S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/15/2017 - 02:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) చట్టం ఈ నెల 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఉత్పత్తిదారులు తప్పనిసరిగా పాటించాల్సిన ఈ నాణ్యతా ప్రమాణాల చట్టం పరిధిలోకి మరిన్ని సేవలతో పాటు ఆభరణాల్లాంటి కొన్ని ఉత్పత్తులను అదనంగా చేర్చారు.

10/15/2017 - 02:44

సంగారెడ్డి, అక్టోబర్ 14: తెలంగాణలో పత్తి పంటను కొనుగోలు చేయడంపై గుజరాత్ వ్యాపారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిసిఐ నిర్ణయించిన ధరకే కొనుగోళ్లు జరిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పత్తి నాణ్యతను బట్టి సిసిఐ నిర్ణయించిన ధరను పరిగణలోకి తీసుకోకుండా మొదటి ధరకే మొత్తం పత్తిని కొనుగోలు చేసి తరలించుకుపోవాలని ఆ ప్రాంత వ్యాపారులు పత్తి రైతులతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

10/15/2017 - 02:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డీ-మార్ట్ సూపర్ మార్కెట్లను నడుపుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది.

10/15/2017 - 02:42

ముంబయి, అక్టోబర్ 14: దేశంలోని అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రెండవదిగా ఉన్న బిఎఫ్‌ఐఎల్ (్భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్)ను త్వరలో తాము కొనుగోలు చేయబోతున్నామని ప్రైవేటు రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంకు శనివారం వెల్లడించింది. ఇండస్‌ఇండ్ బ్యాంకు తన పరిమాణాన్ని పెంచుకుని, మరింత మంది ఖాతాదారులకు చేరువయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

10/15/2017 - 02:41

సంగారెడ్డి, అక్టోబర్ 14: గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ విమానాలు మరో దశాబ్ద కాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌సోనిక్ వాహనాలు, ఎదురయ్యే సవాళ్లు అనే అంశంపై సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది గ్రామ శివారులోని హైదరాబాద్ ఐఐటి కేంద్రంలో శనివారం నిర్వహించిన సదస్సులో వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

10/15/2017 - 02:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: త్వరలో తమ ప్రమోటర్లకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ప్రిఫరెన్స్ షేర్లను లేదా బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.20 వేల కోట్ల మేరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నట్లు టాటా గ్రూపునకు చెందిన లిస్టెడ్ టెలికామ్ సంస్థ టిటిఎంఎల్ (టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్) శనివారం వెల్లడించింది.

10/15/2017 - 02:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రసాయనాలు, పెట్రోలియం, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరగడంతో గత నెలలో దేశ ఎగుమతులు 25.67 శాతం వృద్ధితో 28.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

10/15/2017 - 02:38

హైదరాబాద్, అక్టోబర్ 14: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అబుదాబిలో ప్రారంభమైన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్‌లో భారత దేశం తరఫున పాల్గొంటున్న హైదరాబాద్ యువతి మెహర్ రిషికాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు.

10/14/2017 - 00:52

భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త ఊతంతో మరింత బలాన్ని పుంజుకున్నాయి. మదుపుదారులు భారీగా కొనుగోళ్లు జరపడంతో ఇటు నిఫ్టీ, అటు సెనె్సక్స్ శుక్రవారం జరిగిన లావాదేవీల్లో భారీగా లాభపడ్డాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా మరింత పెరిగింది. గత రెండు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా సెనె్సక్స్ ఏకంగా 250.47 పాయింట్లు పుంజుకుని 0.78 శాతం ఆధిక్యతతో 32,432.69 పాయింట్లకు చేరుకుంది.

10/14/2017 - 00:50

హైదరాబాద్, అక్టోబర్ 13: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్‌గా డాక్టర్ చంద్రశేఖర్ రాజనాల, వైస్‌చైర్మన్‌గా మునిశేఖర్ దారపనేని, కార్యదర్శిగా కళ్యాణి పెమ్మరాజు, కోశాధికారిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికైనట్లు ఐసిఎఐ ప్రకటనలో తెలిపింది. కెవిఎన్ లావణ్య, ఎం వెంకటేశ్వర్లు, వి సుధారాణి మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Pages