S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/14/2017 - 00:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: వొడాఫోన్-ఐడియా విలీనం ద్వారా దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ ఆవిర్భవించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ టెలికామ్ పరిశ్రమ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ విలీన ప్రతిపాదనకు ఐడియా సెల్యులార్ వాటాదారులు ఆమోదం తెలిపారు.

10/14/2017 - 00:50

విశాఖపట్నం, అక్టోబర్ 13: విశాఖ మెట్రోకు మరోసారి కదలిక వచ్చింది. కేంద్రం సవరించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో విశాఖ మెట్రో నిర్మాణానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ప్రభుత్వం బిడ్డర్లను ఆహ్వానించింది. రూ.8,800 కోట్లతో మెట్రో నిర్మాణానికి అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

10/14/2017 - 00:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో తమ ఏకీకృత నికర లాభం 12.5 శాతం వృద్ధిచెంది రూ.8,109 కోట్లకు చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో తమ నికర లాభం రూ.7,209 కోట్లుగా ఉందని ఆ సంస్థ తెలిపింది.

10/14/2017 - 00:48

భోపాల్, అక్టోబర్ 13: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కెయువి-100కు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించి కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. కెయువి-100 ఎన్‌ఎక్స్‌టి పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను 40 కొత్త ఫీచర్లతో తీర్చిదిద్దినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

10/13/2017 - 03:43

వాషింగ్టన్, అక్టోబర్ 12: నిరర్ధక ఆస్తుల విషయమై ‘సందిగ్ధ పరిస్థితి’ని ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్ను దన్నుగా నిలిచేలా బ్యాంకింగ్ రంగానికి మళ్లీ జవసత్వాన్ని కల్పించే ప్రణాళికను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.

10/13/2017 - 00:40

ముంబయి, అక్టోబర్ 12: గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ ఏకంగా 348 పాయింట్లు పుంజుకుంది. గురువారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన మార్కెట్ అంతిమంగా 32,182 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్ ఆచితూచి ముందుకు సాగింది. అలాగే భారత రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 6 పైసలు పెరిగి 65.08కి చేరుకుంది.

10/13/2017 - 00:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అంబీ వ్యాలీ వద్ద శాంతి, భద్రతల సమస్యను ప్రస్తావిస్తూ పుణె పోలీసులకు సహారా గ్రూపు లేఖ రాయడంపై సుప్రీం కోర్టు గురువారం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సహారా గ్రూపునకు చెందిన అంబీ వ్యాలీని వేలం వేసేందుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రక్రియ సాగుతున్న విషయం తెలిసిందే.

10/13/2017 - 00:36

ముంబయి, అక్టోబర్ 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నికర లాభం 2.1 శాతం తగ్గి రూ.6.446 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,586 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ బిఎస్‌ఇకి తెలిపింది.

10/13/2017 - 00:36

హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ ఆర్గానిక్ పర్సనల్ కేర్ ఉత్పాదనల తయారీ కంపెనీ ఆజాఫ్రాన్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రముఖ రిటైల్ చైన్ మార్కెట్ కంపెనీ మోర్ మెగా స్టోర్‌తో ఒప్పందం చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోర్ మెగా స్టోర్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా రిటైల్ మార్కెట్‌ను మరింత విస్తత్రం చేస్తున్నట్లు తెలిపింది.

10/13/2017 - 00:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలో అతిపెద్ద టెలికామ్ సేవల సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇక మరింత పెద్దదిగా మారనుంది. మూసివేత దిశగా సాగుతున్న టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎస్‌ఎల్)ను త్వరలో ఎయిర్‌టెల్ కొనుగోలు చేయనుండటమే ఇందుకు కారణం. ఇదే గనుక జరిగితే దేశ టెలికామ్ రంగంలో మరో భారీ విలీనం జరిగినట్లే. ఈ విషయాన్ని అటు ఎయిర్‌టెల్, ఇటు టిటిఎస్‌ఎల్ గురువారం సంయుక్తంగా వెల్లడించాయి.

Pages