S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/12/2015 - 23:33

గత వారమంతా నష్టాల్లో దేశీయ మార్కెట్లు
25 వేల పాయింట్లకు చేరిన సెన్‌సెక్స్
9 నెలల్లో 5 వేల పాయింట్లు నష్టపోయిన సూచీ
రూ.10 లక్షల కోట్లు కోల్పోయిన మదుపరులు
గత వారం మార్కెట్ రివ్యూ

12/12/2015 - 23:32

1200 బిలియన్ డాలర్ల ప్రత్యేక నిధితో ‘మిషన్ మోడ్’లో పరుగులు
ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో మోదీ వెల్లడి

12/12/2015 - 23:31

సిఎం చంద్రబాబుతో ‘హెలియోస్టాట్’ చర్చలు
అనంతలో సౌర-పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రెడీ
పరికరాల తయారీ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

12/12/2015 - 07:10

కోల్‌కతా, డిసెంబర్ 11: అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం వరకు పెంచే వీలుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనా వేశారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నామని, మదుపరుల భయంతో పెను నష్టాలు వాటిల్లకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు.

12/12/2015 - 07:08

ముంబయి, డిసెంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో రెండేళ్లకుపైగా కనిష్ట స్థాయికి పతనమైంది. గురువారం ముగింపుతో చూస్తే 17 పైసలు క్షీణించి 66.88 స్థాయికి చేరింది. భారతీయ స్టాక్ మార్కెట్ల పతనం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మధ్య దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడింది.

12/12/2015 - 07:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సిమెంట్ సంస్థలపై విధించిన 6,316.59 కోట్ల రూపాయల జరిమానాను కాంపిటీషన్ అప్పీలెట్ ట్రిబ్యునల్ శుక్రవారం రద్దు చేసింది. స్వేచ్ఛా వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌లో కృత్రిమ కొరత, ధరల నిర్ణయంలో కుమ్మక్కవడం వంటి ఆరోపణలతో 11 సంస్థలపై 2012 జూన్-జూలైలో సిసిఐ జరిమానాను విధించింది.

12/12/2015 - 07:04

ముంబయి, డిసెంబర్ 11: సంపద సృష్టిలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్ దూసుకెళ్తోంది. గడచిన ఐదేళ్లలో అన్ని సంస్థలకంటే ముందుంది. 2010-15 మధ్య కాలంలో టిసిఎస్ 3,45,800 కోట్ల రూపాయల సంపదను సృష్టించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. ఆయా సంస్థల్లో మదుపరులు పెట్టిన పెట్టుబడుల హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ సర్వే ఫలితాలు ఇవ్వడం జరిగింది.

12/12/2015 - 07:02

హైదరాబాద్, డిసెంబర్ 11: సింగరేణి సంస్థతో చేసుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు వినియోగించుకుంటామని సిమెంట్ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సింగరేణి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తోందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

12/12/2015 - 07:02

ముంబయి, డిసెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఒకానొక దశలో 25 వేల స్థాయిని కోల్పోయింది. తిరిగి కోలుకున్నప్పటికీ 207.89 పాయింట్ల నష్టంతో 25,044.43 వద్ద స్థిరపడింది.

12/12/2015 - 07:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మెరుగైన ఉత్పత్తి.. అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపి)ని ఐదేళ్ల గరిష్ఠానికి చేర్చింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐఐపి గణాంకాలు 9.8 శాతంగా నమోదైయ్యాయి. సెప్టెంబర్‌లో ఇది 3.84 శాతంగా ఉండగా, గత ఏడాది అక్టోబర్‌లో మైనస్ 2.7 శాతంగా ఉంది.

Pages