S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/17/2017 - 00:40

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోని డొల్ల సంస్థల (షెల్ కంపెనీలు)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం వ్యవహారంలో సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్).. గురువారం మరో రెండు సంస్థల పిటిషన్లపై విచారణ జరపనుంది. హిట్ కిట్ గ్లోబల్ సొల్యూషన్స్, శాన్కో ఇండస్ట్రీస్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను శాట్ పరిశీలించనుంది.

08/16/2017 - 00:17

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారీ సంస్థల కంటే చిన్న, మధ్య శ్రేణి సంస్థల్లో పెట్టుబడులే మదుపరులకు అధిక లాభాలను అందిస్తున్నాయి. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అన్న సూత్రం స్టాక్ మార్కెట్లలోని స్మాల్, మీడియం సూచీలకు చక్కగా సరిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇదే జరిగింది మరి.

08/16/2017 - 00:16

న్యూఢిల్లీ, ఆగస్టు 15: అవినీతి, నల్లధనం నిరోధానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు కొనియాడాయి. విధానపరమైన సంస్కరణలను బలోపేతం చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టికి నిర్ణయాలు తీసుకోవాలని సూచించాయి. సిఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

08/16/2017 - 00:15

న్యూఢిల్లీ, ఆగస్టు 15: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం (బిపి)పై కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,700 కోట్ల రూపాయల (264 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.

08/16/2017 - 00:15

క్షీణించిన క్యాడిలా హెల్త్‌కేర్ లాభం

08/16/2017 - 00:14

న్యూఢిల్లీ, ఆగస్టు 15: పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో అయన డిపాజిట్లలో 1.75 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను పరిశీలిస్తున్నామని, ఆదాయానికి మించి లావాదేవీలు జరిపిన 18 లక్షల మంది అకౌంట్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అయతే వీరిలో 4 లక్షల 50 వేల మంది తమ తప్పును ఒప్పుకుని సరిదిద్దుకుంటున్నారన్నారు.

08/16/2017 - 00:12

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ నిర్మాణ రంగంలోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో 16,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ ఇండియా వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య అటు రుణ, ఇటు ఈక్విటీ మార్కెట్లలోకి మొత్తం 16,008 కోట్ల రూపాయల పెట్టుబడులను రియల్ ఎస్టేట్ రంగం ఆకర్షించింది. ఇందులో 56 శాతం పెట్టుబడులు హౌసింగ్, టౌన్‌షిప్ ప్రాజెక్టుల్లోకే వచ్చాయి.

08/16/2017 - 00:10

హైదరాబాద్, ఆగస్టు 15: త్వరలోనే రామగుండంలో తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు మొదటి దశ పనులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విబి ఫడ్నవీస్ తెలిపారు.

08/16/2017 - 00:07

హైదరాబాద్, ఆగస్టు 15: దీన్ దయాళ్ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన కింద 336 కోట్ల రూపాయల వ్యయంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి 125 రూపాయలకే సర్వీసు వైర్, ఎల్‌ఇడి బల్బులతో విద్యుత్ సర్వీసు మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలంగాణ సదరన్ పవర్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు.

08/15/2017 - 00:42

ప్రముఖ విదేశీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. సోమవారం దేశీయ మార్కెట్‌కు జిఎల్‌సి శ్రేణిలో సెలబ్రేషన్ ఎడిషన్ కారును పరిచయం చేసింది. ముంబయలో విడుదలైన దీని ధర 50.86 లక్షల రూపాయల నుంచి 51.25 లక్షల రూపాయల మధ్య ఉంది. 2016లో జిఎల్‌సి మోడల్ భారతీయ మార్కెట్‌కు వచ్చింది

Pages