S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/07/2018 - 01:13

న్యూఢిల్లీ, జూన్ 6: ఆస్కార్ మేనేజిమెంట్ సర్వీసెస్‌కు చెందిన ఏడుగురు ప్రమోటర్లు, డైరెక్టర్లపై నాలుగేళ్లపాటు స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించకుండా సెబి నిషేధం విధించింది. ఈ సంస్థ ఇనె్వస్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. ఆస్కార్ మేనేజిమెంట్ రూ.45లక్షల విలువైన 4.5 లక్షల వాటాలను 450 మందికి 2007-08లో కేటాయించింది.

06/07/2018 - 01:12

ముంబయి, జూన్ 6: ఆర్ధిక రంగంలో శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ ఏడాది 7.3 శాతం వృద్ధిరేటుతో, వచ్చే రెండేళ్లు 7.5 శాతం వృద్ధిరేటుతో భారత్ దూసుకుపోతుందని ఆ బ్యాంకు అధికారి తెలిపారు. నిలకడతో కూడిన అభివృద్ధిని భారత్ సాధిస్తోందని ఆయన తెలిపారు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టులో ఈ అంశాలను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

06/07/2018 - 01:28

ముంబయి, జూన్ 6: మూడు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి బలపడ్డాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గణనీయంగా 276 పాయింట్లు పుంజుకొని కీలకమయిన 35,000 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది.

06/06/2018 - 14:00

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.37 ప్రాంతంలో సెన్సెక్స్‌ 207 పాయింట్ల లాభంతో 35,113 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 10,660 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

06/06/2018 - 04:06

న్యూఢిల్లీ: రైతులకు శుభవార్త. కేంద్రం రూ. 1.4 లక్షల కోట్ల వ్యయంతో కిసాన్ ఊర్జ సురక్ష ఎవం ఉత్తాన్ మహాభియాన్ (కుసుం) స్కీంను త్వరలో అమలు చేయనుంది. ఈ స్కీం కింద రైతులకు సౌర విద్యుత్‌తో పనిచేసే నీటి పంపులను సమకూర్చుతారు. వచ్చే నెల నుంచి ఈ స్కీంను అమలు చేయనున్నట్లు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ చెప్పారు.

06/06/2018 - 00:39

ముంబయి, జూన్ 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 11.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రెసిల్ అనే సంస్థ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 11.2 శాతానికి చేరింది. దీని విలువ రూ.10.3 లక్షల కోట్లు. అంతకుముందు ఏడాది 2016-17లో బ్యాంకుల ఎన్‌పిఏ విలువ 9.5 శాతం నమోదైంది. దీని విలువ రూ. 8 లక్షల కోట్లు.

06/06/2018 - 00:38

ముంబయి, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించనుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు మంగళవారం ఆచితూచి వ్యవహరించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం మొదలయింది. బుధవారంతో ముగియనున్న ఈ సమావేశంలో 2014 జనవరి తరువాత తొలిసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి.

06/06/2018 - 00:23

న్యూఢిల్లీ, జూన్ 5: వాట్సప్‌ల ద్వారా స్టాక్ మార్కెట్ ధరల సమాచారాన్ని ముందుగా తమకు కావాల్సిన వారికి జారేసే ఇంటి దొంగల భరతం పట్టాలని స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబి నిర్ణయించింది. డజనుకుపైగా బ్లూచిప్ కంపెనీల్లో పనిచేసే ఆపరేటర్లు, సీనియర్ సిబ్బంది వాట్సప్ ద్వారా సున్నితమైన స్టాక్ ధరలను ముందుగా లీక్ చేస్తున్నారు.

06/06/2018 - 00:22

న్యూఢిల్లీ, జూన్ 5: భారత్ నుంచి రికార్డు స్థాయిలో వివిధ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ వస్తువుల వినిమయానికి అమెరికా గమ్యస్థానంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్ డాలర్ల వస్తువులు అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ దేశాలకు భారత్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

06/06/2018 - 00:20

న్యూఢిల్లీ, జూన్ 5: గత మూడు నెలల కాలంలో మొదటిసారిగా మే నెలలో భారత సేవారంగం కార్యకలాపాలు తగ్గిపోయాయి. కొత్త బిజినెస్ ఆర్డర్లు లేకపోవడం, చమురు ధరలు, నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడంతో సేవారంగం తీవ్ర ఒత్తిడికి లోనైంది. అయితే 2015, జనవరి నుంచి బిజినెస్ సెంటిమెంట్ బలీయంగా ఉన్న నేపథ్యంలో, రాబోయే కాలంలో పరిస్థితిలో మెరుగుదల తప్పక కనిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుండటం సానుకూల పరిణామం.

Pages