S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/16/2019 - 22:52

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనీల్ మణిభాయ్ నాయక్.

03/16/2019 - 22:49

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,130.00
8 గ్రాములు: రూ.25,040.00
10 గ్రాములు: రూ. 31,300.00
100 గ్రాములు: రూ.3,13,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,347.594
8 గ్రాములు: రూ. 26,780.752
10 గ్రాములు: రూ. 33,475.94
100 గ్రాములు: రూ. 3,34,759.4
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/16/2019 - 22:49

ముంబయి, మార్చి 16: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ తన విదేశీ భాగస్వామి ‘ఇతిహాద్’ నుంచి రూ.750 కోట్ల నిధుల అత్యవసర సాయాన్ని అర్ధించారు. సుదీర్ఘ ద్రవ్యలోటు కారణంగా సంస్థలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు.

03/16/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 16: పవర్ సొల్యూషన్స్ రంగంలో వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న పవరికా లిమిటెడ్‌కు ఇప్పుడు షేర్ల అమ్మకమే కీలకం కానుంది. మార్కెట్‌ను మరింతగా పెంచుకోవడంతోపాటు, ప్రస్తుతం తీవ్రంగా వేధిస్తున్న ద్రవ్య లబ్ధత సమస్య నుంచి బయటపడడానికి కూడా షేర్లను అమ్మకం అవసరమని పేర్కొంటూ, ఇందుకు అవసరమైన ప్రతిపానను సెబీకి పంపింది.

03/15/2019 - 22:40

హైదరాబాద్, మార్చి 15: ఖనిజాభివృద్ధి రంగం ఆదాయ వనరుగానే కాకుండాప్రజోపయోగ, పారిశ్రామిక ప్రగతి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే వనరుగా, పర్యావరణానికి సైతం భంగం కలిగించకుండా ఉండే సాధనంగా ఉపయోగపడుతోందని రాష్ట్ర స్ర్తి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ పేర్కొన్నారు.

03/15/2019 - 20:46

న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి ముగిసే నాటికే ఉత్పత్తి దాదాపుగా లక్ష్యాలను చేరుతున్నది. మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే, 2018లో 10,53,596 వాహనాలు ఉత్పత్తికాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య చాలా స్వల్ప తేడాతో వెనుకబడి ఉంది. 10,47,486 వాహనాలు ఉత్పత్తి అయ్యాయి.

03/15/2019 - 20:43

ముంబయి, మార్చి 15: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో శుక్రవారం నాటి లావాదేవీలు సజావుగా సాగడంతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. చివరికి 269.43 పాయింట్లు పెరిగి, 38,024.32 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 83.60 పాయింట్లు పెరిగి, 11,426.85 పాయింట్లుగా నమోదైంది. గత రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితి శుక్రవారం కూడా కొనసాగే ప్రమాదం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

03/15/2019 - 20:41

న్యూఢిల్లీ, మార్చి 15: బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం వెలవెలపోయింది. అటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, ఇటు నగల వ్యాపారులు అంతగా ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, 10 గ్రాముల బంగారం ఏకంగా 260 రూపాయలు పతనమై, 33,110 రూపాయలకు చేరింది. కిలో వెండి కూడా 130 రూపాయలు తగ్గి, 39,170 రూపాయల వద్ద ముగిసింది. మార్కెట్‌లో లావాదేవీలతోపాటు ధరల పతనం కూడా మొదలైంది.

03/15/2019 - 20:40

న్యూఢిల్లీ, మార్చి 15: అమెరికా, భారత్ దేశాల్లో మీడియా, కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఉన్న స్టార్టప్ (అంకుర కంపెనీలు) లలో పెట్టుబడులు పెడతామని అకత్సుకి ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ (ఏఈటీ) ఫండ్ ప్రకటించింది.

03/15/2019 - 20:36

అంకారా, మార్చి 15: టర్కీ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పతనమవుతూ, పెను ప్రమాదాన్ని సృష్టించనుంది. దేశాధ్యక్షుడు రెసెప్ టయిప్ ఎర్డోగన్ ఈ పతనాన్ని నివరించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అంతేగాక, దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అంశాలు ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉగ్రవాదం వేళ్లూనుకుంటూ, టర్కీని ఆర్థికంగా దిగజారుస్తున్నది.

Pages