S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/24/2017 - 00:57

ముంబయి, అక్టోబర్ 23: మూడు రోజుల పాటు పడిపోయిన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఈ వారం తొలి రోజే పుంజుకుంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో పైకి, కిందికి కదలాడిన సెనె్సక్స్ చివరకు 116.76 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 32,506.72 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, ఇంధనం, చమురు- సహజ వాయువు, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు లాభపడటంతో సెనె్సక్స్ పైకి ఎగబాకింది.

10/24/2017 - 00:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం అట్టడుగు స్థాయికి చేరుకుందని, అయితే అది ఎంత వేగంగా కోలుకుంటుందనేది ప్రభుత్వం ఇప్పటి నుంచి తీసుకునే చర్యల మీద కీలకంగా ఆధారపడి ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక ఒకటి పేర్కొంది.

10/24/2017 - 00:55

హైదరాబాద్, అక్టోబర్ 23: పేదరిక నిర్మూలన, కొత్త ఆర్ధిక విధానాల రూపకల్పనలో బ్యాంకుల పాత్ర కీలకమైనదని ఎన్‌ఐఆర్‌డి డైరక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి అన్నారు. అట్టడుగు వర్గాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగుపర్చాలని అన్నారు.

10/24/2017 - 00:49

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎస్‌టిసిఎల్)కు ‘బెస్ట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ’ అవార్డు 2017 లభించింది. ఈ అవార్డును ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపిపిఎఐ) అందజేయనుంది.

10/24/2017 - 00:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశంలో 331 వౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 1.72 లక్షల కోట్లు పెరిగింది. ప్రాజెక్టుల అమలులో జాప్యం సహా వివిధ కారణాల వల్ల వీటి అంచనా వ్యయం భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ ఒక్కో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 150 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నవేనని కేంద్ర ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. రూ.

10/24/2017 - 00:48

కడియం, అక్టోబర్ 23: సరిగమలు పలికే సరికొత్త పూలకుండీలు అందుబాటులోకి వచ్చాయి. గాలి తరంగాల ద్వారా వత్తిడిని గ్రహించి అందుకు అనుగుణంగా ప్రతిస్పందించే పూలకుండీలను ముంబైకు చెందిన నర్సరీ రైతులు అభివృద్ధి చేశారు. సరికొత్త పూలకుండీని కడియపులంక సత్యదేవా నర్సరీకి దిగుమతి అయ్యాయి. సోమవారం సత్యదేవ నర్సరీ యాజమాన్యం ఈ పూలకుండీని ప్రదర్శించింది.

10/24/2017 - 00:47

విజయవాడ, అక్టోబర్ 23: ఇంధన నిల్వ వ్యవస్థ (ఎనర్జీ స్టోరేజి సిస్టం)లో పెట్టుబడులకు యుఏఈలోని ‘ముబదాల’ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బృందం విదేశీ పర్యటన సోమవారం ఆరవ రోజుకు చేరింది. యుఏఈలో ముఖ్యమంత్రి గౌరవార్థం ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అల్ నహ్యాన్ విందు ఇచ్చారు.

10/24/2017 - 00:46

అనకాపల్లి, అక్టోబర్ 23: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో బెల్లం తయారీ సీజన్ క్రమేపీ ఊపందుకుంటుంది. విజయదశమి, దీపావళి తదితర పండుగలు ముగియడంతో ఆదివారం నుండి బెల్లం తయారీ మరింతగా పెరిగింది. అనకాపల్లి పరిసర ప్రాంతాలతోపాటు వివిధ సుదూర ప్రాంతాలకు సైతం బెల్లం తయారీ క్రమేపీ పెరుగుతోంది. దీపావళి పండుగకు ముందు రోజుకు సగటున మూడువేల దిమ్మల బెల్లం వచ్చేది.

10/24/2017 - 00:44

పలాస, అక్టోబర్ 23: కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే పన్ను విధానం కోసం జిఎస్‌టి ప్రవేశపెట్టినా కొన్ని రాష్ట్రాల్లో జీడిపప్పుకు వే బిల్లు విధానం లేకపోవడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని జీడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీడిపప్పుకు ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా, పలాసలోని సుమారు 170కుపైబడి జీడిపరిశ్రమల మనుగడ జిఎస్‌టి ప్రభావంతో ప్రశ్నార్థకంగా మారింది.

10/23/2017 - 01:06

అహ్మదాబాద్, అక్టోబర్ 22: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, సరయిన దిశగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం స్వంత రాష్ట్రం గుజరాత్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని దహేజ్‌లో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. ‘కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. సరయిన దిశలోనే సాగుతోంది.

Pages