S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/02/2017 - 00:24

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు, ఇప్పటికే పనిచేస్తున్న పరిశ్రమలను అభివృద్ధి వైపు నడిపించడమే తమ ధ్యేయమని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ) అధ్యక్షుడు రవీంద్ర మోదీ తెలిపారు. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

01/02/2017 - 01:02

న్యూఢిల్లీ, జనవరి 1: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జన్-్ధన్ ఖాతాల్లో భారీగా నగదు డిపాజిట్లు జరిగినది తెలిసిందే. అయితే గత పదిహేను రోజుల్లో ఈ ఖాతాల్లో నుంచి 3,285 కోట్ల రూపాయల నగదు ఉపసంహరణలు జరగడం గమనార్హం.

01/02/2017 - 00:20

విజయనగరం, జనవరి 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఈ ఏడాది ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. ఆదివారం ఇక్కడి అశోక్ బంగ్లాలో తనను కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి దాదాపు భూసేకరణ పూర్తయ్యిందని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం ఆనందదాయకమని, ఇంకా భూసేకరణకు 300 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పారు.

01/02/2017 - 00:21

న్యూఢిల్లీ, జనవరి 1: దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ నిరాటం కంగా కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసు కున్నారు. అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు.

01/01/2017 - 01:04

చెన్నై, డిసెంబర్ 31: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ మొబైల్ వినియోగదారులకు కొత్త సంవత్సరం ఆఫర్‌ను ప్రకటించింది. అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థలతో పోటీపడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త ఆఫర్లను పరిచయం చేస్తుండగా, ఇందులో భాగంగానే 144 రూపాయలకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

01/01/2017 - 00:59

ముంబయి, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో 2016 సంవత్సరానికి వీడ్కోలు పలికాయి. అంతకుముందు రెండు వారాల్లో నష్టాలను చవిచూసిన సూచీలు.. గడచిన వారం మాత్రం లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 585.76 పాయింట్లు ఎగిసి 26,626.46 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 200.05 పాయింట్లు ఎగబాకి 8,185.80 వద్ద నిలిచింది.

01/01/2017 - 00:55

న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 31:అవును.. అచ్చం ఇలాగే ఉందిప్పుడు కొత్త 2,000 రూపాయల నోట్లున్నవారి సంగతి. పెద్ద నోటు కావడంతో ఎక్కువగా జేబులో పెట్టుకోలేని పరిస్థితి ఓవైపైతే, జేబులో ఉన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి మరోవైపు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని మెజారిటీ ప్రజల స్థితి ఇప్పుడిదే మరి.

01/01/2017 - 00:54

అమరావతి, డిసెంబర్ 31: ఏపిలో స్పిన్నింగ్ మిల్లుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్‌లతోపాటు వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ రంగాల అభివృద్ధికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు.

01/01/2017 - 00:53

కాకినాడ, డిసెంబర్ 31: తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ప్రజల భద్రతకు తిలోదకాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ యంత్రాంగం.. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

01/01/2017 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బంగారం, వెండి ధరలు శనివారం క్షీణించాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు.. ఈ ఏడాది చివరి రోజైన శనివారం మాత్రం తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే 200 రూపాయలు పడిపోయి 28,300 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా 28,150 రూపాయల వద్ద నిలిచింది.

Pages