S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/22/2017 - 01:33

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.09 పాయింట్లు కోల్పోయి 29,365.30 వద్ద నిలవగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు దిగజారి 9,119.40 వద్ద స్థిరపడింది.

04/22/2017 - 01:32

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 18.3 శాతం అధికం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా బ్యాంక్ నికర లాభం 15,253 కోట్ల రూపాయలుగా ఉంది.

04/21/2017 - 00:56

ముంబయి, ఏప్రిల్ 20: బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి అవకాశముందని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీకి తెలియజేశారు. అయితే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు.

04/21/2017 - 00:55

ముంబయి, ఏప్రిల్ 20: త్రైమాసిక ఫలితాలు వెలువడుతుండడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు రోజులుగా నష్టాల్లో కొనసాగుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు కూడా మదుపరుల కొనుగోళ్లకు ఊతమివ్వడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 86 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 332 పాయింట్లు లాభపడింది.

04/21/2017 - 00:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్ (నాల్కో)లో 9.2 శాతం వాటాను విక్రయించడం ద్వారా 1200 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమకూర్చుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లతో పాటుగా సంస్థాగత మదుపరులకు ఈ వాటాలను ప్రభుత్వం విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన తొలి పిఎస్‌యు పెట్టుబడుల ఉపసంహరణ ఇదే కావడం గమనార్హం.

04/21/2017 - 00:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో మూడవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన విప్రో తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయింది. తమ ఉద్యోగుల ‘ప్రతిభా మదింపు’ తర్వాత వందలాది మందికి ఉద్వాసన పలకడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నప్పటికీ ఈ సంఖ్య 2 వేల వరకూ పెరగవచ్చని తెలుస్తోంది.

04/21/2017 - 00:50

విశాఖపట్నం, ఏప్రిల్ 20: భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా దేశంలో రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ స్పష్టం చేశారు. విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న 21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్ (ఆర్‌టిఎం)ను బుధవారం ఆయన ప్రారంభించారు.

04/21/2017 - 00:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత (2016-17) ఆర్థిక సంవత్సరానికి గాను ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు. ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ట్రస్టు బోర్డు సభ్యులు గత ఏడాది డిసెంబర్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

04/21/2017 - 00:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేయాలని కొంత మంది యజమానులు, ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని పెట్రోల్ పంపుల యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని చమురు మంత్రిత్వ శాఖ తీవ్రంగా గర్హించింది. ఈ నిర్ణయం వలన సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని స్పష్టం చేసింది.

04/21/2017 - 00:45

హైదరాబాద్, ఏప్రిల్ 20: పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు సోలార్ విద్యుత్ రంగానికి ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సోలార్ విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, టి-ఐడియా పథకం కిందకు ఈ రంగాన్ని తీసుకు వచ్చి టి-ఐడియా కింద పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు సోలార్ విద్యుత్ రంగానికి ఇవ్వాలని నిర్ణయించారు.

Pages