S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/13/2017 - 23:54

ఒంగోలు,జూన్ 13: ప్రకాశం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) గోపాల,గోపాల, సికిందర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొసైటీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయటం నిబంధనలకు విరుద్దమని జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం శ్రీకాంత్ చెబుతుండగా తాను నిబంధనల ప్రకారమే చేశానని డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి చెబుతున్నారు.

06/13/2017 - 03:22

నంద్యాల, జూన్ 12: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీమంత్రి, నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల 14వ తేదీ తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో వైకాపాలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

06/13/2017 - 03:19

విశాఖపట్నం (జగదాంబ), జూన్ 12: పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.4వేల కోట్లు వెచ్చించనుందని మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో సోమవారం నుంచి ప్రారంభమైన బడి పిలుస్తోంది, విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని, విద్యార్థులే ముందు అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

06/13/2017 - 03:17

విజయవాడ, జూన్ 12: వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రైతులకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. భూ అవసరాలకు అనుగుణంగా సూక్ష్మ పోషకాల పంపిణీ జరగాలని సూచించారు. ఎరువులు, సూక్ష్మ పోషకాల పంపిణీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే పీడి యాక్ట్ కింద కేసులు నమోదుచేయాలని స్పష్టం చేశారు. అలాగే ఈనెల 16న రెయిన్‌గన్లను ప్రయోగాత్మకంగా వినియోగించాలని చెప్పారు.

06/13/2017 - 03:15

విజయవాడ, జూన్ 12: ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు విద్యుత్ ప్రమాదానికి గురైన బాధితులను ప్రభుత్వపరంగా పరిహారం అందించేందుకు విధి, విధానాలను ఖరారు చేయడం అభినందనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చెప్పారు.

06/13/2017 - 03:12

గుంటూరు, జూన్ 12: అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు భూములిచ్చేది లేదని పలు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

06/13/2017 - 02:08

రాజమహేంద్రవరం, జూన్ 12: జనసేన, కలిసి వచ్చే ఇతర పార్టీలతో కలిసి మూడవ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. రాజమహేంద్రవరంలో మూడు రోజులపాటు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.

06/13/2017 - 02:05

ఆదోని టౌన్, జూన్ 12: ఒకటి రెండు కాదు ఏకంగా రెండు వేల పాములు పట్టుకుని అడవుల్లో వదిలేశాడు బాషా. ఎలాంటి పామునైనా ఇట్టే పట్టుకుంటాడు. తన తండ్రి నుంచి పాములు పట్టే నైపుణ్యం నేర్చుకున్నట్లు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహబూబ్‌బాషా చెబుతుంటాడు. వంశపార్యపరంగా తమది పాములుపట్టే వృత్తి అని, అల్లా దయ వల్ల ఇప్పటివరకు పాముకాటుకు గురి కాలేదన్నారు.

06/13/2017 - 02:10

విజయవాడ, జూన్ 12: పంటలు పోయాయనో, అప్పుల పాలయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పంట కాకపోతే మరో పంటకైనా రైతుల్ని గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

06/13/2017 - 02:00

విశాఖపట్నం, జూన్ 12: పేదల భూములు బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ తీరుకు ముదపాక భూ ఉద్యమం కనువిప్పు కలగాలని అఖిలపక్షం నాయకులు ఉద్ఘాటించారు. ముదపాక అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్రపై నాయకులు మండిపడ్డారు.

Pages