S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/18/2017 - 00:17

విలాసవంతమైన కార్ల తయారీలో పేరెన్నిక గన్న జర్మనీ ఆటోమొబైల్ సంస్థ ఆడీ గురువారం భారత మార్కెట్లో తమ ఏ-6 సెడాన్ (ఎడమ), క్యూ-7 ఎస్‌యువి (కుడి) డిజైన్ ఎడిషన్లను ఆవిష్కరించింది. వీటిలో
ఏ-6 ధర రూ.56.78 లక్షలు కాగా, క్యూ-7 ధరను రూ.81.99 లక్షలుగా నిర్ణయంచారు.

08/18/2017 - 00:15

విశాఖపట్నం, ఆగస్టు 17: ప్రయాణికులకు అందుబాటులో ఉండటంతోపాటు, సాధారణ చార్జీలతోనే గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా విశాఖ రైల్వేస్టేషన్‌లో యాప్ బేస్డ్ క్యాబ్స్ విధానం అమల్లోకి రానుంది. దేశంలో బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అమలవుతున్న దీనిని విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రవేశపెట్టాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.

08/18/2017 - 00:14

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ)కు రావడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా మార్కెట్లోకి రావడానికి వీలుగా న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీకి దీనికి సంబంధించిన ప్రాథమిక పత్రాలను త్వరలోనే సమర్పించనుంది. ప్రభుత్వ రంగంలోని నాలుగు జనరల్ బీమా సంస్థల్లో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ ఒకటనే విషయం తెలిసిందే.

08/18/2017 - 00:14

న్యూఢిల్లీ, ఆగస్టు 17: పొదుపు ఖాతాల్లో నగదు నిల్వలపై వడ్డీ రేట్లను ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి గురువారం తగ్గించింది. రూ. 50 లక్షల లోపు నగదు నిల్వలపై వడ్డీ రేటును 0.5 శాతం తగ్గిస్తూ 3.5 శాతానికి పరిమితం చేసింది. అయితే 50 లక్షల రూపాయలకు పైబడిన నిల్వలపై 4 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తామని బ్యాంక్ ప్రకటించింది. సవరణ తర్వాత రూ.

08/18/2017 - 02:14

ముంబయి, ఆగస్టు 17: తన గృహ రుణాల వ్యాపారాన్ని పెంచుకునే లక్ష్యంతో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గురువారం ఒక కొత్త గృహ రుణ పథకాన్ని ప్రకటించింది. రుణం చెల్లింపు సమయంలో కొన్ని నెలవారీ కంతు(ఇఎంఐ)లను మాఫీ చేయడం ఈ పథకం ప్రత్యేకత. 20 ఏళ్ల కాలపరిమితి కలిగిన రుణంలో నాలుగు, ఎనిమిది, 12 సంవత్సరాలప్పుడు నాలుగు నెలవారీ కంతులను బ్యాంక్ మాఫీ చేస్తుంది. అంటే మొత్తం 12 ఇఎంఎంలు మాఫీ అవుతాయి.

08/18/2017 - 00:12

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (జిఇఎస్)కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

08/17/2017 - 00:42

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడానికిగాను ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటవనుంది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతోపాటు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పరిపాలన శాఖ మంత్రి ఉంటారు.

08/17/2017 - 00:41

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను అందుకున్నాయి. అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న యుద్ధ భయాలు నెమ్మదిగా తొలగిపోతుండటంతో మదుపరులు మళ్లీ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 321.86 పాయింట్లు ఎగిసి 31,770.89 వద్ద స్థిరపడింది. ఈ నెలలో కేవలం ఒక్కరోజులోనే సెనె్సక్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.

08/17/2017 - 00:41

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో ఏర్పాటుచేసే మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని మంత్రి కెటిఆర్.. దక్షిణ కొరియా టెక్స్‌టైల్స్ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించారు. బుధవారం ఇక్కడ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో దక్షిణ కొరియా టెక్స్‌టైల్స్ కంపెనీల ప్రతినిధుల బృందంతో సమావేశమైన కెటిఆర్.. కాకతీయ పార్కు స్వరూపం, సౌకర్యాలను కొరియన్ కంపెనీ బృందానికి వివరించారు.

08/17/2017 - 00:40

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ప్రవేశపెట్టిన ‘షీ షటిల్’ సర్వీసులకు మంచి స్పందన లభిస్తోంది. మహిళా టెకీల భద్రతకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక సదుపాయాన్ని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని దాదాపు 32 వేల మంది మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ సర్వీసులు వ్యాపార దృక్పథంతో నడవడం లేదని ఎస్సీఎస్సీ సెక్రటరీ భరణి కుమార్ తెలిపారు.

Pages