S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/28/2017 - 00:09

ముంబయి, అక్టోబర్ 27: మారుతీ సుజుకీ లాంటి బ్లూచిప్ కంపెనీల సానుకూల రెండో త్రైమాసిక ఫలితాలు, అలాగే నవంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ సిరీస్ ప్రారంభం కావడం వంటి అనేక సానుకూల అంశాలు శుక్రవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో సెనె్సక్స్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. హ్యాట్రిక్ విజయంతో ఈ వారం సెనె్సక్ లావాదేవీలు ముగిశాయి. తాజాగా 10.09 పాయింట్లే పెరిగినప్పటికీ ఇది కూడా సెనె్సక్స్‌కు కొత్త రికార్డే.

10/28/2017 - 00:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు రూ.2.11 లక్షల కోట్ల మేర ఉద్దీపనల పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ దిశగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆలోచన చేస్తోంది. బ్యాంకులకు మళ్లీ భారీగా మూల ధనాన్ని కల్పించే విషయమై అనేక అంశాలను పరిశీలిస్తోంది. వీటిలో ప్రధానంగా జీరో కూపన్ బాండ్లను జారీ చేయాలని ఆలోచన కూడా ఉంది.

10/28/2017 - 00:07

సదుం, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం జరిగే వారపుసంతలో కూర గాయలు అన్ని కిలో 70 రూపాయలు ధర పలుకగా వంకాయలు మాత్రం కిలో 100 రూపాయలు ధర పలికింది. ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో తాము కూడా చేసేదిలేక ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు.

10/28/2017 - 00:06

హైదరాబాద్, అక్టోబర్ 27: విలాసవంతమైన కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన బ్రిటిష్ సంస్థ బెంట్లీ మోటార్స్ శుక్రవారం హైదరాబాద్‌లో తమ షోరూమ్‌తో పాటు సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఇప్పటికే రెండు షోరూమ్‌లను నడుపుతున్న ఆ సంస్థకు మన దేశంలో ఇది మూడో షోరూమ్.

10/28/2017 - 00:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్దదైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 18 శాతం పెరిగింది.

10/28/2017 - 00:03

ముంబయి, అక్టోబర్ 27: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 30 శాతం క్షీణించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 2,979 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2,071.38 కోట్లకు పడిపోయిందని, మొండి బకాయిలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఐసిఐసిఐ బ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

10/28/2017 - 00:01

విశాఖపట్నం, అక్టోబర్ 27: పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గ్ధామమని, పెట్టుబడులతో వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

10/27/2017 - 00:56

ముంబయి/ న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా రికార్డును సృష్టించే పరుగును కొనసాగించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ రెండూ కూడా గురువారం తాజాగా జీవితకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిశాయి. సెనె్సక్స్ 104.63 పాయింట్లు పుంజుకొని 33,147.13 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 48.45 పాయింట్లు పెరిగి 10,343.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.

10/27/2017 - 00:55

హైదరాబాద్, అక్టోబర్ 26: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే పర్యాటకులను మలేషియా టూరిజం వైపునకు ఆకర్షించేందుకు వీలుగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్‌హద్, మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డు మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

10/27/2017 - 00:54

హైదరాబాద్, అక్టోబర్ 26: పొగాకు ఉత్పత్తులను విక్రయించే రిటైల్ దుకాణాలేవీ పొగాకేతర ఉత్పత్తులను విక్రయించరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై భారత పాన్ దుకాణాల యజమానుల సంఘం మండిపడింది. సూక్ష్మ రిటైల్ రంగంలో లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వుల వల్ల పెద్ద ఎత్తున జీవన ప్రమాణాలు పడిపోతాయని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Pages