S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/02/2019 - 23:37

న్యూఢిల్లీ, జూలై 2: ‘మనదేశం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. దేశ ఆర్ధికాభివృద్ధి డీమానిటరైజేషన్ వల్ల ఎలాంటి నష్టమూ జరగ లేద’ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘తయరీ రంగంలో నెలకొన్న తిరోగమనం వల్లనే ఆర్థిక ప్రగతి మందగించింది.

07/02/2019 - 23:35

ముంబయి, జూలై 2: వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పరుగును కొనసాగించాయి. ప్రధానంగా చమురు, సహజ వాయువులు, ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ బాగా లాభపడడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురైన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ చివరిగా 129.98 పాయింట్ల ఆధిక్యతతో 0.33 శాతం లాభపడి 39,816.48 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది.

07/02/2019 - 23:28

న్యూఢిల్లీ, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో ఐదు ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు రుణాలతో అమలవుతున్నయని, మరో నాలుగు ప్రాజెక్టులకు రుణ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

07/02/2019 - 23:18

మహదేవ్‌పూర్, జూలై 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. సోమవారం చండ్రుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జాడి సురేందర్ తన వ్యవసాయ భూమిలో బోరు వేస్తుండగా బొగ్గు నిక్షేపాలు వెలువడ్డాయి. తన వ్యవసాయ బావిలో బోరు వేస్తున్న సందర్భంగా బోర్‌వెల్ నుండి నల్లటి నీటితో పాటు బొగ్గు పెల్లలు బయటకు వచ్చాయని సురేందర్ తెలిపారు.

07/02/2019 - 23:04

హైదరాబాద్, జూలై 2: రవాణాశాఖ ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పర్మిట్ ఫీజుల రూపంలోనే ఈ ఆర్థిక సంవత్సరం 2018-19లో 7 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆర్టీఏ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణాశాఖలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకవస్తామన్నారు.

07/02/2019 - 04:24

ముంబయి: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోయే అవకాశాలున్నాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సోమవారం సూచీలు ర్యాలీని అందుకున్నాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ దూకుడును ప్రదర్శించి ఏకంగా 370 పాయింట్లు ఎగబాకింది. చివరిగా 291.86 పాయింట్లు ఆధిక్యతతో 0.74 శాతం లాభాలతో 39,686.50 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది.

07/02/2019 - 00:06

రామగిరి, జూలై 1: సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓ.బి వెలికితీతలో మెరుగైన అభివృద్ధి కనబరుస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది.

07/01/2019 - 23:04

న్యూఢిల్లీ, జూలై 1: రుణాలు తీసుకున్న వారిని బెదిరించి బకాయిలు వసూలు చేసేలా బౌన్సర్లను నియమించుకునేందుకు ఏ బ్యాంకుకూ అధికారం ఇవ్వలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు రిజర్వు బ్యాంకు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని ఆయన తెలిపారు.

07/01/2019 - 23:04

న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ స్పష్టం చేశారు. భారతలో నిరుద్యోగిత రేటును ఎక్కువగా చూపిస్తూ వెలువడుతున్న కథనాలను సోమవారం ఆయ న ఖండించారు. తప్పుదోవపట్టించేందుకే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

07/01/2019 - 23:03

సింగపూర్, జూలై 1: భారత ఆర్థిక రంగం తిరిగి బలమైన వృద్ధి రేటును సంతరించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను సకాలంలో అమలు చేయాలని, లేదంటే క్లిష్టతరమైన సవాళ్లు తప్పవని అంతర్జాతీయ అధ్యయన సంస్థ డీబీఎస్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా పెట్టుబడులు పెరిగేందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని సూచించారు.

Pages