S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/20/2019 - 22:55

ముంబయి, మే 20: ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్‌మార్కెట్‌లో నెలకొన్న ఆనందదాయక పరిణామాలతో మదుపర్ల ఐశ్వర్యం సోమవారం సుమారు 5.33 లక్షల కోట్లమేర పెరిగింది. సెనె్సక్స్ రికార్డు స్థాయిలో 1,422 పాయింట్ల ఆధిక్యతను తాకడంతో బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ ఒక్క సారిగా రూ. 5,33,463.04 కోట్లు పెరగడం విశేషం.

05/20/2019 - 17:47

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఎగ్జిట్‌పోల్స్ ఎన్డీఏకు పట్టం కట్టడంతో స్టాక్‌మార్కెట్లు దూసుకువెళ్లాయి. సెనె్సక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకి ఎగబాకింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సైతం అమాతం 70 పైసల వరకు పుంజుకుంది. ట్రేడింగ్ ఆరంభంలోనే 962 పాయింట్ల మేర ఎగసిన బీఎస్ఈ సెన్సెక్స్ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి.

05/20/2019 - 03:57

భీమవరం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఒకవైపు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లుచేస్తుండగా, మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం తమ వంతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గానికి ఈ సారి రాష్టస్థ్రాయి ప్రాధాన్యం ఏర్పడింది.

05/20/2019 - 03:50

న్యూఢిల్లీ: వచ్చే ఎనిమిదేళ్లలో తమ సంస్థ దేశం వెలుపల అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే మూడు ప్రధాన దేశాల్లో భారత్‌కూడా ఒకటని జపాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎల్‌ఐఎక్స్‌ఐఎల్’ ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. ప్రధానంగా వాటర్ టెక్నాలజీ వాణిజ్యాన్ని విస్తరించాలని తమ సంస్థ నిర్ణయించిందని, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్నాన గదుల వంటి ప్రత్యేక నిర్మాణాలు చేపడతామని సంబంధింత అధికారి ఒకరు తెలిపారు.

05/20/2019 - 03:47

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తన అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) విస్తరణ ప్రాజెక్టులో ఇరాన్ పెట్టుబడి పెడితే, అమెరికా విధించిన ఆంక్షల ప్రభావాన్ని మదింపు వేస్తానని ప్రకటించింది. ఐఓసీఎల్ చైర్మన్ సంజీవ్ సింగ్ ఈ విషయం వెల్లడించారు. సీపీసీఎల్‌లో నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్‌ఐఓసీ)కి ఇప్పటికే 15.4 శాతం వాటా ఉంది.

05/20/2019 - 03:33

న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌ఈసీపీ)లో సభ్యత్వం కలిగిన 11 దేశాలతో వాణిజ్యం విషయంలో భారత్ వెనుకబడిపోతోంది. 2018- 19 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2012 నవంబర్ నుంచి చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలతో కలుపుకుని మొత్తం 16 దేశాలు గ్రూపుగా ఏర్పడి మెగా వాణిజ్య ఒప్పందాలపై ఆర్‌సీఈపీ వేదికగా సంప్రదింపులు సాగిస్తున్నాయి.

05/20/2019 - 03:32

న్యూఢిల్లీ, మే 19: భారతీయ రీటైల్ స్థిరాస్తి రంగంలో గత రెండేళ్ల నుంచి ప్రైవేటు పెట్టుబడులు ద్విగుణీకృతమయ్యాయి. 2017-18 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1.2 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు ఈ రంగంలో వచ్చాయి.

05/20/2019 - 01:58

షాద్‌నగర్ రూరల్, మే 19: సాధారణంగా ఉత్పత్తి పెరిగితే.. వాటి ధరలు తగ్గుముఖం పడుతాయి. షాద్‌నగర్‌లో నియోజకవర్గంలో కోడిగుడ్ల ఉత్పత్తి పెరిగినా..వాటి ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కోడిగుడ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు సిండికేట్‌గా మారి ఉన్న రేటుకు రెండింతలు చేసి విక్రయిస్తున్నారు.

05/18/2019 - 03:11

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం దూకుడును ప్రదర్శించాయి. ఈ ర్యాలీలో బ్యాంకింగ్, వాహన స్టాక్స్ లాభాల పంట పండించాయి. ఓవైపు సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి, మరోవైపు అంతర్జాతీయంగా అననుకూలతలు ఉన్నా అవేవీ సూచీల పరుగుకు కళ్లెం వేయలేదు. బీఎస్‌ఈలో సెనె్సక్స్ ఏకంగా 537.29 పాయింట్లు ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం మళ్లీ 11,400 స్థాయికి చేరింది.

05/17/2019 - 23:04

లాండింగ్ సమయంలో పైలెట్ నియంత్రణ కోల్పోకుండా ‘ఫ్లైట్ కంట్రోల్’*
737 మాక్స్ విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటి సమస్యలను గుర్తించాం.. భద్రతకు పెద్దపీట వేశాం*
బోయింగ్ చైర్మన్ మొయిలెన్ బర్గ్

Pages