S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/07/2019 - 04:12

న్యూఢిల్లీ, జూలై 6: భారత్ తిరిగి అధిక వృద్ధి రేటు పథంలోకి ప్రవేశించడానికి 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రోడ్‌మ్యాప్ వేసిందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మరుసటి రోజు జైట్లీ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన స్పందనలో ఈ విషయం పేర్కొన్నారు.

07/07/2019 - 04:02

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాన అంశాలపై కేంద్రీకరించి, గత సంప్రదాయానికి స్వస్తి పలికిందని, మోదీ రెండో దఫా ప్రభుత్వానికి స్పష్టమయిన దిశను నిర్దేశించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

07/07/2019 - 04:01

న్యూఢిల్లీ, జూలై 6: బ్యాంకుల్లో రూ. 50వేలకు మించి నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ఇకనుంచి పాన్ నంబర్‌ను మాత్రమే పేర్కొనవలసిన అవసరం లేదు. దాని స్థానంలో బయోమెట్రిక్ ఐడీ అయిన ఆధార్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఎక్కడెక్కడ అయితే తప్పనిసరో అక్కడ ఇకనుంచి ఆధార్ కూడా చెల్లుబాటు అవుతుంది.

07/05/2019 - 23:35

ముంబయి, జూలై 5: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల వాటాలను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్‌లోద్రవ్య లభ్యతకు ఇబ్బందులు తలెత్తవచ్చన్న ఆందోళనలతో శుక్రవారం కేంద్ర బడ్జెట్ అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ప్రధానంగా లోహ, విద్యుత్, వాహన, ఐటీ కౌంటర్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి.

07/05/2019 - 22:57

న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో మెగా తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురానుంది. ప్రధానంగా సౌర విద్యుత్ సెల్స్, బ్యాటరీలు, సౌర చార్జింగ్ వౌలిక వసతులు వంటివి స్థానికంగానే తయారు చేసేందుకు ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07/05/2019 - 22:55

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీ జోన్ అధికారిగా వాస శేషగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. పుణె కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీకి చీఫ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్ జీఎస్‌టీ గ్రూప్-బీ, సీ కేడర్‌లైన హైదరాబాద్, విశాఖపట్టణం కార్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

07/05/2019 - 22:53

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సబ్సిడీ రూపంలో చెల్లించే బిల్లులు 13.32 శాతం అంటే 3,01,694 కోట్ల రూపాయలు కానున్నాయి. ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి రంగాల్లో సబ్సిడీ కింద కేటాయించే బిల్లులు పెరుగనున్నాయి. ఆయా రంగాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో ఇంధన కింద 37,478 కోట్ల రూపాయలు ఉన్నాయి.

07/05/2019 - 22:53

న్యూఢిల్లీ, జూలై 5: ఆధార్, పాన్ కార్డుల విషయంలో దేశవ్యాప్తంగా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ జన బాహుళ్యానికి ఊరట కలిగించే ప్రతిపాదన చేశారు. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అయినా ఉపయోగించుకొనే వెసులుబాటును కల్పించారు. భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు దేశంలోకి వచ్చిన వెంటనే ఆధార్ కార్డులను సమకూరుస్తామని వెల్లడించారు.

07/05/2019 - 22:52

న్యూఢిల్లీ, జూలై 5: పన్నుల పరిధిని విస్తరించుకొనేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్‌లో మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక ఏడాది కాలంలో కాంట్రాక్టర్లకు లేదా వృత్తి నిపుణులకు చెల్లించే మొత్తం 50 లక్షల రూపాయలు దాటితే దానిపై ఐదు శాతం టీడీఎస్ వసూలు చేయాలని సంకల్పించారు. సదరు వ్యక్తులు తమ పాన్ నంబర్‌ను ఉటంకించడం ద్వారా ఈ టీడీఎస్ మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయవచ్చని తెలిపారు.

07/05/2019 - 22:52

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లోక్‌పాల్‌కు 100 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. సెంట్రల్ విజిలెన్స కమిషన్‌కు 35.55 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి.

Pages