S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/30/2016 - 00:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి తమ సంస్థకు సంబంధించిన గోప్యతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టాటా సన్స్ ఆరోపించింది. తమ సంస్థ నుంచి పదవీచ్యుతుడైన సైరస్ మిస్ర్తి తక్షణమే అన్ని రహస్య పత్రాలను తిరిగి తమకు అప్పగించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయబోనని పేర్కొంటూ 48 గంటల్లోగా ఒప్పందంపై సంతకం చేయాలని టాటా సన్స్ డిమాండ్ చేసింది.

12/30/2016 - 00:44

అమలాపురం, డిసెంబర్ 29: దేశంలోనే తొలి డిజిటల్ గ్రామాలుగా రూపుదిద్దుకున్న తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు గ్రామాలకు గురువారం తరలివచ్చిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

12/30/2016 - 00:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే తమకు కొన్ని రాయితీలు ఇవ్వాలని అమెరికా ఐటి దిగ్గజ సంస్థ ఆపిల్ చేసిన డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖలతో పాటు మరికొన్ని ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల గ్రూపు వచ్చే నెల ఆరంభంలో చర్చించనుంది.

12/29/2016 - 08:01

దుబాయ్, డిసెంబర్ 28: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దుబాయ్ గోల్డ్ మార్కెట్‌కు తగిలింది. దుబాయ్‌లో బంగారానికి ప్రధాన మార్కెటైన ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ సౌక్‌లో ఇప్పుడు భారతీయ కస్టమర్లే కనిపించడం లేదుమరి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే.

12/29/2016 - 07:59

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ఉడిపి రుచి వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో శ్రీ ఫ్యామిలీ గ్రూప్.. తమ ఉడిపి రుచి ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది. దాదాపు 100 రకాల ఆహారోత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. హెల్‌త్రడింక్స్‌ను కూడా అందిస్తున్నట్లు వివరించారు.

12/29/2016 - 07:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మొబైల్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన కాల్‌డ్రాప్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ సమీకృత కంఠ స్పందన వ్యవస్థ (ఐవిఆర్‌ఎస్)ను ప్రారంభించింది. కాల్స్ నాణ్యతపై వినియోగదారుల నుంచి ఈ వ్యవస్థకు నేరుగా స్పందనలు అందుతాయి. ఢిల్లీ, ముంబయి, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవాల్లో ఈ వ్యవస్థను ఈ నెల 23న కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

12/29/2016 - 07:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా విరల్ వి ఆచార్య నియమితులయ్యారు. 42 ఏళ్ల ఈ న్యూయార్క్ యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్.. మూడేళ్లపాటు ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేయనున్నారు. ఈయనను బుధవారం కేంద్ర ప్రభుత్వం నియమించగా, కేంద్ర మంత్రివర్గంలోని నియామకాల కమిటీ ఆమోదించింది.

12/29/2016 - 07:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ).. స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బుధవారం సమర్పించింది. 10,000 కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది ఎన్‌ఎస్‌ఇ.

12/29/2016 - 07:57

సల్బోని (పశ్చిమ బెంగాల్), డిసెంబర్ 28: పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనిలో గల నోట్ల ముద్రణాలయంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు తాము గురువారం నుంచి రోజుకు తొమ్మిది గంటలకన్నా మించి పనిచేయబోమని అధికారులకు తేల్చిచెప్పారు. ఇదే గనుక జరిగితే ఈ ముద్రణాలయంలో ముద్రించే నోట్ల సంఖ్య తగ్గుతుంది.

12/28/2016 - 00:33

ముంబయి, డిసెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. గడచిన మూడు వారాల్లో ఎన్నడూ లేనంతగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏకంగా 406 పాయింట్లకుపైగా ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌జేంజ్ సూచీ నిఫ్టీ సైతం దాదాపు 125 పాయింట్లు ఎగిసింది. సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మదుపరులు.. మంగళవారం కొనుగోళ్లపట్ల ఆసక్తి కనబరిచారు.

Pages