S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/20/2017 - 03:52

నెల్లూరు, ఏప్రిల్ 19: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గృహనిర్మాణ రంగంపై ఈ సిమెంటు ధరల ఆకస్మిక పెరుగుదల తీవ్ర ప్రభావానే్న చూపిస్తోంది. నెల రోజుల వ్యవధిలో 60 శాతానికిపైగా బస్తా సిమెంటు ధర పెరిగిపోవడం వెనుక సిమెంటు కంపెనీల కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు మిన్నంటాయి.

04/20/2017 - 03:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన ఇన్‌లాగ్‌ను హస్తగతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఇన్‌లాగ్ సొంతమవడంతో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సంస్థ అయిన మింత్రా.. వ్యాపారపరంగా మరింత బలోపేతం కానుందని, ఈ-కామర్స్ మార్కెట్‌లో దూకుడు పెంచగలదన్న అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

04/20/2017 - 03:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (జెఐఎస్‌ఎల్).. అమెరికాలోని రెండు సంస్థల్లో 80 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. మైక్రో-ఇరిగేషన్ డీలర్లైన అగ్రీ-వ్యాలీ ఇరిగేషన్ (ఎవిఐ), ఇరిగేషన్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఐడిసి) సంస్థల్లో 48 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ వాటాను అందుకుంటున్నట్లు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జెఐఎస్‌ఎల్ తెలిపింది.

04/20/2017 - 03:47

ముంబయి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: మధ్యశ్రేణి ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్.. నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో గతంతో పోల్చితే 30 శాతం పెరిగింది. 914.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఇదే సమయంలో మొండి బకాయిలు కూడా రెండింతలు పెరగడం గమనార్హం. ఓ సిమెంట్ సంస్థకు చెందినదే ఇందులో 227.9 కోట్ల రూపాయలుగా ఉంది.

04/20/2017 - 03:46

ముంబయి, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 17.47 పాయింట్లు పెరిగి 29,336.57 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 1.65 పాయింట్లు పడిపోయి 9,103.50 వద్ద నిలిచింది.
టిసిఎస్ షేర్లు పతనం

04/19/2017 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రైల్ ఇంజినీరింగ్ సంస్థలైన ఆర్‌ఐటిఇఎస్, ఆర్‌విఎన్‌ఎల్‌ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) నిర్వహణకు మర్చెంట్ బ్యాంకర్ల కోసం అనే్వషిస్తోంది. మొత్తం ఐదు ప్రభుత్వరంగ రైల్వే సంస్థలుండగా, అందులో ఈ రెండున్నాయి.

04/19/2017 - 02:36

విశాఖపట్నం, ఏప్రిల్ 18: అనేక సంవత్సరాలుగా ఆర్డర్లు లేక, నష్టాల్లో కూరుకుపోయి సతమతమవుతున్న విశాఖలోని ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్)కు మంచి రోజులు వచ్చాయి. కొత్త ఆర్డర్లు రావడంతోపాటు, షిప్‌యార్డు రూపు రేఖలే మారిపోనున్నట్టు షిప్‌యార్డు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్‌వి శరత్ బాబు తెలియచేశారు.

04/19/2017 - 02:36

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 6,608 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 6,340 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈసారి 4.2 శాతం వృద్ధిని అందుకుంది.

04/19/2017 - 02:37

దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిన వరుస నష్టాలు ౄ సెనె్సక్స్ 95, నిఫ్టీ 34 పాయింట్లు పతనం
మదుపరుల కొనుగోలు శక్తిని దెబ్బతీసిన అంతర్జాతీయ ప్రతికూలతలు

04/19/2017 - 02:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పేద, మధ్యతరగతివారిని దోచుకున్న వాళ్లు అదంతా తిరిగి ఇచ్చేయాల్సిందే’నని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా విజయ్ మాల్యానుద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారన్న వార్త తెలిసిన కొద్ది గంటలకే మోదీ ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘నిజమే.

Pages