S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/14/2017 - 02:44

విజయనగరం, జూన్ 13: సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ వాటి దుష్ప్రభావం వల్ల యువత పెడదోవ పడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో అశ్లీలాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

06/14/2017 - 02:40

విశాఖపట్నం, జూన్ 13: ఈ ఏడాది వేసవిలో విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో దాదాపు ఐదు వేల మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడకం జరిగింది. ఇది గత ఏడాది కంటే 500 మిలియన్ యూనిట్లు ఎక్కువని సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

06/14/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 13: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామ పోలీసుస్టేషన్‌లో జగన్ ప్రభుత్వాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

06/14/2017 - 02:37

అమరావతి, జూన్ 13: మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి రాజీనామాతో కర్నూలు జిల్లా నంద్యాలలో మారిన రాజకీయ సమీకరణలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించ నిర్వహించారు. ఆ మేరకు మంత్రి అఖిలప్రియ, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ నేతలతో బాబు మంగళవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంకా ఎవరైనా పార్టీని వీడే అవకాశం ఉందా..

06/14/2017 - 02:36

భీమవరం, జూన్ 13: ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక సంఘాల్లో తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. ఇప్పటికే నగరాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని పట్టణాల్లో సైతం అమలుచేయనున్నారు. ఈమేరకు పుర పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బహిరంగ ప్రదేశాల్లో స్వచ్చ్భారత్‌లో భాగంగా తడిపొడి చెత్త సేకరించే ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తున్నారు.

06/14/2017 - 02:35

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పునరావాస సదుపాయం కల్పించేంత వరకు వారి జోలికి పోమని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు చెప్పారు. ఏపి వ్యవసాయ కార్మికుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్లు కోర్టుకు తమ సమస్యలను విన్నవించారు.

06/13/2017 - 23:56

గుంటూరు, జూన్ 13: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చేనెల 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతికి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో ఈ సారి శాంతియుతంగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

06/13/2017 - 23:56

తాడిపత్రి, జూన్ 13: అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మంది అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

06/13/2017 - 23:55

విశాఖపట్నం, జూన్ 13: మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నర్సాపూర్, తెలంగాణలో ఆదిలాబాద్ ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్న రుతుపవనాలు, మెల్లమెల్లగా ఉత్తర కోస్తాకు విస్తరించే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. రుతుపవనాలు విస్తరించే క్రమంలో బుధవారం నుంచి క్రమంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

06/13/2017 - 23:55

విశాఖపట్నం, జూన్ 13: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖ భూముల కుంభకోణంపై ప్రభుత్వం నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. లక్ష ఎకరాలు, సుమారు 20 వేల కోట్ల విలువైన భూముల కబ్జా, లేదా ఆయా భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు జరిగాయని సాక్షాత్తూ కలెక్టర్ బహిర్గతం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్థించారు.

Pages