S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/02/2016 - 07:11

విజయవాడ, నవంబర్ 1: క్షేత్రస్థాయిలో ఎరువుల వినియోగంపై జిల్లాలో అమలు చేస్తున్న ఎరువుల నిర్వహణ విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించేందుకు ఇదే అనుకూల సమయమని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. న్యూ ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందంతో మంగళవారం స్కైప్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

11/02/2016 - 07:10

ఉండి, నవంబర్ 1: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు పశ్చిమ గోదావరి జిల్లాలో జన నిర్బంధ యాత్రలుగా మారుతున్నాయి. పోలీసుల అతిప్రవర్తన కారణంగా ఉండి నియోజకవర్గంలో యాత్రల తొలిరోజే అధికార పార్టీ జనంలో అభాసుపాలయ్యింది.

11/02/2016 - 07:10

గుంటూరు, నవంబర్ 1: అసైన్డ్ భూముల (డాట్ లాండ్స్) విషయమై వచ్చే కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనలపై రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలను అమలుచేస్తున్నట్లు చెప్పారు.

11/02/2016 - 07:09

విశాఖపట్నం, సీలేరు, నవంబర్ 1: బెజ్జంగి ఎన్‌కౌంటర్‌లో ఏఓబిలో మావోయిస్ట్‌లు తుడిచిపెట్టుకుపోయారనుకున్నారు. ఏఓబిలో మావోయిస్ట్‌ల ఉనికే లేదంటూ పోలీసులు అభిప్రాయపడుతున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 30 మంది సాయుధ మావోయిస్ట్‌లు సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత దారకొండ, సప్పర్ల గ్రామాలకు రావడం గమనార్హం. విశాఖ ఏజెన్సీలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్ట్‌ల కోసం జల్లెడ పడుతున్నాయి.

11/02/2016 - 07:08

విజయవాడ, నవంబర్ 1: ‘విద్యతో ప్రగతి ప్రయాణం చేస్తుంది. విజయాలన్నీ విద్య వెంటే ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించినందునే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ విద్యా నగరంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో ప్రగతిబాటలు వేసేందుకు అనువైన బృహత్ ప్రణాళిక సిద్ధం చేశాం.

11/02/2016 - 07:08

శ్రీకాకుళం, నవంబర్ 1: సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావుకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో మంగళవారం అవినీతినిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు.

11/02/2016 - 07:07

విజయవాడ, నవంబర్ 1: టిడిపి సీనియర్ నాయకుడు, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య(53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మైలవరం నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి హోదాలో మంగళవారం నగరంలోని గొల్లపూడిలో జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

11/02/2016 - 06:57

కాకినాడ, నవంబర్ 1: మావోయిస్టు అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆయన రాష్ట్ర పోలీసుల అదుపులో లేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం సాయంత్రం చినరాజప్ప విలేఖరులతో మాట్లాడారు.

11/02/2016 - 06:53

తిరుమల, నవంబర్ 1: కలియుగ ప్రత్యక్షదైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని తాకాలంటే అత్యంత పవిత్రంగా లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. మఠాధిపతులైనా, పీఠాధిపతులైనా కూడా వారు గర్భాలయంలోకి వెళ్లడానికి అనుమతిలేదు. ఆ విధంగా టిటిడి నిబంధనలు రూపొందించింది.

11/02/2016 - 08:35

హైదరాబాద్, నవంబర్ 1: భారతదేశంలో మెడికల్, ఇంజనీరింగ్, ఫౌండేషన్ కోచింగ్ సంస్థల్లో అగ్రగామిగా ఉన్న ఆకాశ్ మరోమారు సీనియర్ , జూనియర్ ఆకాశ్ ప్రతిభానే్వషణ పరీక్షలను నిర్వహిస్తోంది. వైద్య , ఇంజనీరింగ్ వృత్తిలో రాణించదల్చుకున్న వారికి స్కాలర్‌షిప్ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Pages