S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/27/2016 - 06:26

తిరుపతి, ఆగస్టు 26: సినీ హీరో, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ తాను గతంలో ప్రారంభించిన జనసేన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తిరుపతి ఇందిరామైదానంలో శనివారం మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించడానికి జనసేన కార్యకర్తలు, నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో పవన్ ప్రజా సమస్యలతో పాటు ప్రత్యేక హోదాపై గళం విప్పుతారా? అన్న చర్చ సాగుతోంది.

08/27/2016 - 06:20

తాడేపల్లి, ఆగస్టు 26: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో శుక్రవారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. గుంటూరుకు చెందిన యువకులు ఆటోలో విజయవాడకు బయలుదేరారు. కొలనుకొండ సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. రక్షక్ పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని జీపుని నిలిపి క్షతగాత్రులకు సహాయ చర్యలు ప్రారంభించారు.

08/27/2016 - 06:16

ఒంగోలు, ఆగస్టు 26: అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ సిట్ బృందం శుక్రవారం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోదాలు నిర్వహించింది. ఒంగోలులోని మంగమూరురోడ్డులోని సురక్ష అపార్ట్‌మెంట్‌లో పహీం పేరుతో నరుూం బావమరిది ఫరానా ఇంటిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో సిట్‌బృందం గుర్తించింది. ఫరానా ఆ ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తోంది.

08/27/2016 - 06:16

మండపేట, ఆగస్టు 26: విశాఖ మహానగర పరిధిలోని గాజువాకలో ఏర్పాటు చేస్తున్న దేశంలోకెల్లా అతిపెద్ద గణపతికి.. అతిపెద్ద లడ్డూను అందించడానికి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలోని సురుచి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు) తెలిపారు.

08/27/2016 - 06:14

హైదరాబాద్, ఆగస్టు 26: ‘తుపానును జయించాం. కరువును జయించాం..’ ఇది ప్రభుత్వం తరచూ చేసే ప్రకటన. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. పొలంలోకి దిగితే కాళ్లు తడబడతాయి. కళ్లు తడిసిపోతాయి. బీటలువారిన భూములను చూసి భోరుమన్న వేదన వినిపిస్తుంది. సర్కారు చెప్పే రైతు సంక్షేమం పొలాల్లోకి తొంగిచూసి భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అక్కడ వినిపించేదంతా నీరులేని వేదన, రోదనలే. ఇదీ కరవాంధ్రప్రదేశ్ దృశ్యం.

08/27/2016 - 05:23

హైదరాబాద్, ఆగస్టు 26: పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డంకి అని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి పోలవరం ప్రాజెక్టు తీసుకుని రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం తేటతెల్లమవుతోందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

08/27/2016 - 05:21

రాజమహేంద్రవరం, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌లోని 13వేల గ్రామ పంచాయతీల పరిధిలో ఈఏడాది రూ.2500 కోట్లతో 5000 కిలోమీటర్ల మేర అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లు నిర్మిస్తామన్నారు.

08/27/2016 - 05:21

హైదరాబాద్, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌లో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్ ఎయిర్ లైన్ సర్వీసులను పెంచాలని రాష్ట్రప్రభుత్వం ఈ సంస్థలతో త్వరలో సంప్రదింపులు జరపనుంది. గత 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. త్వరలో దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్‌కు కొత్త విమాన సర్వీసులను నేరుగా ఆంధ్ర నుంచి వెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

08/27/2016 - 03:08

గుంటూరు, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మంత్రులు, ఉద్యోగులు తరలివస్తున్నారు. శుక్రవారం అటవీ, వైద్య, ఆరోగ్య శాఖ విభాగాలు ప్రారంభమయ్యాయి. అటవీ శాఖ కార్యాలయాన్ని, పేషీని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన చాంబర్‌ను వేదమంత్రోచ్ఛారణల మధ్య లాంఛనంగా ప్రారంభించారు.

08/26/2016 - 17:55

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించాయి. త్వరలోనే తమ శాఖ ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని ఆయన తెలిపారు.

Pages