S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2017 - 00:38

విజయవాడ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ద్వారా 982 పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరి 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిందని, గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో రిజర్వేషన్లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభత్వుం జీవో నెం.570 విడుదల చేయటం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పేర్కొన్నారు. జివో నెం.

03/20/2017 - 00:38

విజయవాడ, మార్చి 19: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆదివారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈ నెల 9న జరగాల్సిన మేథమెటిక్స్ పరీక్ష ఆదివారం జరిగింది. 3లక్షల 90వేల 679 మంది అభ్యర్థులకు గాను 10వేల 869 మంది గైర్హాజరయ్యారు. కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగియటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

03/20/2017 - 00:37

విజయవాడ, మార్చి 19: రాష్ట్రంలో విద్యార్థులకు సంవత్సరాది పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొనే్నళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర కొనసాగుతూ వస్తోంది. లీక్‌లు వెలుగుచూసినప్పుడు ప్రభుత్వాలు కమిటీ వేసి చేతులు దులుపుకోవడమే తప్ప సంబంధిత లీకువీరులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్య, ఉన్నత విద్యశాఖల్లో నెలకొన్న ఈ దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

03/19/2017 - 04:15

విజయవాడ (క్రైం), మార్చి 18: నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు త్వరలోనే ‘టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థ’ను ప్రారంభించినున్నట్లు డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు.

03/19/2017 - 04:12

గుంటూరు, మార్చి 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. ముఖ్యమంత్రి నివాసానికి ఒకవైపు కృష్ణానదీ తీరం, మరోవైపు కొండలు దట్టంగా ఉండటంతో సాయంత్రం పూట ఆహారానికి సంచరిస్తున్న క్రమంలో ఆరడుగుల కొండచిలువ ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కోడిపుంజును మింగింది. కదలలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని చెట్లపొదల్లో చేరింది.

03/19/2017 - 04:12

గుంటూరు (కల్చరల్), మార్చి 18: వేగం, రాగం, ధారణా ప్రతిభ ఒక్కచోట చేరి, సమ్మిళితమై రెండున్నర గంటలకు పైగా ఆశుకవితా వచోవిన్యాసం చేసి గుంటూరు సాహితీప్రియులపై ఓ గంగా ప్రవాహంలా కవితాధారలు వర్షించాయి. ఈ కవితా ధారల్లో సాహిత్య, సారస్వత ప్రియులైన గుంటూరు నగర భాషాభిమానులు సంపూర్ణంగా తడిసిముద్దై, అవధాన శేఖరులకు హృదయాంజలులు సమర్పించారు.

03/19/2017 - 04:10

అమరావతి, మార్చి 18: శాసనమండలిలో కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. కులం, ప్రాంతం సమీకరణలతో కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న మండలి డెప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.

03/19/2017 - 04:09

విజయవాడ, మార్చి 18: రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో లావాదేవీలను పూర్తిగా నగదు రహితం చేయాలన్న ప్రభుత్వం లక్ష్యసాధన ఆచరణలో ముందుకు సాగడం లేదు. దాదాపు ఐదు నెలలుగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా 25 శాతానికి మించకపోవడం గమనార్హం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రహితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కనబరిచారు.

03/19/2017 - 04:09

విజయవాడ, మార్చి 18: రుణమాఫీ వర్తింపులో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నదంటూ రైతునేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమెత్తారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్ తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ అమలు చేయాలన్నారు.

03/19/2017 - 04:08

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 18: రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య, వైద్యసేవలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, అరాకొర నిధులతో రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్యం ఎలా సాధ్యమని ఎపిసిసి డాక్టర్స్ సెల్ కో-చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ ప్రశ్నించారు.

Pages