S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/23/2017 - 01:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానం దృఢంగా పాదుకొని పోయినందున చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు పన్ను రేట్లను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు.

10/23/2017 - 01:01

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని ఆనందమయ సమాజం కోసం పనిచేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్‌బీయింగ్ శాఖ మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమితో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు.

10/23/2017 - 00:56

సిద్దిపేట, అక్టోబర్ 22: సిద్దిపేటలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం 200 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పారిశ్రామిక ఖిల్లాగా సిద్దిపేటను ఏర్పాటు చేయనుండడంతో వేలాది మందికి, ఉద్యోగ, ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.

10/23/2017 - 00:55

హైదరాబాద్, అక్టోబర్ 22: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పిడిసిటిఎల్)కు ఇన్నోవేషన్ కేటగిరిలో ‘ఐపిపిఎఐ పవర్ అవార్డు-2017’ లభించింది. సంస్థ పరిధిలో సౌర విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ విద్యుత్ రంగంలో యాజమాన్య పద్దతుల అమలు, ఎల్‌ఈడి లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌విడిఎస్ పద్దతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించిందని ఎస్‌పిడిసిటిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

10/23/2017 - 00:53

ముంబయి, అక్టోబర్ 22: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తన సరఫరాదారులతో ప్రస్తుతం కీలక ఒప్పందాలపై సంప్రదింపులు జరిపేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోని తన పెట్టుబడులను ప్రైవేటీకరించడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ తన వ్యయాన్ని తగ్గించుకునేందుకు తన సరఫరాదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలించాలని భావిస్తోంది.

10/23/2017 - 00:51

వరంగల్, అక్టోబర్ 22: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట-చింతల్‌పల్లి మధ్య నిర్మించే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 14 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. వీటితోపాటు టెక్స్‌టైల్ పార్కు బయట తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మరో ఎనిమిది సంస్థలు అంగీకరించాయి.

10/23/2017 - 00:38

కాకినాడ, అక్టోబర్ 22: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్)ను వ్యవసాయం, అనుబంధ రంగాలకు మరింత విస్తరింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సుమారు 60 శాతం పనులు ఉపాధి హామీ పథకం కింద జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇక నుండి విధిగా వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకం కింద పెద్దపీట వేయడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.

10/22/2017 - 00:57

ముంబయి, అక్టోబర్ 21: బ్యాంకు ఖాతాలతో బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ అనుసంధానం తప్పనిసరని రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) శనివారం స్పష్టం చేసింది.

10/22/2017 - 00:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ప్రజలు ఈ బాండ్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ఈ నెల 23నుంచి 25వరకు ఖరారు చేసింది. ఈ దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 30న కొనుగోళ్లను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

10/22/2017 - 00:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎరువులను సరైన మోతాదులో ఉపయోగించటం, ఆధునిక వ్యవసాయ సంకేతిక పద్ధతులు, నగదు రహిత లావాదేవీల గురించి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సహకార సంస్థ ఇఫ్కో చేపట్టిన కార్యక్రమాల మూలంగా వ్యవసాయదారుల ఆదాయం 2022 నాటికి రెండింతలు అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇఫ్కో స్వర్ణోత్సవాల సందర్భంగా పంపించిన సందేశంలో నరేంద్ర మోదీ ఈ విషయం చెప్పారు.

Pages