S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/03/2016 - 06:26

విజయవాడ, నవంబర్ 2: ఉగ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ స్వర్గ్ధామంగా మారిందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎపి వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ విమర్శించారు. ఉగ్రవాదులను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ స్వర్గ్ధామంలా భావించి కాంగ్రెస్ పార్టీలో ఉగ్రవాదులు చేరుతున్నారన్నారు.

11/03/2016 - 06:24

కాకినాడ, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద సాంకేతిక విశ్వ విద్యాలయంగా పేరొందిన కాకినాడ జెఎన్‌టియు ముద్రించిన ప్రశ్నాపత్రాలు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా ప్రత్యక్షమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని విద్యార్థులకు బలవంతంగా రుద్దేరీతిలో ఈ ప్రశ్నాపత్రాలు దర్శనం ఇచ్చాయి. ఇది తెలిసిన విద్యార్థిలోకం నివ్వెరపోయింది.

11/03/2016 - 07:31

విజయవాడ, నవంబర్ 2: పట్టణ పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నందున అల్పాదాయ వర్గాలకు చెందిన ఒక్కో కుటుంబం ఏడాదికి కనీసం అదనంగా రూ.60 వేల ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు అమలుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2019 నాటికి ప్రతి కుటుంబం ఆదాయాన్ని కనీసం రూ.లక్షకు పెంచాలని సూచించారు.

11/03/2016 - 07:29

శ్రీకాకుళం, నవంబర్ 2: ఇటీవల ఎఒబిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు గురువారం నిర్వహించనున్న ఐదు రాష్ట్రాల బంద్ పిలుపునకు ముందస్తు చర్యలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ‘కోబ్రా’ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశాయి.

11/03/2016 - 06:08

రేణిగుంట, నవంబర్ 2: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను విజయవంతంగా చెన్నై, విజయవాడకు వేరువేరుగా విమానంలో తరలించిన సంఘటన బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన మురళి అనే వ్యక్తి అవయవాలు- మూత్రపిండాలు (కిడ్నీలు), కాలేయాన్ని (లివర్) వేరొకరికి దానం చేయడానికి కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది అంతా సిద్ధం చేశారు.

11/03/2016 - 04:12

విజయవాడ, నవంబర్ 2: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏరకమైన అలసత్వాన్ని ప్రదర్శించినా బాధ్యులైన కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అనుకున్న సమయానికి, అనుకున్న దానికంటే మెరుగ్గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మించే విషయంలో ఏ విధంగానూ రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

11/03/2016 - 04:06

విజయవాడ, నవంబర్ 2: ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. వౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణకు సంబంధించిన ప్రకటనను యువజన సర్వీసుల శాఖ బుధవారం విడుదల చేసింది. ‘మిషన్ ఎవరెస్ట్ ఎపి యూత్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 8848 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ ఉంది.

11/03/2016 - 04:05

విజయవాడ, నవంబర్ 2: ఏ క్షణాన రాష్ట్ర విభజన జరిగిందో నాటి నుంచి అనుక్షణం వర్గ, ప్రాంత, కుల మతాల మధ్య ఏదో చిచ్చు రేగుతూనే వుంది. తొలుత రాజధానికి సంబంధించి భూసమీకరణ, ఆపై స్విస్ చాలెంజ్, కాలుష్యం.. వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కాపు, బిసి రిజర్వేషన్ వివాదం ఆ వర్గాల మధ్య రగులుతోంది. బందరు ఓడరేవు భూసేకరణపై వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది.

11/02/2016 - 07:13

ఒంగోలు, నవంబర్ 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టిడిపి కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు. దీంతో కిమ్మనకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఇన్‌చార్జులు హెచ్చరికలు జారీచేసిన నేపధ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ నాయకులు ఇగో మానుకుని కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరికలు జారీచేశారు.

11/02/2016 - 07:12

విజయవాడ, నవంబర్ 1: ఓట్ల రాజకీయాల కోసం, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ట్రిపుల్ తలాక్ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఎపి కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను ఖండిస్తూ మంగళవారం సమావేశం నిర్వహించారు.

Pages