన్ - బ్లూ (పచ్చదనం - జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు.

12/18/2016 - 06:06

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: తానా 40వ ఉత్సవాలను పురస్కరించుకుని ఎపి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

12/18/2016 - 06:03

అమరావతి, డిసెంబర్ 17: వివిధ వర్గాల అభివృద్ధి కోసం వేలాదికోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అవి ఆయా వర్గాలకు ప్రచారరూపంలో చేరడంలేదని భావించిన ప్రభుత్వం ఇక ప్రచారంపై సీరియస్‌గా దృష్టి సారించనుంది. చేసింది చెప్పుకోవడంలో తప్పులేదని, ఆవిధంగా చెప్పకపోతే ప్రతిపక్షాల నిందలు నిజమని నమ్మే ప్రమాదం ఉన్నందున, ఇప్పటివరకూ అనుసరిస్తున్న పాత ధోరణికి తెరదించి, కొత్త తరహా ప్రచారానికి తెరలేపనుంది.

12/18/2016 - 06:02

విశాఖపట్నం, డిసెంబర్ 17: దేశంలో అవినీతిని కడిగేసే ప్రక్రియ కొనసాగుతోందని, దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నిర్మించిన చిల్డ్రన్స్ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు.

12/17/2016 - 05:51

యలమంచిలి, డిసెంబర్ 16: ‘ప్రభుత్వం మంజూరుచేసిన రూ.1000 పింఛను చేతికి అందాలా... అయితే మీరు మరో రూ.1000 తీసుకొచ్చి, బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందే’... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఇదే విధానం అమలవుతోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం రూ.2000 నోట్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో రాష్టవ్య్రాప్తంగా చిల్లర కొరత అధికమైన సంగతి విదితమే.

Pages