S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/15/2017 - 01:12

విజయవాడ, జూన్ 14: రాష్టవ్య్రాప్తంగా రిజిస్ట్రేషన్లు లేకుండా తిరుగుతున్న 16 ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఆలిండియా పర్మిట్లు కలిగిన 900 కాంట్రాక్ట్ క్యారేజీ ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్‌లను అరుణాచలప్రదేశ్ రద్దుచేసిన నేపథ్యంలో ఆ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా తిరగకుండా నిలుపుదల చేసేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

06/15/2017 - 01:09

నంద్యాల, జూన్ 14: నంద్యాల అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్‌పోల్ లాంటివేనని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సార్వత్రికి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అటు టిడిపి, ఇటు వైకాపాకు ప్రతిష్టాత్మకంగా మారనుందని చెప్పాలి. టిడిపి నాయకుడు మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరడంతో నంద్యాల రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది.

06/15/2017 - 01:05

విజయవాడ, జూన్ 14: ఏడాదికి ఎకరాకు 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

06/15/2017 - 01:04

నెల్లూరు, జూన్ 14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆ శాఖామంత్రి పి నారాయణ నెల్లూరులోని విఆర్ కళాశాల ప్రాంగణంలో లాంఛనంగా బుధవారం ప్రారంభించారు.

06/15/2017 - 01:04

దేవరపల్లి, జూన్ 14: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంట నుంచి హైదరాబాద్‌కు వ్యానులో రహస్యంగా తరలిస్తున్న రూ.80 లక్షల విలువైన గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు బుధవారం స్వాధీనంచేసుకున్నారు. వ్యానులో ప్లాస్టిక్ కూరగాయల ట్రేల అడుగున ఉంచిన బస్తాల్లో రహస్యంగా తరలిస్తుండగా ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.

06/15/2017 - 01:03

దర్శి, జూన్ 14 : తన ఇద్దరు బిడ్డలు సహా బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని జముకుల దినె్న గ్రామంలో బుధవారం జరిగింది. జముకుల దినె్న గ్రామానికి చెందిన నరసింహారావు కుమార్తె పద్మ (25)ను తాళ్లూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు.

06/14/2017 - 04:18

కాకినాడ, జూన్ 13: గడచిన మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి అన్నారు. సామాన్య ప్రజల జీవితాల్లో వికాసాత్మకమైన, గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

06/14/2017 - 14:25

రాజమహేంద్రవరం, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని సిఐడి డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావు స్పష్టంచేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసెంబ్లీలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ గదిలోకి వర్షపునీరు లీకై, రాష్టస్థ్రాయిలో వివాదాస్పదం కావడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

06/14/2017 - 04:16

నరసరావుపేట, జూన్ 13: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ విధాన రూపకర్త సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు.

06/14/2017 - 02:51

విజయనగరం, జూన్ 13: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన జివిఎంసి సూపరింటెండెంట్ వెంపడాపు అచ్చెన్నాయుడు ఇంటిపై ఎసిబి అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి వీటి మార్కెట్ విలువ 15 కోట్లు పైగా ఉంటుందని అంచనా. ఎసిబి డిఎస్పీ షకీలాబాను నేతృత్వంలో అచ్చెన్నాయుడు నివసిస్తున్న ఇల్లు, బంధువుల ఇళ్లపై దాడులు జరిపారు.

Pages