S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/18/2017 - 22:42

నల్లమాడ, అక్టోబర్ 18: మల్బరీ సాగుపై అనంతపురం జిల్లా రైతన్నలు మరింత పట్టు సాధిస్తున్నారు. రాష్ట్రంలోనే మల్బరీ సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉంది. పదేళ్ళకు ముందు జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మల్బరీ సాగు జరిగేది. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలో పండ్లతోటలు ఎండిపోయాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోయాయనుకున్న సమయంలో 35 వేల ఎకరాల్లో మల్బరీ సాగు జరగడం గమనార్హం.

10/18/2017 - 00:33

రావులపాలెం, అక్టోబర్ 19: రెండేళ్ల క్రితం ఉభయ గోదావరి జిల్లాల రైతులకు తీవ్ర నష్టాలు చవిచూపించిన అరటి ప్రస్తుతం లాభాలు కురిపిస్తోంది.

10/18/2017 - 00:32

దేశీయ ఇనె్వస్టర్ల కొనుగోళ్ల దన్ను ఒకపక్క, కార్పొరేట్ ఫలితాల ఊతం మరొకపక్క నిఫ్టీకి మంగళవారం కూడా మరింత వనె్ననిచ్చాయి. సోమవారం నాటి రికార్డును అధిగమిస్తూ మంగళవారం 3.60 పాయింట్లు పెరిగి 10,234.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి లావాదేవీలతో పోలిస్తే సెనె్సక్స్ 0.04 శాతం పుంజుకున్నట్లయింది. గత రెండు రోజులుగా ఉత్సాహంతో పరుగులెత్తిన సెనె్సక్స్ వేగం మంగళవారం తగ్గింది.

10/18/2017 - 00:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రైవేట్ సెక్టార్‌లోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. రానిబాకీలు పెరిగినప్పటికీ తమ నికర లాభం 432 కోట్ల రూపాయలకు పెరిగిందని స్పష్టం చేసింది. అంటే నికర లాభాల్లో 38 శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది.

10/18/2017 - 00:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో విప్లవాత్మక రీతిలో అమలులోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) ప్రారంభ కష్టాలు తీరిపోయాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి.గార్గ్ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. తయారీ రంగంలో ఆగస్టు నెలకు సంబంధించి 3.1 శాతం వృద్ధిరేటును సాధించడమే జిఎస్‌టి అమలు ఇబ్బందులనుంచి పూర్తిగా బయటపడ్డామని చెప్పడానికి నిదర్శనమని అన్నారు.

10/18/2017 - 00:30

విజయవాడ, అక్టోబర్ 17: జపాన్, సింగపూర్, లండన్‌లో జరిగే ఫిన్‌టెక్ రోడ్డు షోల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొననున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఐటి శాఖ అధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ షోల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

10/17/2017 - 00:21

ముంబయి, అక్టోబర్ 16: కొత్త వారంలో అనుకున్నట్లుగానే భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, ఐఎంఎఫ్ ప్రోత్సహక వ్యాఖ్యల కారణంగా ఇనె్వస్టర్లలో కొత్త ఉత్తేజం పెరగడం వలన సోమవారం జరిగిన లావాదేవీల్లో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయ. సెనె్సక్స్ ఏకంగా 200.95 పాయింట్లు పెరిగి గతంలో ఎన్నడూ లేని రీతిలో 32,633.64 పాయింట్ల వద్ద ముగిసింది.

10/17/2017 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలో గత నెల టోకు ద్రవ్యోల్బణం 2.60 శాతానికి దిగివచ్చింది. ఆహార వస్తువులు, కూరగాయల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా లెక్కించే ఈ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టు నెలలో 3.24 శాతానికి చేరుకుని నాలుగు నెలల గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది 1.36 శాతంగా ఉంది.

10/17/2017 - 00:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. అయితే ఉత్పాతకతను, పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఈ అదనపు నిధులను ఉపయోగించాలని ఆయన అన్నారు.

10/17/2017 - 00:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల న్యూఢిల్లీలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే దేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల నుంచి హామీలు వచ్చాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం వెల్లడించారు.

Pages